విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప‌ని మొద‌లు పెట్టిన సిబిఐ : తొలి కేసు వారి మీదే న‌మోదు

|
Google Oneindia TeluguNews

ఏపిలో కోర్టు ఆదేశంతో మొద‌లైన సిబిఐ కేసులో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ద‌ర్యాప్తును వేగ‌వంతం చేసిన సిబిఐ అందులో తొలిగా ముగ్గురు ఉద్యోగుల పై కేసు న‌మోదు చేసింది. రాష్ట్ర ప్ర‌భుత్వం సిబిఐ విచార‌ణ‌కు అనుమ‌తి నిరాక‌రించిన త‌రువాత కోర్టు ఆదేశాల‌తో సిబిఐ రంగంలోకి దిగిన మొద‌టి కేసు ఇది..

సిబిఐ ద‌ర్యాప్తు

సిబిఐ ద‌ర్యాప్తు

సంచ‌న‌లం సృష్టించిన ఆయేషా మీరా హ‌త్య కేసు కు సంబంధించి సీబీఐ విచార‌ణ వేగ‌వంతం చేసింది. విచార‌ణ లో భాగంగా..కేసు పూర్వ‌ప‌రాల‌ను సేక‌రించింది. హ‌త్య జ‌రిగిన స‌మ‌యం నుండి ఇప్ప‌టి వ‌ర‌కు విచార‌ణ లో వెలుగు లోకి వ‌చ్చిన విష‌యాల‌ను..అభియోగాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంది. ఇక‌, విచార‌ణ లో భాగంగా.. కేసుకు సంబంధించిన సాక్ష్యాలు..పత్రాల‌ను తారుమారు చేసార‌నే ఆరోప‌ణ పై చ‌ర్య‌లు మొద‌లు పెట్టింది. దీనికి సంబంధించి విజ‌య‌వాడ కోర్టుకు చెందిన ముగ్గురు ఉద్యోగుల పై సిబిఐ కేసు న‌మోదు చేసింది.

ఆయేషా హ‌త్య

ఆయేషా హ‌త్య

ఆయేషా హ‌త్య జ‌రిగిన స‌మ‌యం నుండి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప‌రిణామాలు..అభియోగాల పై సిబిఐ పూర్తి స‌మాచారం సేక‌రించింది. అందులో భాగంగా.. గ‌తంలో సిట్ చేసిన విచార‌ణ‌కు సంబంధించిన స‌మాచారాన్ని సిబిఐ సేక‌ర‌ణ చేసింది. కేసుకు సంబంధించిన అన్ని రకాల పత్రాలు, సాక్ష్యాధారాలు, ఇప్పటి వరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) జరిపిన దర్యాప్తు వివరాలన్నీ సీబీఐ వినియోగించుకోవచ్చని సూచించింది. ఈ తీర్పు ఆధారంగా సిబిఐ కేసు విచార‌ణ ప్రారంభించింది.

కోర్టు ఉత్వ‌ర్వుల ద్వారా సిబిఐ విచార‌ణ

కోర్టు ఉత్వ‌ర్వుల ద్వారా సిబిఐ విచార‌ణ

ఏపి ప్ర‌భుత్వం రాష్ట్రంలో సిబిఐ విచార‌ణ‌కు అనుమ‌తి నిరాక‌రించిన త‌రువాత‌.. కోర్టు ఉత్వ‌ర్వుల ద్వారా సిబిఐ విచార‌ణ ప్రారంభించిన తొలి కేసు ఇదే. ఇప్ప‌టికే ఈ కేసులో పూర్తి స‌మాచారం సేక‌రిస్తున్న సిబిఐ తొలి ఎఫ్ఐఆర్ న‌మోదు చేసింది. గ‌తంలో రాష్ట్ర ప్ర‌భుత్వం నియ‌మించిన సిట్ పూర్తి స్తాయిలో ద‌ర్యాప్తు చేయ‌లేక పోవ‌టానికి కార‌ణ మైన అంశాల పై దృష్టి సారించింది. కేసు న‌మోదు అయిన‌ప్ప‌టి నుండి ఉన్న రికార్డులు లేక‌పోవ‌ట‌మే ప్ర‌ధాన కార‌ణ మ‌ని చెప్ప‌టం తో..ముందుగా విజ‌య‌వాడ కోర్టు ఉద్యోగుల పై కేసు న‌మోదు చేసింది. దీంతో..సిబిఐ ఈ కేసులో రానున్న రోజుల్లో ఏ ర‌కంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌నే ఆస‌క్తి క‌రంగా మారింది..

English summary
CBI file FIR in Ayesha Meera murder case. with Court orders Cbi started investigation in this case. CBI filed Fir on vijayawada court staff.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X