విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రగిరిలో అంత అరాచకం జరిగిందా.. అందుకే రీపోలింగ్ ఆదేశమా.. సంచలన వ్యాఖ్యలు చేసిన ద్వివేదీ!?

|
Google Oneindia TeluguNews

రెండు రోజులుగా ఏపీలో రాజ‌కీయ ప్ర‌క‌పంన‌లు సృష్టిస్తున్న చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో రీ పోలింగ్ పైన రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. చంద్ర‌గిరి పోలింగ్ స‌మ‌యంలో వీడియో చూస్తే అస‌లు ప్ర‌జాస్వామ్యంలో ఇలా ఉంటుందా అనే బాధ క‌లిగింది. అక్క‌డ ఖ‌చ్చితంగా రీపోలింగ్ అస‌వ‌రం అంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టారు. స‌హ‌క‌రించిన అధికారుల పైనా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు...

చంద్ర‌గిరి పోలింగ్ వీడియో చూస్తే...
చంద్ర‌గిరిలోని అయిదు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నిక‌ల సంఘం రీ పోలింగ్ కు అదేశించింది. దీని పైన రెండు రోజులుగా రాజ‌కీయ ర‌గ‌డ జ‌రుగుతోంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని క‌లిసి ఈ అంశం పైన అసంతృప్తి వ్య‌క్తం చేసారు. టీడీపీ ఫిర్యాదుల‌ను ప‌ట్టించుకోకుండా వైసీపీ ఫిర్యాదుల‌కే ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని ఆరోపించారు. ఇదే స‌మ‌యంలో ఈ వ్య‌వ‌హారం పైన రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి స్పందించారు. చంద్ర‌గిరిలో రీ పోలింగ్ ఎందుకు అవ‌స‌ర‌మైందో వివ‌రించారు. చంద్ర‌గిరిలో పోలింగ్ జ‌రిగిన తీరు చూస్తే అస‌లు ప్ర‌జాస్వామ్యంలో ఇలా జ‌రుగుతుందా అనే అనుమానం క‌లిగింద‌న్నారు. అక్క‌డ పోలింగ్ జ‌రిగిన తీరును ప‌రిశీలించిన త‌రువాత‌నే కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి సిఫార్సు చేసామ‌ని..ఆధారాలు పంపామ‌ని వివ‌రించారు. వాటిని అధ్య‌య‌నం చేసిన త‌రువాత‌నే కేంద్ర ఎన్నిక‌ల సంఘం రీ పోలింగ్ నిర్ణ‌యం తీసుకుంద‌ని స్ప‌ష్టం చేసారు.

CEO Dwivedi sensational comments on polling in Chandragiri : seem to be no democracy there..

టీడీపీ నేత‌ల హంగామా..
చంద్ర‌గిరిలో రీపోలింగ్‌కు ఆదేశించ‌టం పైన టీడీపీ నేత‌లు అసంతృప్తి వ్య‌క్తం చేసారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని క‌ల‌వ‌గా..అమ‌రావ‌తిలో అందుబాటులో ఉన్న టీడీపీ నేత‌లు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని క‌లిసి అసంతృప్తి వ్య‌క్తం చేసారు. రీ పోలింగ్‌కు కార‌ణాలు ఏంట‌ని ప్ర‌శ్నించారు. ఇందులో సీఎస్ ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వ‌చ్చింద‌ని నిల‌దీసారు. దీనికి స‌మాధానంగా సీఎస్ సైతం స్పందిస్తూ అక్క‌డ ద‌ళితుల‌ను ఓట్లు వేయనీయ‌లేద‌ని..ఆధారాల‌తోనే తాము ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి దృష్టికి విష‌యం తీసుకెళ్లామ‌ని స్ప‌ష్టం చేసారు. ఇదే స‌మ‌యంలో టీడీపీ నేత‌లు సైతం తాము గ‌తంలోనే ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో 19 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేసారు. సీఎస్ ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం దీని పైనా ఎండార్స్ చేసి రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి కి పంపారు. దీని పైన ప‌రిశీల‌న చేస్తామ‌ని ద్వివేదీ స్ప‌ష్టం చేసారు.

English summary
AP Chief election Officer Dwivedi sensational comments on Chandragiri episode. Dwivedi says if watch polling in Chandragiri democracy is there not..doubt create surely. Re polling is must in Chandragiri.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X