• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కర్రలతో బుద్దా వెంకన్న హంగామా: ఏపీ డీజీపీ, జగన్ లపై తీవ్ర వ్యాఖ్యలు; అరెస్ట్ చేసిన పోలీసులు

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై, టిడిపి నేత పట్టాభి ఇంటిపై దాడికి నిరసనగా టిడిపి అధినేత చంద్రబాబు పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నారు టిడిపి నేతలు. టిడిపి నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. టీడీపీ ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులను అరెస్టు చేస్తున్నారు.ఈ క్రమంలో టిడిపి నేత బుద్దా వెంకన్న విజయవాడలో హల్ చల్ చేశారు.

 కర్రలతో రోడ్ పైకి వచ్చే ప్రయత్నం చేసిన బుద్దా వెంకన్న అరెస్ట్ ..

కర్రలతో రోడ్ పైకి వచ్చే ప్రయత్నం చేసిన బుద్దా వెంకన్న అరెస్ట్ ..


బుద్దా వెంకన్న కర్రలతో రోడ్ల మీదికి వచ్చేందుకు ప్రయత్నం చేశారు. ఇక బుద్దా వెంకన్న ను అరెస్ట్ చేయడానికి రంగంలోకి దిగిన పోలీసులు ఆయన ఇంటికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. బుద్దా వెంకన్న అరెస్టు సమయంలో తీవ్ర తోపులాట జరిగింది. ఆ తోపులాటలో బుద్దా వెంకన్న చొక్కా చినిగింది. తనను అరెస్టు చేయడాన్ని బుద్దా వెంకన్న తీవ్రంగా ప్రతిఘటించారు. చివరకు బుద్దా వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. ఈ సమయంలో బుద్దా వెంకన్న వైసీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు.

పోలీసులపై నమ్మకం లేదన్న బుద్దా వెంకన్న

పోలీసులపై నమ్మకం లేదన్న బుద్దా వెంకన్న

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పైన కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంతకాలం తమకు చంద్రబాబునాయుడు గాంధీగారి సిద్ధాంతాన్ని బోధించాడని, ఇకపై లెక్కలు వేరుగా ఉండబోతున్నాయని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. తాము చివరి రక్తపు బొట్టు ఉన్నంతవరకు చంద్రబాబు తోనే ఉంటామని తేల్చిచెప్పారు. తాము ఆయారాం గయారాం లు కాబోమని చెప్పిన బుద్దా వెంకన్న ఏపీలో పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పోయిందని పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పోలీసుల పై నమ్మకం పోవడంతోనే తాము తమ రక్షణ తామే చేసుకుంటున్నామని, అందుకే కర్రలు చేతబట్టి రోడ్లపైకి వెళుతున్నాము అంటూ పేర్కొన్నారు.

డీజీపీ వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్నారు

డీజీపీ వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్నారు

రాష్ట్ర డిజిపి వైసిపి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పని చేస్తున్నారంటూ బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో డీజీపీ గౌతమ్ సవాంగ్ పై ధ్వజమెత్తారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని నిజాయితీ ఉన్న పోలీసు అధికారులు కూడా డీజీపీ వల్ల ఉద్యోగాలు చేయలేని పరిస్థితి నెలకొందని బుద్దా వెంకన్న ఆరోపణలు గుప్పించారు. మాకు మేమే రక్షణగా నిలబడి వైసిపి రౌడీ మూకలను అడ్డుకుని తీరుతామని పేర్కొన్నారు. ఒకప్పుడు పోలీసు వ్యవస్థపై ఎంతో గౌరవం ఉండేదని, కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని బుద్దా వెంకన్న అసహనం వ్యక్తం చేశారు.

జగన్ కనుసన్నల్లోనే దాడులు, చంద్రబాబు ఫోన్ చేసినా డీజీపీ స్పందించలేదు


దాడికి దాడే సమాధానమని తాము నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే దాడులు జరుగుతున్నాయని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. చంద్రబాబు ఫోన్ చేసినా డిజిపి స్పందించడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు గాంధీజీ సిద్ధాంతాల వల్ల వైసిపి కార్యకర్తలు రెచ్చిపోతున్నారు అంటూ మండిపడ్డారు. ఏపీలో ఆర్థిక ఎమర్జెన్సీ నెలకొందని దానిపై నుండి దృష్టి మళ్ళించడం కోసమే ఈ వరుస దాడులు చేస్తున్నారని బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు.

ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ .. బంద్, ఆందోళనలతో హీటెక్కిన ఏపీ

ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ .. బంద్, ఆందోళనలతో హీటెక్కిన ఏపీ

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పట్టాభి వ్యాఖ్యలు చేసిన అనంతరం వైసిపి కార్యకర్తలు పట్టాభి ఇంటితో పాటు టిడిపి కార్యాలయాల పైన దాడులు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ దాడులకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ బంద్ కు పిలుపునిచ్చింది. ఈరోజు రాష్ట్రంలో టిడిపి బంద్ కొనసాగుతోంది. టిడిపి బంద్ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలను ఎక్కడికక్కడ బయటకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. హౌస్ అరెస్టు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ బలగాలను మోహరించి ఎక్కడికక్కడ టిడిపి నేతలను అరెస్టు చేస్తూ బంద్ ను భగ్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

English summary
Telugu Desam Party National General Secretary Nara Lokesh fired over YCP activists attacks on Telugudesam party offices. Said the minute was enough to reverse attack on you, lokesh warned ys jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X