విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆయేషా మీరా హత్య కేసులో కొత్త ట్విస్ట్: కోనేరు సతీష్‌ను విచారించిన సీబీఐ

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆయేషా మీరా కేసులో సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) దర్యాఫ్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీష్‌ను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. సతీష్‌తో పాటు అతని మిత్రులను కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు.

గతంలో సీఐడీ సతీష్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయేషా హత్య కేసులో మృతురాలి కుటుంబ సభ్యులు సతీష్ పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కోనేరు సతీష్‌ను సీబీఐ అధికారులు విచారించడం కీలక పరిణామం అని చెప్పవచ్చు.

CBI officers grills Koneru Satish over Ayesha Meera murder case

కోనేరు సతీష్‌ను సీబీఐ అధికారులు ఆయన ఇంటి వద్దే ప్రశ్నిస్తున్నారు. ఆయేషా హత్య కేసులో తొలుత ఆరోపణలు ఎదుర్కొన్నది సతీష్. ఆయేషా మీరా చనిపోయిన హాస్టల్ వార్డెన్‌కు, కోనేరు సతీష్‌కు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, తరచూ అతను హాస్టల్ వద్దకు వచ్చేవారని, తన స్నేహితులతో కూడా కలిసి వచ్చి హాస్టల్ కింది గదిలో మద్యం తాగి గొడవ చేసేవాడనే ఆరోపణలు కూడా ఉన్నాయని అంటున్నారు.

విచారణ పేరుతో టార్చర్ పెట్టారు, ఆ డబ్బు ఎక్కడిదంటే: ఆయేషామీరా కేసుపై సత్యంబాబువిచారణ పేరుతో టార్చర్ పెట్టారు, ఆ డబ్బు ఎక్కడిదంటే: ఆయేషామీరా కేసుపై సత్యంబాబు

ఆయేషా మీరాపై అతనే చంపేశాడనే ఆరోపణలు ఉన్నాయి. మృతురాలి తల్లి కూడా అతని పేరునే ప్రస్తావిస్తోంది. ఈ ఘటన జరిగినప్పుడు కోనేరు సతీష్ తాత కోనేరు రంగారావు డిప్యూటీ సీఎంగా ఉన్నారని, వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. దీంతో సతీష్‌ను కేసు నుంచి తప్పించేందుకు సాక్ష్యం లేకుండా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు సీఐడీ... ఆయేషా మీరా హత్య కేసుకు, సతీష్‌కు సంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చింది.

English summary
CBI officers grilling Koneru Satish in his home over Ayesha Meera murder case on Friday. Ayesha Meera mother suspecting Koneru Satish involvement in daughter's murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X