విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ మంత్రి వ‌ర్సెస్ కేంద్ర మంత్రి : ప‌్ర‌ధాని..సీఎం అలా..వీరు ఇలా: ఏపీకీ అండ‌గా నిలుస్తాం..కానీ..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డిన తరువాత కేంద్రం నుండి సానుకూల సంకేతాలు వ‌స్తున్నాయి. ఎన్నిక‌ల్లె గెలిచిన త‌రువాత ఢిల్లీలో ప్ర‌ధాని మోదీని క‌లిసిన జ‌గ‌న్‌కు అభినంద‌న‌ల వెల్లువ క‌నిపించింది. అదే విధంగా తిరుప‌తికి వ‌చ్చిన ప్ర‌ధానికి స్వాగ‌త స‌మ‌యంలోనూ మోదీ అదే విధంగా జ‌గ‌న్‌ను అభినందించారు. అయితే, కేంద్ర మంత్రులు ..ఏపీ మంత్రుల మ‌ధ్య స‌ఖ్య‌త సంబంధాలే ఉన్నా..ఒక్క విష‌యంలో మాత్రం ఏకాభిప్రాయం కుద‌రటం లేదు. దీంతో ఇద్ద‌రూ ఒకే వేదిక మీద ఉన్నా..ఒకే అంశం మీద భిన్నాభిప్రాయ‌లు వ్య‌క్తం చేసారు.

వాట్ ఏ వెరైటీ.. ఏపిలో వారసుల వాపస్..! రాజకీయాల నుండి వ్యాపారం వైపు అడుగులు..! వాట్ ఏ వెరైటీ.. ఏపిలో వారసుల వాపస్..! రాజకీయాల నుండి వ్యాపారం వైపు అడుగులు..!

ప్ర‌ధాని..సీఎం మ‌ధ్య స‌ఖ్య‌త‌

ప్ర‌ధాని..సీఎం మ‌ధ్య స‌ఖ్య‌త‌

ప్ర‌ధాని మోదీ..ఏపీ సీఎం జ‌గ‌న్ మ‌ధ్య స‌ఖ్య‌త క‌నిపిస్తోంది. జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లినా..ప్ర‌ధాని ఏపీకి వ‌చ్చినా ఇద్ద‌రి మ‌ధ్య స‌న్ని హిత సంబంధాలే క‌నిపిస్తున్నాయి. జ‌గ‌న్‌కు ప్ర‌ధాని ఎంత ప్రాధాన్య‌త ఇస్తుందీ చెప్ప‌క‌నే చెప్పారు. ఎన్నిక‌ల్లో గెలిచిన త‌రువాత జ‌గ‌న్ ఢిల్లీకి వెళ్లి ప్ర‌ధానిని క‌లిసారు. ఆ స‌మ‌యంలో మోదీ ఎంతో సంతోషం..ఆప్యాయ‌త‌తో జ‌గ‌న్‌ను ఆలింగ నం చేసుకున్నారు. ఆ వెంట‌నే ఏపీకీ అన్ని ర‌కాలుగా అండ‌గా నిలుస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇదే స‌మ‌యంతో శ్రీవారి ద‌ర్శ‌నం కోసం ప్ర‌ధాని తిరుమ‌ల వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ సైతం త‌న విధేయ‌త చాటుకున్నారు. వారిద్ద‌రి ఒన్ టు ఒన్ స‌మావేశంలో పీపీఏల పైన విచార‌ణ వ‌ద్దంటూ కేంద్రం నుండి లేఖ వ‌చ్చింద‌ని..అనుమ‌తి ఇవ్వాల‌ని ప్ర‌ధాని దృష్టికి తీసుకురాగా..వెంట‌నే ప్ర‌ధాని ఓకే చెప్పారు. బీజేపీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలోనూ తాము ఏపీకి అండ‌గా నిలుస్తామ ని ప్ర‌ధాని మోదీ స్ప‌ష్టం చేసారు.

ఏపీ మంత్రి వ‌ర్సెస్ కేంద్ర మంత్రి..

ఏపీ మంత్రి వ‌ర్సెస్ కేంద్ర మంత్రి..

కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయ‌ల్ తిరుప‌తి వ‌చ్చారు. శ్రీవారి ద‌ర్శ‌నం చేసుకున్నారు. అనంత‌రం కేంద్ర మంత్రి పీయూష్ ఏపీకి కేంద్రం అండ‌గా నిలుస్తుంద‌ని స్ప‌ష్టం చేసారు. ఏపీకి ప్రత్యేక హోదాను మించిన ప్యాకేజీ ఇస్తున్నామని పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. గ‌తంలో పీయూష్ టీడీపీ..బీజేపీ మ‌ధ్య స‌ఖ్య‌త విష‌యంలో కీల‌క పాత్ర పోషించారు. ఏపీలో పెట్రో కెమిక‌ల్ కాంప్లెక్స్ నిర్మాణం పైనా ఆయ‌న రాష్ట్ర మంత్రి మేక‌పాటి గౌతం రెడ్డితో చ‌ర్చించారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో గౌతం రెడ్డి స్పందించారు. ప్రత్యేక హోదా అంశాన్ని ఎన్నిసార్లెనా ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి గౌతమ్‌రెడ్డి అన్నారు. కేంద్రంతో మంచి సంబంధాలు కొనసాగిస్తామన్నారు. రాష్ట్రాభివృ ద్ధికి నిధులు తీసుకొస్తామని చెప్పారు.

ప్ర‌ధానిని అభ్య‌ర్దించాల్సిదేనంటున్న సీఎం

ప్ర‌ధానిని అభ్య‌ర్దించాల్సిదేనంటున్న సీఎం

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న స‌మ‌యంలో ప్ర‌త్యేక హోదా పైన త‌న విధానం స్ప‌ష్టం చేసారు. కేంద్రంలో పూర్తి మెజార్టీ రాక‌పోతే ఖ‌చ్చితంగా హోదా ఇస్తేనే మ‌ద్ద‌తు ఇస్తామ‌ని చెప్ప‌గ‌లిగే వార‌మ‌ని..అయితే, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేక పోవ‌టంతో కేంద్రంలో ఉన్న వారిని అభ్య‌ర్దించి.. ఎన్ని సార్లైనా అడిగి హోదా సాధించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసారు. అయితే, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా లక్ష్మీనారాయ‌ణ మాత్రం హోదా ముగిసిన అధ్యాయం అని చెబ‌తున్నారు, ఇక‌, దాని మీద ఎవ‌రు మాట్లాడినా వృదా అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ముఖ్య‌మంత్రి ఢిల్లీ వెళ్లిన స‌మ‌యంలో దీని పైన మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది.

English summary
Central Minister Piyush Goyal stated that central govt already proposed better package in place of special status. AP Minister Goutam Reddy differed with Piyush and confident on getting Special status.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X