విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

70 ఏళ్ల వయసు ఉన్నా..25 ఏళ్ల ఉత్సాహంతోనే :150 మందికి సమాధానం చెబుతా: సభలో చంద్రబాబు ఫైర్..!

|
Google Oneindia TeluguNews

ఏపీ శాసనసభలో రైతు భరోసా పైన జరగిన చర్చ పక్క దారి పట్టింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. రైతు భరోసా అమల్లో కౌలు రైతులను నిర్ల్యక్ష్యం చేస్తున్నారనే విమర్శలకు ప్రభుత్వం నుండి మంత్రి కన్నబాబు సమాధానం ఇచ్చారు. చంద్రబాబు హాయంలో రైతు రుణ మాఫీ పైన నాడు ఏం చెప్పారనే అంశం మీద మాట్లాడారు. ఆ సమయంలో చంద్రబాబు వస్తే వర్షాలు పడవని వ్యాఖ్యానించారు. దీనికి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. తాను వస్తే వర్షాలు రావని..

జగన్ వచ్చిన తరువాత వర్షాలు పడకపోతే వాన దేవుడిని కూడా జైలుకు తీసుకెళ్తారనే భయం అంటూ వ్యాఖ్యానించారు. దీని మీద వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. ఇక, టోల్ గేట్ కు ద్విచక్ర వాహనం కు టోలు ఫీజు తీసుకోరనే విషయం తెలియని వ్యక్తి..ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యానించారు. తన కుమారుడు గురించి మాట్లాడటం పైనా ఆగ్రహం వ్యక్తం చేసారు. నాడు వైయస్సార్ కు చెప్పిన విషయాన్ని గుర్తు చేసారు. మనోభావాలు దెబ్బ తీయవద్దని కోరారు. దీనికి అంబటి రాంబాబు గట్టిగా సమాధానం ఇచ్చారు.

నాకు ఒక్క భార్యే: కొందరికి ముగ్గురు కూడా సరిపోక: శాసనసభలో జగన్ పంచ్ లు..!నాకు ఒక్క భార్యే: కొందరికి ముగ్గురు కూడా సరిపోక: శాసనసభలో జగన్ పంచ్ లు..!

టోల్ ఫీజు గురించి తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి

టోల్ ఫీజు గురించి తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి

దిశ ఎన్ కౌంటర్ గురించి చర్చ సమయంలో ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు సభలో ప్రస్తావించారు. ద్విచక్ర వాహనానికి టోలు ఫీజు వసూలు చేయరనే విషయం తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేసారు. గతంలో వైయస్సార్ సీఎంగా ఉన్న సమయంలోనే తాను చెప్పిన విషయాన్ని గుర్తు చేసారు. తన కుమారుడు చదువు కోసం అమెరికా వెళ్తే..వైయస్సార్ కుమారుడు తిరుగు టపాలో తిరిగి వచ్చిన విషయాన్ని గుర్తు చేసారు. హెరిటేజ్ గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి..భారతి సిమెంట్స్ ను బస్తా రూ.110 కి ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. అందరికీ మనోభావాలు ఉంటాయని..వాటిని దెబ్బ తీయవద్దని కోరారు. 4,5 విడతల్లో పెండింగ్ లో ఉన్న రైతు రుణ మాఫీని చెల్లించాలని కోరారు.

150 మంది వచ్చినా సమాధానం చెబుతా..

150 మంది వచ్చినా సమాధానం చెబుతా..

చంద్రబాబును ఉద్దేశించి మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేసారు. ఆయనకు 70 ఏళ్ల వయసు వచ్చిందని..సలహాలు ఇవ్వాల్సింది పోయి..కుమారుడి వయసు ఉన్న వ్యక్తిని విమర్శించటం ఏంటని ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు తీవ్రంగా ప్రతిస్పందించారు. తనకు 70 ఏళ్ల వయసు ఉన్నా..25 ఏళ్ల వయసు తో పని చేస్తానని చెప్పారు. 150 మంది దాడి చేసినా భయపడేది లేదని.. 150 మందికి సమాధానం చెబుతానని స్పష్టం చేసారు. జగన్ మైండ్ గేమ్ లు తన వద్ద చెల్లవని.. మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే మర్యాదగా ఉంటుందని హెచ్చరించారు. జగన్ రైతు భరోసా పేరుతో జనాల చెవుల్లో పూలు పెడుతున్నారని.. చివరకు జనమే సీఎం చెవిలో పూలు పెడతారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నాలుగు లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు..మీ పార్టీ వారికే ఇచ్చారంటూ చంద్రబాబు మండిపడ్డారు.

వాన దేవుడిని జైలుకు తీసుకెళ్తారని

వాన దేవుడిని జైలుకు తీసుకెళ్తారని

తాను వస్తే వర్షాలు రావని మంత్రి అంటున్నారని..జగన్ వస్తే వర్షాలు వస్తాయని..లేకుంటే ఆయనతో పాటుగా జైలుకు తీసుకెళ్తారనే భయం అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్య సభలో రగడకు కారణమైంది.
జగన్ మాటిచ్చి మడమ తిప్పారని విమర్శించారు. కౌలు రైతులను కుదించటం పైన నిలదీసారు. తాను 2014లో ఇచ్చిన హామీ మేరకు బంగారం పైన రుణం తీసుకున్న రైతులకు రుణాలు చెల్లించామని వివరించారు. హెరిటేజ్ షేర్లు అమ్మేసామని.. దాని గురించి మంత్రి లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం లేదన్నారు. దీనికి అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. చంద్రబాబులో తేడా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

తిరుగు టపాలో వచ్చి సీఎం అయ్యాడు

తిరుగు టపాలో వచ్చి సీఎం అయ్యాడు

చంద్రబాబు వ్యాఖ్యలకు అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. చంద్రబాబులో తేడా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. జగన్ మీద జరుగుతున్నట్లుగా చంద్రబాబు మీద విచారణ సాగుతోందని..ఆయన కూడా నేరస్థుడు అవుతారా అని ప్రశ్నించారు. అవును..అమెరికా నుండి తిరుగు టపాలో వచ్చి సీఎం అయ్యారని..మిమ్మల్ని ఓడించి..151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారని వివరించారు. దీనికి సంబంధించి లోకేశ్ మీద అంబటి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నిరసన వ్యక్తం చేసింది.

English summary
LOP Chabdra Babu serious on Cm jagan and YCP MLA's in Assembly. He says he ready to answer 150 Mlas with out fear. He saying htat he work as 25 years age person.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X