విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్..నా చాంబర్ అద్దాలు పగలకొట్టారు: ఉన్నాది సీఎంగా ఉన్నారంటూ: చంద్రబాబు వ్యాఖ్యలతో రగడ..!

|
Google Oneindia TeluguNews

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నాలుగో రోజు సైతం అధికార..విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. మీడియా స్వచ్చేను హరిస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేస్తూ అసెంబ్లీ లోకి ప్రవేశించేం దుకు ప్రయత్నించిన టీడీపీ నేతలను మార్షల్స్ అడ్డుకోవటం పైన టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని పైన సభలో నిరసన వ్యక్తం చేసింది. అయితే, సభలో టీడీపీ..మార్షల్స్ మధ్య జరిగిన వాదనను ప్రభుత్వం సభలో ప్రదర్శించింది. అందులో ప్రతిపక్ష నేత చంద్రబాబు ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఉన్నాది సీఎంగా ఉన్నారని..మీరు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. దీంతో..వైసీపీ నేతలు ఎదురు దాడి చేసారు. ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. ఆ సమయంలో చంద్రబాబు తాను సీఎంగా ఉండగా..వైయస్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చోటు చేసుకున్న విషయాలను గుర్తు చేసారు. ఆ తరువాత ముఖ్యమంత్రి ఈ మొత్తం చర్చకు ముగింపు పలికారు.

చంద్రబాబు..లోకేశ్ బైఠాయింపు: భద్రతా సిబ్బంది తోసేసారంటూ: అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత..!చంద్రబాబు..లోకేశ్ బైఠాయింపు: భద్రతా సిబ్బంది తోసేసారంటూ: అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత..!

 వైయస్ నా చాంబర్ అద్దాలు పగలకొట్టారు

వైయస్ నా చాంబర్ అద్దాలు పగలకొట్టారు

శాసనసభ లోపలకు వస్తున్న తన పైన శాసనసభ చీఫ్ మార్షల్ అనుచితంగా ప్రవర్తించారని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఫిర్యాదు చేసారు. అదే సమయంలో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి విపక్ష నేతగా ఉన్న సమయంలో అసెంబ్లీలో తన చాంబర్‌ అద్దాలు పగలుగొట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. అసెంబ్లీ గేటు దగ్గర చీఫ్‌ మార్షల్‌ దారుణంగా ప్రవర్తించారన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల అనుచితంగా వ్యవహరించారన్నారు. ప్లకార్డులు, బ్యానర్లు, నల్ల రిబ్బన్లు వద్దంటున్నారని.. చివరికి కాగితాలు కూడా తీసుకెళ్లనీయడం లేదని బాబు మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలపై చేయి వేసి తోసేశారన్నారు. ఎమ్మెల్యేను అవమానించినవారిని కఠినంగా శిక్షించాలని.. గతంలో ప్లకార్డులు తీసుకొచ్చి సభలో వైసీపీ ఎమ్మెల్యేలు యుద్ధవాతావరణం సృష్టించారని చంద్రబాబు తెలిపారు. అసెంబ్లీలో పులివెందుల పంచాయితీ చేస్తామంటే కుదరదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

వైయస్ కు సంబంధం లేదంటూ..ఆనం

వైయస్ కు సంబంధం లేదంటూ..ఆనం

చంద్రబాబు చెప్పిన అంశాలతో ఆనం విభేదించారు. అప్పుడు ముఖ్యమంత్రి చాంబర్ వద్దకు సీఎల్పీ నేతగా ఉన్న వైయస్ తో కలిసి తాము ధర్నా చేయటానికి వెళ్లామని..ఆ సమయంలో మార్షల్స్ రావటంతో కాంగ్రెస్ సభ్యులు..మార్షల్స్ దురుసు ప్రవర్తనతో కింద పడ్డారని వివరించారు. దాంతో అప్పుడు ముఖ్యమంత్రి చాంబర్ వద్ద ఉన్న పూల మొక్కలు పగలటంతో పాటుగా కిటీకీల అద్దాలు సైతం ధ్వంసమయ్యా యని చెప్పుకొచ్చారు. దీని మీద అప్పుడు సభలో ఉన్న ఎథిక్స్ కమిటీతో విచారించి..ఆ తరువాత తమ తప్పు లేదని తేల్చారని ఆనం వివరించారు.

 చంద్రబాబు వ్యాఖ్యల పైన వైసీసీ ఆగ్రహం

చంద్రబాబు వ్యాఖ్యల పైన వైసీసీ ఆగ్రహం

చంద్రబాబు మార్షల్స్ తో వాగ్వాదం సమయంలో చోటు చేసుకున్న ఘటనను వీడియోగా సభలో ప్లే చేశారు. ఇందులో.. ఒక ఉన్మాది ముఖ్యమంత్రి అయితే ఇలాగే ఉంటుంది..అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీని మీద వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. చివరకు ముఖ్యమంత్రి ఏం చేసినా చంద్రబాబు క్షమాపణ చెప్పరని తనకు తెలుసని...అది ఆయన సంస్కారినికే వదిలేయాలని సూచించారు. దీంతో..స్పీకర్ సైతం ఈ మొత్తం వ్యవహారం పైన తాను వీడియో ఫుటేజ్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. అదే విధంగా సీఎం పైన చేసిన వ్యాఖ్యల మీద ఎథిక్స్ కమటీకి రిఫర్ చేస్తానని స్పష్టం చేసారు.

English summary
Oppostion leader Chandra babu comments created heat in AP assembly. CBN complaint on Assembly marshal to speaekr on his misbehavious with party leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X