• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

దోపిడీ ముఠాలకు నాయకత్వం మీది అంటూ విజయసాయి రెడ్డికి కౌంటర్ ఇచ్చిన టీడీపీ నేత బుద్దా వెంకన్న

|
  Buddha Venkanna Comments On Vijayasai Reddy || విజయసాయి రెడ్డి మాటలకు కౌంటర్ ఇచ్చిన బుద్దా వెంకన్న

  ఏపీలో ప్రజావేదిక ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటంపై రగడ కొనసాగుతూనే ఉంది . ప్రజావేదికే కాదు మాజీ సీఎం చంద్రబాబు నివాసం కూడా అక్రమ కట్టడం అని త్వరలో ఖాళీ చెయ్యాల్సిందే అన్న సంకేతాలు ఇస్తున్నారు వైసీపీ నేతలు. మరో పక్క చంద్రబాబు లేని సమయంలో ప్రజా వేదిక స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ వివాదంపై వైసీపీ ముఖ్య నేత విజయ సాయి రెడ్డి చాలా ఘాటుగా స్పందించారు . ఇక ఈ నేపధ్యంలో ఆయన మాటలకు కౌంటర్ ఇచ్చారు బుద్దా వెంకన్న .

  విజయసాయి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న

  విజయసాయి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న

  ప్రజావేదికపై జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు రాద్దాంతం చేయడం తగదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి. ఆ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ప్రజావేదిక విషయంలో టీడీపీ లీడర్లు డ్రామాలాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజావేదిక టీడీపీ సొంతం కాదని.. అది ప్రభుత్వ నిధులతో నిర్మించిందని స్పష్టం చేశారు. అలా నిర్మించిన ప్రజావేదికను టీడీపీ నేతలు పార్టీ కార్యక్రమాలకు వాడుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఇక ఈ నేపధ్యంలోనే బుద్దా వెంకన్న ఆయనకు కౌంటర్ ఇచ్చారు .

   రాజ్యసభకు వెళ్లినా, అక్రమాస్తుల కేసులో తమరు ఏ2నే కదా అని విజయసాయిని ఎద్దేవా చేసిన బుద్దా

  రాజ్యసభకు వెళ్లినా, అక్రమాస్తుల కేసులో తమరు ఏ2నే కదా అని విజయసాయిని ఎద్దేవా చేసిన బుద్దా

  రాజ్యసభకు వెళ్లినా, అక్రమాస్తుల కేసులో తమరు ఏ2నే కదా అని టీడీపీ నేత బుద్దా వెంకన్న వైసీపీ నేత విజయసాయిరెడ్డిని ఎద్దేవా చేశారు. జలయజ్ఞంలో మహామేత లక్ష కోట్లు మేశారని బుద్దా వెంకన్న ఆరోపించారు . అవినీతి సామ్రాట్టులై ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. తమరు రాజ్యసభకు వెళ్లినా..అక్రమాస్తుల కేసులో ఏ2నే కదా అని గుర్తు చేశారు. తమ తోడు దొంగ సీఎం అయినా ఏ1 కాదా? అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. అక్రమాలు చేయాలన్నా అక్రమాస్తులు కూడబెట్టాలన్నా ఏ1, ఏ2గా మీ రికార్డులు ఎవరూ అందుకోలేరంటూ ఆయన తనదైన శైలిలో ఫైర్ అయ్యారు . నీతి నిజాయితీల గురించి ఏ1, ఏ2లు చెబుతుంటే వీరప్పన్ మొక్కల పెంపకానికి పిలిచినట్టుందంటూ బుద్దా వెంకన్న వ్యంగ్యాస్త్రాలు సంధించారు .

  అక్రమాలు చేయాలన్నా..అక్రమాస్తులు కూడబెట్టాలన్నా మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు అన్న బుద్దా వెంకన్న

  అక్రమాలు చేయాలన్నా..అక్రమాస్తులు కూడబెట్టాలన్నా మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు అన్న బుద్దా వెంకన్న

  ఇక అంతే కాదు దొంగలకే దొంగ నువ్వు..దోపిడీ ముఠాలకు నాయకత్వం నీది. మీరు విజయ సాయి రెడ్డి కాదు ..విజయమాయరెడ్డి గారు.. అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజావేదిక అక్రమ నిర్మాణమంటావు. కలెక్టర్ల సదస్సుకు వాడితే తప్పేంటంటావు. అక్రమాలు చేయాలన్నా..అక్రమాస్తులు కూడబెట్టాలన్నా మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు అంటూ విజయసాయిరెడ్డిపై బుద్దా వెంకన్న విరుచుకు పడ్డారు. ఇక మొన్నటికి మొన్న టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపార్టీ ఫిరాయించిన నేతలు తనను బెదిరస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎంపీ, ప్రముఖ సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌తో తనను బెదిరించారని.. ఎంపీలు పార్టీ మారిన గంటలోపే బెదిరింపులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు . ఇక బుద్దా చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇక ఇప్పుడు ప్రజా వేదిక విషయంలో విజయ సాయి రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  TDP MLC Buddha Venkanna made sensational comments on Vijayasai Reddy. TDP Leader Budda Venkanna sarcastically said that he go to the Rajya Sabha, but he is A2 in the illegal assets case . Buddha Venkanna alleges that that he is a corruption king that's why he go to court every Friday.Buddha goes on to say that Veerappan has called for planting when jagan A1 and vijayasai reddy A2 are telling about the truth and honesty .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more