• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

న‌ర‌సింహ‌న్‌కు ప‌దోన్న‌తి..ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్:జ‌గ‌న్‌కు స‌మాచారం:పేరు ఖ‌రారు.రాజ్ భ‌వ‌న్ సిద్దం

|
  తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లు | Govt Decided To Nominate Two Governors For Telugu States

  ఏపీకీ కొత్త గ‌వ‌ర్న‌ర్ వ‌స్తున్నారు. ప‌దేళ్ల కాలంలో గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న న‌ర‌సింహ‌న్‌కు ప‌దోన్న‌తి. ఇప్ప‌టి వ‌ర‌కు ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ నుండి తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లు. ఏపీ గ‌వ‌ర్న‌ర్ కోసం రాజ్‌భ‌వ‌న్ సైతం సిద్దం. దీని పైన ముందుగానే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు స‌మాచారం అందింది. కొత్త గ‌వ‌ర్న‌ర్ గా ఎవ‌రొచ్చేదీ సంకేతాలు అందాయి. దీంతో ..ప్ర‌స్తుతం జ‌రుగున్న పార్ల‌మెంట్ స‌మావేశాలు ముగిసిన త‌రువాత దీనికి సంబంధించిన ఉత్త‌ర్వులు అధికారికంగా జారీ కానున్నాయి.

  న‌రసింహ‌న్‌కు ప‌దోన్న‌తి..కీల‌క బాధ్య‌త‌లు..

  న‌రసింహ‌న్‌కు ప‌దోన్న‌తి..కీల‌క బాధ్య‌త‌లు..

  ప్ర‌స్తుత గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ చ‌త్తీస్‌ఘ‌డ్ గవర్నర్‌గా ఉంటూ 2009 డిసెంబ‌ర్ 27న ఉమ్మ‌డి ఏపీ గ‌వ‌ర్న‌ర్‌గా అద‌న పు బాధ్య‌తలు స్వీకరించారు. ఆ త‌రువాత కిర‌ణ్ ముఖ్య‌మంత్రి అవ్వ‌టం.. 2014లో రాష్ట్ర విభ‌జ‌న‌.. రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య స‌మ‌స్య‌లు వంటివి ఫేస్ చేసారు. రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ప‌దేళ్ల పాటు అంటే 2024 వ‌ర‌కు
  తెలుగు రాష్ట్రాలకు ఒకే గ‌వ‌ర్న‌ర్ కొన‌సాగాలి. ఇప్ప‌టిక అయిదేళ్లు పూర్త‌యింది. అయితే, రెండు రాష్ట్రాలు పూర్తిగా వాటి భూభాగాల నుంచి పరిపాలన సాగిస్తుండటం, హైకోర్టు కూడా వేరుపడిన నేపథ్యంలో గవర్నర్లను వేరుగా నియమిస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి కేంద్రం వచ్చినట్లు స‌మాచారం. న‌ర‌సింహ‌న్‌కు గ‌తంలో కేంద్ర ఇంట‌లిజెన్స్ బ్యూరో లో ప‌ని చేసిన అనుభ‌వం..ప్ర‌స్తుత జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుడిగా వ్య‌వ‌హ‌రిస్త‌న్న అజిత్ ధోవ‌ల్‌కు స‌న్నిహితుడిగా ఉండ‌టంతో ఆయ‌న‌కు కేంద్రంలో కీల‌క ప‌ద‌వి వ‌స్తుంద‌ని స‌మాచారం. జమ్ముకశ్మీర్‌ వ్యవహారాల సలహాదారుగా కొత్త బాధ్య‌త‌లు ఇస్తార‌ని తెలుస్తోంది.

  ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల అంగీకారం..

  ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల అంగీకారం..

  తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లు నియామ‌కం పైన ఇప్ప‌టికే కేంద్ర హోం శాఖ నుండి ఇద్దరు ముఖ్య‌మంత్రుల‌కు స‌మాచారం వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే..ముందుగానే విజ‌య‌వాడ‌లో రాజ్ భ‌వ‌న్ సైతం సిద్దం చేస్తు న్నారు. ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు ఉన్న స‌మ‌యంలో విజ‌య‌వాడ‌లోని ఇరిగేష‌న్ కార్యాల‌యం కేంద్రంగా పాల‌న సాగించారు. అమ‌రావ‌తిలో తాత్కాలిక స‌చివాల‌య నిర్మాణం పూర్త‌య్యే వ‌ర‌కూ అక్క‌డి నుండి పాల‌న వ్య‌వహారాల‌ను ప‌ర్య‌వేక్షించారు. అదే భ‌వ‌నం ప్ర‌స్తుతం తాత్కాలిక రాజ్ భ‌వ‌న్‌గా రాష్ట్ర ప్ర‌భుత్వం ఖ‌రారు చేసింది. తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ కు ప్ర‌స్తుతం ఉన్న రాజ‌భ‌వన్ య‌ధా త‌ధంగా కొన‌సాగుతుంది. ఇప్ప‌టికే తెలంగాణ బీజేపీ నేత‌లు సైతం తెలంగాణ..ఆంధ్రప్రదేశ్‌ నేతలు రెండు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లను నియమించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. దీనికి సంబంధించి రెండు రోజుల క్రితం హోం శాఖ స‌హాయ మంత్రి కిష‌ర్ రెడ్డితో సైతం అమిత్ షా చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. దీంతో..కొత్త గ‌వ‌ర్న‌ర్ నియామ‌కం దాదాపు ఖ‌రారైన‌ట్లే.

  ఏపీకి మ‌హిళా గ‌వ‌ర్న‌ర్ ఖ‌రారు..

  ఏపీకి మ‌హిళా గ‌వ‌ర్న‌ర్ ఖ‌రారు..

  ఏపీకీ కొంత కాలంగా గ‌వ‌ర్న‌ర్ ఎవ‌ర‌నే దాని పైన చ‌ర్చ సాగుతోంది. ఎన్నిక‌ల ముందే ఈ చ‌ర్చ ఉన్నా..కేంద్రంలో.. ఏపీలో అధికార మార్పిడి జ‌రిగితే అప్పుడు ఖ‌రారు చేయాల‌నే ఆలోచ‌న‌లో నాటి కేంద్రం వ్య‌వ‌హ‌రించింది. అయితే, ఇప్పుడు కేంద్రంలో తిరిగి బీజేపీ..ఇప్పుడు ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌టంతో కొత్త గ‌వ‌ర్న‌ర్ ఎవ‌ర‌నే దాని పైన చ‌ర్చ మొద‌లైంది. అయితే, ఏపీకీ మ‌హిళా గ‌వ‌ర్న‌ర్ నియ‌మితుల‌వుతార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఇందు లో ప్ర‌ధానంగా సుష్మా స్వ‌రాజ్‌..లేదా కిర‌ణ్ బేడీ పేర్లు ప్ర‌ముఖంగా ఉన్నాయి. కేంద్రంతో జ‌గ‌న్‌కు స‌త్సంబంధాలు ఉండ‌టంతో సుష్మా స్వ‌రాజ్‌ను ఏపీకి కేటాయించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ముఖ్య‌మంత్రికి అందిన సంకేతాలను బ‌ట్టి అర్దం అవుతోంద‌ని వైసీపీ ముఖ్య‌నేత‌లు చెబుతున్నారు. లేని ప‌క్షంలో ప్ర‌స్తుతం పుదుచ్చేరీ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న ఐపీఎస్ మాజీ అధికారిణి కిర‌ణ్ బేడీ ఖ‌రార‌య్యే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుత పార్ల‌మెంట్ స‌మావేశాలు ముగిసిన వెంట‌నే గ‌వ‌ర్న‌ర్ నియామ‌కం పైన ఉత్త‌ర్వులు జారీ కానున్నాయి.

  English summary
  Central Govt decided to nominate two governors for AP And Telangana. Home affairs may appoint Narasimhan as Jammu Kashmir advisor. After complete of present Parliament sessions official orders may released.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X