విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బుద్దా చెబితే బోండా వింటారా : చంద్రబాబు దూతగా పార్టీ మార్పుపై చర్చలు : ఉమా జంపింగ్ రూటు మారిందా..!!

|
Google Oneindia TeluguNews

కొద్ది రోజులుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా పార్టీ మారుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఆయన సైతం న్యూజిలాండ్ లో బంగీ జంప్ చేసే ఫొటో తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసి..విజయవాడకు రాగానే సంచలనాలు ఉంటాయని పేర్కొన్నారు. దీంతో..అందరూ ఈ జంప్ టీడీపీ నుండి చేసే పొలిటికల్ జంప్ గా భావించారు. బోండా ఉమా తన విదేశీ పర్యటన ముగించుకొని విజయవాడకు చేరుకున్నారు. ఆయనతో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సమావేశమయ్యారు. బోండా ఉమా పార్టీ మారకుండా బుద్దా వెంకన్న బుజ్జగించారని..దీంతో ఆయన పార్టీ మార్పు నిర్ణయం మార్చుకున్నారని లీకులు ఇచ్చారు. నిజంగా బుద్దా చెబితే బోండా ఉమా వింటారా..పార్టీ మారాలనే నిర్ణయం తీసుకొని ఉంటే బుద్దా వెంకన్న చర్చించగానే బోండా ఉమ నిర్ణయం మార్చేసుకుంటారా..ఇదే ఇప్పుడు విజయవాడ టీడీపీలో మొదలైన చర్చ. ఇంతకీ బోండా ఉమా పార్టీ మారుతున్నారా..జంపింగ్ రూటు మారిందా...

బోండా ఉమాతో బుద్దావ వెంకన్న చర్చలు..

బోండా ఉమాతో బుద్దావ వెంకన్న చర్చలు..

విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాతో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సమావేశమయ్యారు. కొద్ది రోజులుగా బోండా ఉమా పార్టీ మారుతున్నారనే ప్రచారం పైన వీరిద్దరి మధ్య చర్చ సాగినట్లు తెలుస్తోంది. చంద్రబాబు దూతగా బుద్దా వెంకన్న వచ్చారని చెబుతున్నారు. బోండా ఉమా పార్టీ మారుతున్నారనే వార్తల మీద ఆరా తీసినట్లు సమాచారం. బోండా న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న సమయం లో బంగి జంప్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి. ఆయన వైసీపీలోకి వెళ్తారని కొందరు..బీజేపీలోకి వెళ్తున్నారని మరి కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేసారు. తాను విజయవాడ చేరుకున్నాక సంచలన నిర్ణయాలు ఉంటాయని బోండా ఉమా పోస్టింగ్ పెట్టారు. ఇక, ఇప్పుడు ఆయన తిరిగి రావటంతో రాజకీయంగ ఎటువంటి అడుగులు వేస్తారనేది ఆసక్తి కరంగా మారింది. ఇదే సమయంలో బోండా ఉమా తో బుద్దా వెంకన్న సమావేశమై పార్టీ మారవద్దని..చంద్రబాబు సైతం ఇదే చెబుతున్నారని వారించినట్లు సమాచారం. అయితే..బోండా ఉమా పార్టీ మారటం లేదని స్పష్టం చేసారంటూ ఆ సమావేశం అనంతరం లీకులు ఇచ్చారు. అసలు..నిజంగా బోండా ఉమా పార్టీ మారాలి అనుకుంటే ఈ చర్చల ద్వారానే నిర్ణయాన్ని మార్చుకుంటారా అని తెలుగు తమ్ముళ్లే ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

<strong>జగన్ ఆదేశాలు మంత్రుల బేఖాతర్..బుగ్గన సైతం: టీడీపీ నేతల మాటకే ప్రాధాన్యత: సీఎం సీరియస్..! </strong>జగన్ ఆదేశాలు మంత్రుల బేఖాతర్..బుగ్గన సైతం: టీడీపీ నేతల మాటకే ప్రాధాన్యత: సీఎం సీరియస్..!

ఉమా జంపింగ్ రూటు మారిందా..

ఉమా జంపింగ్ రూటు మారిందా..

బోండా ఉమా టీడీపీ వీడి వైసీపీలోకి వెళ్తున్నారంటూ టీడీమీ మద్దతు మీడియా సైతం ప్రచారం చేసింది. దీనికి తగినట్లుగానే బోండా ఉమా పార్టీ పేరు చెప్పకపోయినా చేసిన పోస్టింగ్ అదే అర్దం వచ్చేలా కనిపించింది. వైసీపీలోకి బోండా ఉమా చేరుతున్నారని..ఆయనకు సెంట్రల్ నియోజకవర్గం లో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే ఉండటంతో విజయవాడ తూర్పు బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం సాగింది. దీని పైన ఇప్పటి వరకు అటు వైసీపీ నేతలు..ఇటు బోండా ఉమా ఎక్కడా స్పందించలేదు. ఈ సమయంలో బుద్దా వెంకన్న వచ్చి చర్చలు చేయటం..బోండా ఉమా పార్టీ మారటం లేదంటూ లీకులు ఇవ్వటం చూస్తుంటే బోండా ఉమా రాజకీయంగా వ్యవూహాత్మకంగా ఎత్తుగడలు వేస్తున్నారనే చర్చ సాగుతోంది. ఇదే సమయంలో కొందరు నేతలు బీజేపీలోకి రావాలంటూ బోండా ఉమ మీద ఒత్తిడి తెస్తున్నారనే ప్రచారమూ ఉంది. అయితే, బోండా ఉమా మాత్రం టీడీపీలో ఉంటారా..వీడుతారా అనే విషయం మీద సస్పెన్స్ కొనసాగిస్తున్నారు.

చంద్రబాబుతో భేటీలో స్పష్టత..

చంద్రబాబుతో భేటీలో స్పష్టత..

తాను పార్టీ మారుతున్నానే వార్తల క్రమంలో స్పష్టత ఇచ్చేందుకు బోండా ఉమా రెండు రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు తో భేటీ కావాలని నిర్ణయించారు. గతంలో కాకికాడలో టీడీపీ కాపు మాజీ ఎమ్మెల్యేల సమావేశం గురించి బోండా ఉమా..తోట త్రిమూర్తులు..ఇతర నేతలు చంద్రబాబును కలిసి వివరణ ఇచ్చారు. ఎన్నికల్లో ఆర్దిక పరమైన అంశాల మీద వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అప్పటి నుండి ఇప్పటి వరకూ తిరిగి ఎటువంటి సమావేశాలు జరగలేదు. బోండా ఉమ గురించి మాత్రమే పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక, ఇప్పుడు విజయవాడలో కేశినేని వర్సెస్ బుద్దా వెంకన్న రాజకీయం ..అదే సమయంలో కేశినేని నాని చేస్తున్న రాజకీయంతో బెజవాడ టీడీపీ శ్రేణులు గందర గోళంలో ఉన్నాయి. ఈ సమయంలో బోండా ఉమా సైతం పార్టీ వీడితే మరింతగా నష్టపోతామని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో..చంద్రబాబు తో బోండా ఉమా భేటీ సమయంలో పార్టీ మార్పు వ్యవహారం పైన పూర్తి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

English summary
As TDP Chief Chandra babu represntative MLC Budha Venkanna met Ex Mla Bonda Uma discussued on party Change. Bonda Uma Clarified that he will continue in TDP. With in two days Bonda Uma may meet Chandra Babu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X