విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విచారణ పేరుతో టార్చర్ పెట్టారు, ఆ డబ్బు ఎక్కడిదంటే: ఆయేషామీరా కేసుపై సత్యంబాబు

|
Google Oneindia TeluguNews

విజయవాడ: సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో సత్యంబాబును సీబీఐ అధికారులు శుక్రవారం అతనిస్వగ్రామమైన కృష్ణా జిల్లాలోని నందిగామలోని అన్నసాగరం గ్రామంలో విచారణ జరిపారు. ఇంట్లో ఓ ప్రత్యేక గదిలో విచారణ చేశారు.

మీడియాకు అనుమతిని నిరాకరించారు. ఆయేషా హత్య కేసులో ఎనిమిదళ్లకు పైగా సత్యం బాబు జైలు శిక్ష అనుభవించారు. 2017లో విడుదలయ్యారు. హైకోర్టు ఆయనను నిర్దోషిగా తేల్చి, విడుదల చేసింది. తాజాగా, సీబీఐ ఆయనను విచారించింది.

నన్ను ఆయేషా హత్య కేసులో ఇరికించారు

నన్ను ఆయేషా హత్య కేసులో ఇరికించారు

ఆయేషా మీరా హత్య కేసులో తనను ఇరికించారని సత్యంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ పేరుతో పోలీసులు తనను చిత్రహింసలు పెట్టారన్నారు. ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించిన వివరాలను సత్యంబాబు సీబీఐ అధికారులకు అందించారు. రెండు గంటలకు పైగా సత్యంబాబును సీబీఐ విచారించింది. ప్రస్తుతం బతికేందుకు తనకు ఉపాధి కూడా లేదని ఆయన చెప్పారు.

ఆయేషామీరా హత్య కేసుపై సత్యంబాబు ఏమన్నారంటే

జైల్లో ఉన్నప్పుడు చేసిన పనికి డబ్బిచ్చారు

జైల్లో ఉన్నప్పుడు చేసిన పనికి డబ్బిచ్చారు

ఆయేషా హత్ కేసులో సీబీఐ అధికారుల బృందం ఆయనను విచారించింది. ఆతని నుంచి పలు వివరాలు రాబట్టింది. బ్యాంక్ అకౌంట్‌లో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని, ఎక్కడ వాడావని సత్యం బాబును సీబీఐ అధికారులు ప్రశ్నించారు. తాను జైల్లో ఉన్నప్పుడు నేను చేసిన పనికి డబ్బులు ఇచ్చారని సత్యంబాబు చెప్పారు. ఆ డబ్బును గ్రామంలో అప్పులు ఉన్న వారికి చెల్లించానని చెప్పారు.

ఆయేషా హాస్టల్ ఎక్కడుందో తెలియదు

ఆయేషా హాస్టల్ ఎక్కడుందో తెలియదు

ఆయేషా హత్య జరిగిన హాస్టల్ ఎక్కడ ఉందో తెలుసా అని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఆ హాస్టల్ తనకు తెలియదని సత్యంబాబు చెప్పారు. హత్య జరగకుముందు 15 రోజులు పెయింటింగ్ పని కోసం వెళ్లానని చెప్పారు. తన తల్లిని, చెల్లిని చంపుతానని పోలీసులు బెదిరించడం వల్లే హత్య చేసినట్లు అంగీకరించానని, తన చేత బలవంతంగా ఒప్పించారని చెప్పారు.

విచారణ పేరుతో టార్చర్ పెట్టారు

విచారణ పేరుతో టార్చర్ పెట్టారు

విచారణ పేరుతో పోలీసులు తనను టార్చర్ పెట్టారని సత్యంబాబు చెప్పారు. ఆ టార్చర్ తట్టకోలేక, బెదిరింపుల వల్ల నేరం చేసినట్లుగా అంగీకరించినట్లు చెప్పారు. ప్రస్తుతం తనకు బదకడానికి పని కూడా దొరకడంలేదని చెప్పారు. తనకు సెల్ ఫోన్ల పైన మోజు ఉండేదని, అందువల్ల తాను ఫోన్లను దొంగిలించానని చెప్పాడు. కానీ పోలీసులు తనను ఆయేషా హత్య కేసులో ఇరికించారన్నాడు.

English summary
In the sensational Ayesha Meera murder case, CBI officials have picked up the pace in the investigation process. A team of CBI officers has reached to the house of the accused Pidathala Satyam Babu at Annasagaram village in Nandigama, Krishna district on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X