విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు లేఖాస్త్రం: జగన్ సర్కార్ వేధింపులు, అరెస్టులపై గవర్నర్‌కు లేఖ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వేధింపులపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కోరారు. చట్ట విరుధ్దంగా అరెస్ట్ చేస్తూ.. విపక్ష నేతలను వేధిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు గవర్నర్‌కు చంద్రబాబు లేఖ రాశారు. అధికార పార్టీ నేతలతో కొందరు పోలీసులు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో ప్రాథమిక హక్కుల పునరుద్ధరించాల్సిన అసవరం ఉందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19ను జగన్ సర్కార్ యధేచ్ఛగా ఉల్లంఘిస్తుందని తెలిపారు భావ ప్రకటనా స్వేచ్ఛను హరించివేయడం సరికాదన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు చేసేవారిపై పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని వివరించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం, నాయుడుపాలెనికి చెందిన సందీప్ కుమార్, తొట్టెంపూడి చంద్రశేఖర్‌ను జూలై 16వ తేదీన అరెస్టు చేశారని గుర్తుచేశారు.

chandra babu naidu writes letter to governer..

Recommended Video

Mani Sharma మ్యూజిక్ వల్లే ఆ సినిమా హిట్ అయ్యింది..!! | Happy Birthday Mani Sharma || Oneindia

ఏపీ మంత్రి బాలినేనికి సంబంధించి ఏపీలోనే కాదు తమిళనాడు మీడియాలో ప్రసారం అయ్యాయి. కానీ సందీప్, చంద్రశేఖర్‌ను మాత్రం పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరిని ఒంగోలు గ్రామీణ పోలీసులు ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరొ పోలీస్ స్టేషన్‌కు తిప్పుతూ హింసించారని తెలిపారు. ఏపీ నుంచి భారీగా నగదు అక్రమంగా రవాణా చేస్తున్న నిందితులపై సమగ్ర విచారణ చేయాల్సింది పోయి.. అమాయకులను అరెస్ట్ చేయడం ఏంటీ అని పేర్కొన్నారు. దీనిని బట్టి ప్రభుత్వ చర్యలు అర్థమవుతున్నాయని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు జోక్యం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు కోరారు.

English summary
opposition leader chandra babu naidu writes letter to governer viswabushan harichandan for illegal arrests and harassment
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X