విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం జగన్ పై కేంద్ర మంత్రి అసహనం : పీపీఏల్లో అవినీతిపై ఆధారాలు లేవు: చంద్రబాబు చేతికి అస్త్రం..!!

|
Google Oneindia TeluguNews

విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల సమీక్ష పైన ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం పైన కేంద్ర మంత్రి మరోసారి తప్పు బట్టారు. అసలు పీపీఏల్లో జగన్ చెబుతున్నట్లుగా అవినీతి జరిగినట్లుగా ఆధారాలు లేవని ఆర్కే సింగ్ తేల్చేసారు. ముఖ్యమంత్రి జగన్ గత ప్రభుత్వంలో పీపీఏలలో అవకతవకలు జరిగినట్లు ప్రధాని దగ్గరికి లేఖలతో వచ్చి రద్దు చేయమని కోరుతున్నారని చెప్పుకొచ్చారు. సరైన ఆధారాలు లేకుండా పీపీఏను రద్దు చేయాలని సీఎం కోరుతున్నారని కేంద్రమంత్రి ఆరోపించారు.

మందు అమ్ముతాం :సేల్స్ మెన్ ఉద్యోగాల కోసం పీజీ విద్యార్ధులు బారులు: ఎమ్మెల్యేలకు గిరాకీ..!!మందు అమ్ముతాం :సేల్స్ మెన్ ఉద్యోగాల కోసం పీజీ విద్యార్ధులు బారులు: ఎమ్మెల్యేలకు గిరాకీ..!!

సీఎం జగన్ వైఖరి పెట్టుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని విశ్లేషించారు. జగన్ తో మాట్లాడామని..ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని సర్దుబాటు చేసుకొని నిర్ణయం ఉప సంహరించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేసారు. దీని ద్వారా ఇప్పుడు జగన్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటారా..కేంద్రం మాట అమలు చేస్తారా అనేది ఏపీ ప్రభుత్వంలో ఆసక్తి కరంగా మారింది.

Central Minister Singh revealed that no proofs of corruption in PPAs

అవినీతిపై ఆధారాలు లేకుండానే జగన్...
విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల విషయంలో ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ తేల్చేసారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత చంద్రబాబు హాయంలో జరిగిని పీపీఏల పైన సమీక్షకు నిర్ణయించారు. దీని పైన తొలుత కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి సమీక్ష వద్దంటూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే, ముఖ్యమంత్రి జగన్ నేరుగా ప్రధాని మోదీకి పీపీఏల్లో జరిగిన అవినీతి గురించి వివరించారు.

అవినీతి జరిగి ఉంటే చర్యలు తీసుకోవాలని ప్రధాని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో స్వయంగా కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ ఏపీ ముఖ్యమంత్రికి లేఖ రాసారు. దీనికి కొనసాగింపుగా జపాన్ ప్రభుత్వం సైతం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో.. ముఖ్యమంత్రి ఢిల్లీలో ప్రధానిని కలిసి పీపీఏల్లో అవినీతి జరిగిందని వివరించారు. ఆ తరువాత ఈ వ్యవహారం పైన ఏపీ ప్రభుత్వం మౌనంగా ఉంది. ఇక, ఇప్పుడు హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ ఈ అంశం పైన స్పందించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నట్లుగా పీపీఏల్లో అవినీతి పైన ఆధారాలు లేవంటూ చేసిన వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

పీపీఏల్లో అవినీతి పై ఆధారాలు లేవు..
పవర్ ప్రాజెక్టులపై సీఎం జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ ధ్వజమెత్తారు. సరైన ఆధారాలుంటే విద్యుత్ రంగంలో పెట్టుబడులు వస్తాయని, తాము చెప్పినా జగన్ వినడం లేదని అసహనం వ్యక్తం చేశారు. బాబు హయాంలో పీపీఏలలో అవకతవకలు జరిగినట్లు తమ దగ్గరికి లేఖలతో వచ్చి రద్దు చేయమని కోరుతున్నారని, దీనివల్ల పెట్టుబడులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అవకతవకలు జరిగినట్లు ఎక్కడా ఆధారాలు లేవని, సరైన ఆధారాలు లేకుండా పీపీఏను రద్దు చేయాలని సీఎం కోరుతున్నారని కేంద్రమంత్రి ఆరోపించారు. సీఎం జగన్ వైఖరి పెట్టుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని, పవర్ ప్రాజెక్టులపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అదే సమయంలో జగన్ తో తాము మాట్లాడమని..

జగన్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారనే నమ్మకంతో ఉన్నామని చెప్పుకొచ్చారు. ప్రయివేటు విద్యుత్ కంపెనీలకు ఇవ్వాల్సిన రెండు వేల కోట్లను విడుదల చేస్తారనే అభిప్రాయం మంత్రి వ్యక్తం చేసారు. ఇక, ఇప్పుడు పీపీఏల విషయంలో జగన్ చేస్తున్న వాదన తప్పని కేంద్ర మంత్రి చెప్పటంతో..ఇప్పుడు ఇది టీడీపీకి అస్త్రం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. దీని పైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

English summary
Central Minister Singh revealed that no proofs of corruption in PPA's taken place in Chandra babu Tenure. He said that Jagan to take back his decision on PPA's Review.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X