విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేంద్రంలో చంద్ర‌బాబు న‌యా స్కెచ్‌: ప‌్ర‌ధాని ఆశావాహుల‌ను మెప్పించేలా : సాధ్య‌మ‌య్యేనా..!

|
Google Oneindia TeluguNews

ఈ సారి ఎన్నిక‌ల్లో బిజేపీ అధికారంలోకి రాకూడ‌దు. ఒక వేళ వ‌చ్చినా మోదీ మాత్రం ప్ర‌ధాని కాకూడ‌దు. ఇదే టీడీపీ అదినేత చంద్ర‌బాబు లక్ష్యం. ఎగ్జిట్ పోల్స్‌ను అస‌లు ప‌ట్టించుకోకూడ‌ద‌ని నిర్ణ‌యించిన చంద్ర‌బాబు..స‌రి కొత్త వ్యూహాన్ని బీజేపీయ‌త‌ర పార్టీల నేత‌ల ముందుంచారు. అందు కోసం ముందుగా త‌న ఆలోచ‌న కాంగ్రెస్ అధినేత‌లు సోనియా..రాహుల్‌కు వివ‌రించారు. ఇప్పుడు మ‌మ‌తా ముందు ప్ర‌తిపాదించారు. ఇది విన్న జాతీయ నేత‌లు అంద‌రూ వ్య‌క్తం చేసిన అభిప్రాయం ఇది సాధ్య‌ప‌డేనా..ఇంత‌కీ ఏంట‌ది...

చంద్ర‌బాబు స‌రి కొత్త ప్ర‌తిపాద‌న‌..
కేంద్రంలో అన్ని పార్టీలు ఏకం కావాలి. ఎలాగైనా మోదీ మ‌రోసారి ప్ర‌ధాని కాకుండా అడ్డుకోవాలి. ఇదే స‌మ‌యంలో బీజేపీత‌ర పార్టీలో ప్ర‌ధాని ఆశావాహులు ఎక్కువ‌గా ఉన్నారు. వారి ప్రాబ‌ల్యం ఎక్కువే. ప్రాంతీయ పార్టీల‌కు ఈసారి వ‌చ్చే సీట్లు ఎక్క‌వేన‌ని చంద్ర‌బాబు అంచ‌నా. దీంతో..ఆయ‌న ముందుగా పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ ముఖ్య నేత‌లు సోనియా..రాహుల్ ముందు చంద్ర‌బాబు త‌న ప్రతిపాద‌న వివ‌రించారు. అదేంటంటే..ఫ‌లితాల‌కు అనుగుణంగా పెద్ద పార్టీ నేత ప్ర‌ధానిగా అవ‌కాశం ఇవ్వాలి. ఉత్త‌రాది వ్య‌క్తిగా రాహుల్ ను ప్ర‌ధాని చేసేందుకు మిగిలిన పార్టీలు అంగీక‌రిస్తే మ‌ద్ద‌తు ఇచ్చిన పార్టీల వారీగా ద‌క్షిణాదిన‌..ప‌శ్చిమాన‌..తూర్పు ప్రాంతంలో ఉన్న పార్టీల అధ్య‌క్షుల‌కు లేదా వారు సూచించిన ముగ్గురికి ఉప ప్ర‌ధాని ప‌ద‌వులు ఇవ్వటం ద్వారా అంద‌రినీ సంతృప్తి ప‌ర‌చ‌వ‌చ్చ‌న్న‌ది చంద్ర‌బాబు అంచ‌నా. ఇది విన్న పార్టీ నేత‌లు ఫ‌లితాల త‌రువాత దీని పైన నిర్ణ‌యం తీసుకుందామ‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం.

Chandra Babu new formula in Central Politics..One PM and Three deputy PMs to unite all partys..

ఆచ‌ర‌ణలో సాధ్య‌మయ్యేనా..
చంద్ర‌బాబు చేసిన ప్ర‌తిపాద‌న కొత్త‌గా ఉన్న‌ప్ప‌టికీ..అది సాధ్య‌మ‌య్యే ప‌నేనా అనే చ‌ర్చ సాగుతోంది. గ‌తంలో దేవీలాల్‌, అద్వానీ ఇద్ద‌రూ ఉప ప్ర‌ధానులుగా ప‌ని చేసారు. అయితే రాష్ట్ర స్థాయిలో ఇద్ద‌రు ఉప ముఖ్య‌మంత్రుల‌ను నియ‌మించుకున్నంత సులువుగా ఉప ప్ర‌ధానుల‌ను నియ‌మించుకోవ‌టం సాధ్యం కాద‌నేది ముఖ్య‌నేత‌ల అభిప్రాయం. అయితే, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపి అధికారంలోకి వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేసాయి. అయితే, చంద్ర‌బాబు మాత్రం ఇంకా ఆశ‌ల‌తో ఉన్నారు. కానీ, ఎగ్జిట్ పోల్స్ రాగానే మాయావ‌తి ఢిల్లీ టూర్ ర‌ద్దు చేసుకున్నారు. ఇక‌, మ‌మ‌తా ఎంత వ‌రకు అంగీరిస్తార‌నేది సందేహ‌మే. ఈ నెల‌23న ఫ‌లితాలు వెల్ల‌డి అయిన త‌రువాత వాటి ఆధారంగా స‌మావేశ‌మై నిర్ణ‌యం తీసుకోవాల‌నేది చంద్ర‌బాబు క‌లిసిన నేత‌ల మ‌నోభావంగా తెలుస్తోంది. చంద్ర‌బాబు చేసిన న‌యా ప్ర‌తిపాద‌న ఆచ‌ర‌ణ యోగ్య‌మా కాదా..అనేది ఈ నెల 23న తేల‌నుంది..

English summary
TDP Chief Chandra Babu working out new plan to unite anti bjp leaders on single platform. Babu proposing one Prime Minister and Three Deputy prime Ministers in Central Govt. All party leaders not rejected this formula but decided to meet after results.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X