నీతులు వల్లించారు, సిగ్గు లేకుండా ఎమ్మెల్యేలను కొంటున్నారు.. దేవుడి స్క్రిప్ట్ ఏమైంది: బుద్దా
టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సీఎం జగన్మోహన్ రెడ్డి పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సంతలో పశువులను కొన్నట్టు సిగ్గు లేకుండా మా ఎమ్మెల్యేలను ఎలా కొంటున్నారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసిన ఇసుక దీక్షపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ గా బుద్దా వెంకన్న అటు విజయసాయిరెడ్డిని, ఇటు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి సెటైర్లు వేశారు.
రాజధానిపై కమిటీ ఎందుకు? అమరావతి రైతుల ముందుకు వస్తారా ? ... చంద్రబాబు, బుద్దా ఫైర్
టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తున్నాడో తెలియట్లేదని, ఫ్లెక్సీలు, పోస్టర్లు, జెండాలు కట్టినంత మంది కూడా దొంగ దీక్షకు హాజరు కాలేదని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబు ఇక దీక్ష సందర్భంగా విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇసుక దీక్షకు జనాలు రాకపోతే వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
అంతేకాదు గతంలో నీతులు వల్లించిన జగన్ గారు సిగ్గు లేకుండా మా ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా ఎలా కొంటున్నారు అంటూ నిలదీశారు. ఇక దేవుడు స్క్రిప్ట్ ఏమైంది విజయసాయి రెడ్డి గారు అంటూ ఎద్దేవా చేశారు. జగన్ గారికి టిడిపి పేరు వింటేనే వణుకు పుడుతుందా అని ప్రశ్నించిన బుద్ధ వెంకన్న 23 మంది గెలిచారు అని ఎద్దేవా చేసిన మీ జగన్ గారు ఇప్పుడు ఎందుకు తడుపుకుంటున్నారో చంద్రబాబు గారిని చూసి నిద్రపట్టడం లేదా అంటూ వ్యాఖ్యలు చేశారు.
ట్విట్టర్ వేదికగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మీద, గతంలో దేవుడి స్క్రిప్ట్ ప్రకారమే 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాక్కున్నందుకు ఈసారి 23 సీట్లు వచ్చాయని ఎద్దేవా చేసిన జగన్మోహన్ రెడ్డి మీద ఆయన సెటైర్లు వేశారు. టిడిపి ఎమ్మెల్యేలను వైసీపీలో చేర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి తెగ తాపత్రయ పడుతున్నారు అని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.