విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బడ్జెట్ ఏపి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదు : చంద్రబాబు నాయుడు

|
Google Oneindia TeluguNews

కేంద్ర బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బడ్జెట్‌లో విభజన హామీలకు తూట్లు పొడిచిందని ఆయన విమర్శించారు. బడ్జెట్ ఏపి ప్రజలను నిరాశకు గురి చేసిందని మండిపడ్డారు. మరోవైపు బడ్జెట్‌లో పేదల సంక్షేమాన్ని విస్మరించారని అన్నారు. వ్యవసాయంతో పాటు ఆటోమొబైల్ రంగాలకు ప్రాధాన్యత తగ్గించారని దుయ్యబట్టారు.

ప్రత్యేక హోదా అంశంతో పాటు విభజన చట్టంలోని అంశాలను పూర్తిగా విస్మరించారని అన్నారు. ఏపిలో రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్‌ గాను రూ.4వేల కోట్లు మాత్రమే ఇచ్చారని, మిగిలిన దానిలో ఎంత ఇచ్చేది కాని, అందుకు కేటాయింపులుకాని ఈ బడ్జెట్ లో పేర్కొనక పోవడం ఆందోళనకరమన్నారు.

Budget did not meet the aspirations of the people: Chandrababu Naidu

అభివృద్ధి, పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వలేదని మండిపడ్డారు. గిరిజన యూనివర్సిటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయానికి.. రూ.13 కోట్లు మాత్రమే కేటాయించారని, ఐఐటీ, నిట్‌, ఐఐఎం, ట్రిపుల్‌ ఐటీ, ఐజర్‌ లాంటి.. విద్యాసంస్థలకు ఒక్కపైసా కూడా కేటాయించలేదని చెప్పారు. విశాఖ, విజయవాడ మెట్రోలు, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టులకు బడ్జెట్‌లో కేటాయింపులు లేవని చంద్రబాబు ఆరోపించారు.
English summary
the Union Budget did not meet the aspirations of the people said Former Chief Minister Chandrababu Naidu. He criticized the widening of the budget for separation guarantees. On the other hand, the welfare of the poor was ignored in the budget.the priority for agriculture and the automobile sector has been reduced He said .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X