• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జగన్ దుర్యోధనుడు ... విజయసాయి శకుని ... తీవ్ర వ్యాఖ్యలు చేసిన బుద్దా

|

గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాలు సోషల్ మీడియాలోనే ఎక్కువ హల్ చల్ చేస్తున్నాయి . టీడీపీ, వైసీపీ మధ్య ట్వీట్ వార్ ఒక ప్రహసనంలా కొనసాగుతుంది . టీడీపీని టార్గెట్ చేస్తూ.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్స్ చేస్తూనే ఉన్నారు . టీడీపీ అధినేత చంద్రబాబుపై , లోకేష్ పై, అలాగే టీడీపీలో నాటి మంత్రులపై ఆయన తన పోస్ట్ లలో ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇక విజయసాయి ట్వీట్ లకు అంతే ఘాటుగా సమాధానం ఇస్తున్నారు టీడీపీ నేతలు అందునా ముఖ్యంగా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న .

అన్నదాతలు నేరస్థులు కాదు ..జగన్ గారూ అన్న కేశినేని నానీ

 టీడీపీ అధినేత చంద్రబాబు , లోకేష్ టార్గెట్ గా విజయసాయి పోస్ట్ .. రివర్స్ కౌంటర్ ఇచ్చిన బుద్దా వెంకన్న

టీడీపీ అధినేత చంద్రబాబు , లోకేష్ టార్గెట్ గా విజయసాయి పోస్ట్ .. రివర్స్ కౌంటర్ ఇచ్చిన బుద్దా వెంకన్న

లోకేష్ విషయ పరిజ్ఞానం లేకుండా ట్వీట్లు చేస్తున్నారని , 2014లో 3,800కోట్లున్న ఎక్సైజ్ ఆదాయాన్ని నాలుగేళ్లలో 8వేల కోట్లు దాటించారని.. జనాలతో పూటుగా తాగించి రాబడి పెంచాలని అధికారులకు టార్గెట్లు పెట్టింది చంద్రబాబేనని విమర్శించారు విజయసాయి . ఇక బందరు పోర్టును మరో రాష్ట్రానికి ఎలా అప్పగిస్తారో ఇంగిత జ్ఞానం ఉన్నవారెవరికీ అర్థం కాదంటూ టీడీపీ నేతల ఆరోపణలపై సెటైర్లు వేశారు. ఓటుకు నోటు కేసులో పారిపోయి వచ్చింది చంద్రబాబే కదా అని విజయసాయి చంద్రబాబును ఎద్దేవా చేశారు విజయసాయి . హరికృష్ణ పార్థివ దేహం సాక్షిగా లాలూచీకి ప్రయత్నించి భంగపడింది చంద్రబాబేనని ఆరోపించారు. టీడీపీ అవినీతి పుట్టలు బద్దలు కొడతామంటూ ఘాటుగా హెచ్చరించారు .ఇక ఈ వ్యాఖ్యలపై బుద్దా వెంకన్న రివర్స్ కౌంటర్ ఇచ్చారు.

దుర్యోధనుడిలాంటి జగన్ కి తోడుగా శకుని మామ విజయసాయి అన్న బుద్దా

దుర్యోధనుడిలాంటి జగన్ కి తోడుగా శకుని మామ విజయసాయి అన్న బుద్దా

ఏపీ సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలు దుర్యోధనుడు , శకుని అని మండిపడ్డారు. దుర్యోధనుడితో జగన్ ని, శకునితో విజయసాయిరెడ్డిని పోల్చుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవినీతి కి వారిద్దరూ పెట్టింది పేరని బుద్దా ట్వీట్ ద్వారా పేర్కొన్నారు . దుర్యోధనుడిలాంటి జగన్ కి తోడుగా శకుని మామ ఉండగా ఆంధ్రాలో అవినీతి తప్ప అభివృద్ధి అనేది పగటి కలే అంటూ ఓ ట్వీట్ చేశారు. హస్తినలో పాదపూజలకు అలవాటు పడ్డ విజయసాయిరెడ్డి, ఇంతకంటే ఏం మాట్లాడతారు? అని ప్రశ్నించారు. టీడీపీ మీద అవినీతి ఆరోపణలు చెయ్యటం తప్ప ఆయనకు వేరే పనేముంది అని ప్రశ్నించారు.

మరోసారి శ్రీకృష్ణజన్మస్థానం ప్రాప్తిస్తే అంతా సర్దుకుంటుందని పోస్ట్ పెట్టిన బుద్దా

మరోసారి శ్రీకృష్ణజన్మస్థానం ప్రాప్తిస్తే అంతా సర్దుకుంటుందని పోస్ట్ పెట్టిన బుద్దా

పోలవరం ప్రాజెక్ట్ గురించి కూడా ‘ప్రాజెక్టుల పనులకు రివర్స్ టెండరింగ్ అమలులోకి వస్తుందనగానే మీకు, మీ అధినేతకు వెన్నులో వణుకు పుడుతుందా ఉమా? పోలవరంలో మీరు దోచుకున్న ప్రతి రూపాయి కక్కిస్తాం. మీలాగా కుల, వర్గ బలహీనతలు సీఎం జగన్ గారికి లేవు. చూస్తారుగా తొందరెందుకు?'' అని పోస్ట్ చేశారు విజయసాయి. అయితే దీనిపై బుద్దా అవినీతి మీకు వెన్నతో పెట్టిన విద్య అని మరోసారి శ్రీకృష్ణజన్మస్థానం ప్రాప్తిస్తే అంతా సర్దుకుంటుందని, విజయసాయిరెడ్డి ‘ఏ2' ఇమేజ్ కి ఎటువంటి ఢోకా లేదంటూ ఘాటుగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP CM Jagan and YCP MP Vijayasayara Reddy called Duryodhana and Shakuni. Comparing Jagan with Duryodhana and Vijayasai Reddy with Shakuni, Buddha Venkanna made serious comments. Buddha tweeted that the two of them were responsible for the corruption. Shakuni's uncle, who was accompanied by Jagan like Duryodhana, tweeted that development in Andhra Pradesh was a day dream . curruption is their motto and they habituate to bend before bjp. if they had anything else to do with corruption charges against TDP. Buddha fired.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more