విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు..లోకేశ్ బైఠాయింపు: భద్రతా సిబ్బంది తోసేసారంటూ: అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత..!

|
Google Oneindia TeluguNews

అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత నెలకొని ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలతో కలిసి ప్రభుత్వం మీడియా పైన విధించిన ఆంక్షలను నిరసిస్తూ ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలతో కలిసి అసెంబ్లీలోకి వెళ్లే సమయంలో వారిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. టీడీపీ సభ్యుల వద్ద ఉన్న ప్లకార్డులు.. నల్ల రిబ్బన్లను లోపలకు అనుమతించేది లేదని అడ్డుకున్నారు. దీంతో..చంద్రబాబుతో సహా లోకేశ్ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. భద్రతా సిబ్బంది హద్దు మీరి ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. నల్ల రిబ్బెన్లు కట్టుకొని నిరసన వ్యక్తం చేసారు. వెంటనే ప్రభుత్వం మీడియా పైన ఆంక్షలు విధిస్తూ జారీ చేసిన జీవో 2430 రద్దు చేయాలని డిమాండ్ చేసారు. అసెంబ్లీలోకి రాకుండా కొన్ని మీడియా సంస్థల పైన నిషేధం విధించటం పైనా ఆగ్రహం వ్యక్తం చేసారు.

దిశ చట్టం..కొత్త సందేహాలు: జగన్ ఎంత కసిగా చెప్పారంటే..: అసెంబ్లీ ఓకే చేసినా..గవర్నర్ ఆమోదించేనా..!దిశ చట్టం..కొత్త సందేహాలు: జగన్ ఎంత కసిగా చెప్పారంటే..: అసెంబ్లీ ఓకే చేసినా..గవర్నర్ ఆమోదించేనా..!

అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత..

అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత..

ప్రజాస్వామ్యానికి మీడియా ఫోర్త్‌ ఎస్టేట్‌ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వ్యవస్థల్లో లోపాలను ఎత్తిచూపే మీడియాకు ప్రభుత్వం సంకెళ్లు వేసిందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేసారు. కళ్లకు, నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని అసెంబ్లీ వద్ద టీడీపీ నేతలు నిరసన తెలుపుతున్నారు. ట్రాయ్‌ ఆదేశాలున్నా ఎంఎస్‌వోలపై ఒత్తిడి తెచ్చి ప్రసారాలు నిలిపివేశారని ఆయన ఆరోపించారు. ఫైబర్‌‌గ్రిడ్‌కు ఫైన్‌ వేసినా సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలతో కలిసి సభలో ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ప్లకార్డులు..నల్ల రిబ్బెన్లతో లోపలకు అనుమతించమని భద్రతా సిబ్బంది అడ్డుపడటంతో..వారి పైన చంద్రబాబు..లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. అక్కడే భైఠాయించారు. దీంతో..వారికి మద్దతుగా పార్టీ నేతలు సైతం ఆందోళన ప్రారంభించారు.

నల్ల రిబ్బెన్లు కట్టుకొని నిరసన..

నల్ల రిబ్బెన్లు కట్టుకొని నిరసన..

టీడీపీ అధినేత చంద్రబాబు..లోకేశ్ పార్టీ నేతలు నల్ల రిబ్బెన్లు కట్టుకొని నిరసన వ్యక్తం చేసారు. ఏపీలో మీడియాపైన ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేసారు. అసెంబ్లీలో మీడియాను నిషేధించటం ఏంటని ప్రశ్నించారు. అదే సమయంలో భద్రతా సిబ్బంది తమను అడ్డుకోవటం పైనా సీరియస్ అయ్యారు. భద్రతా సిబ్బంది హద్దు మీరి వ్యవహరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని హరించినవాళ్లు కాలగర్భంలో కలిసిపోయారు. ఇవాళ సాయంత్రం గవర్నర్‌ను కలుస్తాం.. అవసరమైతే కోర్టుకెళ్తామని చంద్రబాబు స్పష్టం చేసారు. ఇదే సమయంలో సభలో నిత్యావసర ధరల విషయం మీద చర్చ సాగుతోంది. ఈ సమయంలో సభ బయట జరుగుతున్న ఆందోళనతో టీడీపీ నేతలు అక్కడకు చేరుకున్నారు. తక్షణమే జీవో 2430 రద్దు చేయాలని నినాదాలు చేస్తున్నారు. ఆ తరువాత సభలోకి వెళ్లిన సభ్యులు ఇదే అంశం పైన చర్చ ప్రారంభించారు.

చంద్రబాబు పైన దాడి చేసారంటూ

చంద్రబాబు పైన దాడి చేసారంటూ

ఇక సభలోకి వెళ్లిన తరువాత టీడీపీ సభ్యులు దీని పైన స్పీకర్ ను ప్రశ్నించారు. భద్రతా అధికారి అత్యుత్సాహం ప్రదర్శించి ఏకంగా ప్రతిపక్ష నేత ను నెట్టేసారని..ఆయనను చేయి పట్టుకొని తోసేసారని ఆరోపించారు. ఇక, సభ్యులు ఎలా వస్తారని ప్రశ్నించారు. ప్లకార్డులు..బ్యానర్లు తీసేసుకున్నారని..అయినా నల్ల రిబ్బెన్లు తీసుకోవటం ఏంటని నిలదీసారు. అయితే, టీడీపీ కావాలనే రాద్దాంతం చేస్తున్నారంటూ మంత్రి బుగ్గన కౌంటర్ ఇచ్చారు. 1999లో యనమల స్పీకర్ గా ఉన్న సమయంలోనే విధించిన నిబంధనలకు అనుగుణంగానే సిబ్బంది నడుచుకుంటున్నారని వివరణ ఇచ్చారు.

English summary
TDP Chief Chandra Babu and Lokesh protest against restriction on media in assembly. CBN serious on security staff on their attitude towards members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X