విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపిలో జాతీయ విచార‌ణ సంస్థ‌లు : ఆ నిర్ణ‌యం నిలువ‌రించ‌లేపోయింది : కేంద్రం ప‌ట్టుద‌ల‌..!

|
Google Oneindia TeluguNews

ప్ర‌ధాని మోదీ వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేస్తున్నారు..ఏపిలోకి సిబిఐ ఎంట్రీకి అనుమ‌తి లేదు. జ‌గ‌న్ కేసు ఎన్ఐఏ కు ఎలా ఇస్తారు. దీని పై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నాం. సిబిఐ కంటే మా ఏసిబి చాలా చ‌క్క‌గా ప‌ని చేస్తోంది. ఇదీ..కొంత కాలం గా ఏపి ప్ర‌భుత్వం చేస్తున్న వాద‌న‌. కానీ, జ‌రుగుతుందేంటి. ముఖ్య‌మంత్రి పంతం నెర‌వేరుతోందా. కేంద్ర‌మే ప‌ట్టు సాధిస్తుం దా..ఏపిలో జ‌రుగుత‌న్న తాజా ప‌రిణామాలు ఏం చెబుతున్నాయి..

మోదీ పై పోరు..సిబిఐ కి బ్రేకులు..

మోదీ పై పోరు..సిబిఐ కి బ్రేకులు..

కేంద్ర ప్ర‌భుత్వం నుండి టిడిపి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన త‌రువాత ప్ర‌ధాని మోదీ ల‌క్ష్యంగా ఏపి ముఖ్య‌మంత్రి ప్ర‌తీ రోజు విమ ర్శ‌లు చేస్తున్నారు. కేంద్రం పై యుద్దంలో బాగంగా..కాంగ్రెస్ తోనూ జ‌త క‌ట్టిన చంద్ర‌బాబు..ఏపిలో కేంద్ర విచార‌ణ సంస్థ సిబిఐ కు అనుమ‌తి ర‌ద్దు చేసారు. కోర్టు అనుమ‌తి తోనే సిబిఐ ఏపిలో కేసుల‌ను విచారించాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం గా తేల్చి చెప్పారు. ఇదే స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల మీదా ఏసిబి కేసులు న‌మోద‌య్యాయి.

కేంద్రం ఇచ్చిన స‌మాచారం తో ఏపి అధికారులు ట్రాప్ చేసి కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగిని అదుపులోకి తీసుకోవ‌టం పై కేంద్ర విచార‌ణ సంస్థ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఇక‌, ఏపిలో సిబిఐ నేరుగా ప్ర‌వేశించే లేద‌ని ఏపి ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. కానీ, త‌రువాత జ‌రిగిన ప‌రిణామాల్లో కేంద్రం పై చేయి సాధించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. దీంతో..ముఖ్య‌మంత్రి త‌న రాజ‌కీయ దాడి ని తీవ్ర‌త‌రం చేసారు. జాతీయ స్థాయి నుండి జ‌న్మ‌భూమి స‌భ‌ల వ‌ర‌కు త‌న ల‌క్ష్యం ఏంటో స్ప‌ష్టంగా చెబుతున్నారు..

ఏపిలో సిబిఐ..ఎన్ఐఏ సంస్థ‌లు ప్ర‌వేశం..

ఏపిలో సిబిఐ..ఎన్ఐఏ సంస్థ‌లు ప్ర‌వేశం..

కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు ఏపి ప్ర‌భుత్వం బ్రేకులు వేసామ‌ని రాజ‌కీయంగా చెప్పుకుంటున్న స‌మ‌యంలోనే అనూహ్యం గా కొన్ని ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. విశాఖ జిల్లాలో ప్ర‌స్తుత -మాజీ ఎమ్మెల్యేల‌ను మావోయిస్టులు హ‌త్య చేసారు. ఆ కేసు లో అనుమానితుల‌ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ఇక‌, చాలా కాలంగా వివాదాస్పదంగా ఉన్న ఆయేషా మీరా హ‌త్య కేసు ను హైకోర్టు సిబిఐ కు అప్ప‌గించింది. రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన సిట్ ను కాద‌ని..సిబిఐ కోర్టు ఆదేశాల మేర‌కు రంగంలోకి దిగింది. ఇక‌, జ‌గ‌న్ పై విశాఖ విమానాశ్ర‌యంలో దాడి కేసులో తొలుత ఏపి ప్ర‌భుత్వం..

దేశ ర‌క్ష‌ణ కోస‌మే : 19న క‌ల‌క‌త్తాలో స‌మావేశం : జాతీయ స్థాయి పొత్తులే కీల‌కం..! దేశ ర‌క్ష‌ణ కోస‌మే : 19న క‌ల‌క‌త్తాలో స‌మావేశం : జాతీయ స్థాయి పొత్తులే కీల‌కం..!

అది విమానాశ్ర‌యం ప‌రిధిలో జరిగింద‌ని..రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిధిలో అంశం కాద‌ని చెప్పుకొచ్చింది. ఇదే కేసు పై వైసిపి నేత‌లు కోర్టుకు వెళ్లారు. కోర్టులో విచార‌ణ త‌రువాత ఈ కేసును ఎన్ఐఏ కు అప్ప‌గించ‌టం పై స్పందించాల‌ని హైకోర్టు కేంద్రాన్ని కోరింది. కేంద్రం ఈ కేసును ఎన్ఐఏ కు అప్ప‌గించింది. దీంతో..ఇప్పుడు ఏపి ప్ర‌భుత్వం..ఇది రాష్ట్ర హ‌క్కుల కు న‌ష్టం చేయ‌ట‌మేన‌ని..తాము విచారించాల్సిన కేసే ఎన్ఐఏ కు ఎలా ఇస్తార‌ని ప్ర‌శ్నిస్తోంది. ఇలా..కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు ఏపిలో త‌మ ప‌ని తాము చేసుకుంటున్నాయి.

పంతం ..ప‌ట్టుద‌ల‌..

పంతం ..ప‌ట్టుద‌ల‌..

ఇదే స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కేంద్రం పై పోరు విష‌యంలో వెనక్కు త‌గ్గ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకుంది. కేంద్రం సైతం త‌మను రాజ‌కీయంగా డామేజ్ చేస్తున్న ఏపి అధికార పార్టీ విష‌యంలో క‌ఠినంగానే ఉండా ల‌ని నిర్ణ‌యించిది. దీనికి అనుగుణంగానే ప్ర‌ధాని మోదీ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో వీడియా కాన్ఫ‌రెన్స్ స‌మావేశాల్లో టిడిపి నేత‌ల‌పై ఘాటుగా స్పందించారు. ముఖ్య‌మంత్రికి ల‌క్ష్యంగా చేసుకొని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇక‌, జాతీయ స్థాయి లో చంద్ర‌బాబు ఎక్కువ‌గా రాహుల్ క‌ల‌వ‌టం కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. దీనినే ప్ర‌ధాని త‌న విమ‌ర్శ‌ల్లో ఎక్కువ‌గా ప్ర‌స్తావిస్తున్నారు. ఇప్పుడు ఏపి ప్ర‌భుత్వం కేంద్రం పై పోరు విష‌యంలో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు..ప్ర‌తిగా కేంద్రం రియాక్ట్ అవుతున్న తీరు ప‌రిశీలిస్తే.. ఎన్నిక‌లు స‌మీపించే కొద్దీ ఈ కోల్డ్ వార్ మ‌రింత ముదిరే అవ‌కాశం క‌నిపి స్తోంది. మ‌రి..ఈ పోరులో ఎవ‌రు పై చేయి సాధిస్తారో చూడాలి..

English summary
AP And Central Govt's political war at peak. AP govt restricted central investigation agencies in AP. But, now CBI and NIA presently doing their duty's in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X