విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో క్యాపిటల్ వార్ .. టీడీపీ , వైసీపీ నేతల ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు .. పరువు నష్టం దావాలు!!

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులప్రకటన ఏపీలో రాజకీయ యుద్ధాలకు కారణం అయ్యింది. నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగాయి.ఒకరి మీద ఒకరు చేసుకున్న ఆరోపణలతో పరువునష్టం దావాలు వేసుకునే దాకా వెళ్ళారు టీడీపీ, వైసీపీ నేతలు .

రాజధాని మహిళలపై పోలీసుల దాడి.. నిరసనగా అమరావతి బంద్..ఎన్‌హెచ్‌ఆర్సీకి టీడీపీ ఫిర్యాదురాజధాని మహిళలపై పోలీసుల దాడి.. నిరసనగా అమరావతి బంద్..ఎన్‌హెచ్‌ఆర్సీకి టీడీపీ ఫిర్యాదు

టీడీపీ , వైసీపీ నేతల ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు

టీడీపీ , వైసీపీ నేతల ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు


ఇన్ సైడర్ ట్రేడింగ్ ఏపీ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తుంది .రాజధాని ఏరియాలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ఒకరిమీద ప్కరు ఆరోపణలు చేసుకుంటున్నారు.భూములు మీరు కొన్నారంటే మీరు కొన్నారంటూ వైసీపీ, టీడీపీ నేతలు విమర్శించుకుంటున్నారు. రాజధాని అమరావతిలో టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారని వైసీపీ నేతలు అంటుంటే విశాఖలో వైసీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

అమరావతిలో టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారని పేర్లతో సహా ప్రకటన

అమరావతిలో టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారని పేర్లతో సహా ప్రకటన


అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ముందే పార్టీ నేతలకు లీక్ చేశారని, దాంతో టీడీపీ నేతలు అమరావతిలో భూములను కొని ఇన్‌సైడర్ ట్రేడింగ్ పాల్పడ్డారంటూ వైసీపీ నేతలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అంతే కాదు టీడీపీ నేతల పేర్లు ప్రకటించి మరీ ఆరోపణలు చేశారు. టీడీపీ నేతలు కంభంపాటి రామ్మోహన్ రావు,పత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ళ నరేంద్ర, పరిటాల శ్రీరాం, నారాయణ, వంటి వారికి భూములున్నట్లు పేర్కొన్నారు. దాంతో టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

 టీడీపీ నేతల ఆగ్రహం .. పరువు నష్టం దావాలు వేస్తామని ప్రకటన

టీడీపీ నేతల ఆగ్రహం .. పరువు నష్టం దావాలు వేస్తామని ప్రకటన


వైసీపీ నేతలు నిరాధారంగా భూములు లేనివారిని, ఎప్పుడో గతంలో ఏపీ విభజన జరగక ముందు భూములు కొన్న వారిని ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణల పరిధిలోకి తేవడాన్ని వారు చాలా సీరియస్ గా తీసుకుని పర్వు నష్టం దావా వెయ్యటానికి సిద్ధం అవుతున్నారు.. కంభంపాటి వంటి నేతలు తాము 2006లో కొన్న భూములను 2014 తర్వాత కొన్నట్లుగా వైసీపీ నేతలు పేర్కొని, తన పరువుకు నష్టం కలిగించారంటూ డిఫమేషన్ కేసు వేస్తున్నట్టు ప్రకటించారు. ఇక పరిటాల శ్రీరామ్, ధూళిపాళ్ళ నరేంద్ర కూడా వైసీపీ నేతలపై పరువునష్టం దావా వేయనున్నట్లు ప్రకటించారు.

 వైజాగ్ లో వైసీపీ ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసిందన్న టీడీపీ ..డిఫమేషన్ వేస్తామన్న వైసీపీ

వైజాగ్ లో వైసీపీ ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసిందన్న టీడీపీ ..డిఫమేషన్ వేస్తామన్న వైసీపీ

ఇక ఇదే సమయంలోతాజాగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖను ప్రకటించే ముందే వైసీపీ నేతలు వైజాగ్‌లో పెద్ద ఎత్తున భూములు కొన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బొత్స సత్యనారాయణ, విజయ సాయి రెడ్డి తోపాటు పలువురు వైసీపీ నేతలు విశాఖలో భూములు కొన్నారని టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు . ఈ ఆరోపణల్లో నిజం లేదంటున్న వైసీపీ నేతలు ఈ ఆరోపణలు చేసిన తెలుగుదేశం నాయకులపై రివర్స్ లో పరువునష్టం దావాలను వేస్తామని ప్రకటిస్తున్నారు. మొత్తానికి మాటల యుద్ధం కాస్తా లీగల్ ఫైట్ గా మారుతుంది . అసలు రాజధాని విషయం అటుంచి భూముల కొనుగోలు రచ్చ ఏపీ రాజకీయ నాయకుల పరువును గంగలో కలిపేస్తుంది.

English summary
AP CM Jagan Mohan Reddy's campaign in three capitals has caused political wars in AP. Allegations and rivalries between the leaders continued.Inspider Trading in AP warms the political climate. the alligations made by ycp tdp leaders announced they are filing Defamation cases on ycp leaders. at the same time ycp leaders also filing Defamation cases on tdp leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X