విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం : ఆ స్థానాల్లో ముందుగానే అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న‌: పొత్తు పైనా క్లారిటీ..

|
Google Oneindia TeluguNews

టిడిపి అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల క‌స‌ర‌త్తు ప్రారంభించారు. అప్పాయింట్‌మెంట్ లు ఇవ్వ‌కుండా పూర్తిగా పార్టీ అభ్య‌ర్దుల పై స‌ర్వే నివేదిక‌ల అధ్య‌య‌నం చేస్తున్నారు. పార్టీ నేత‌ల‌తో టెలి కాన్ఫిరెన్స్ నిర్వ‌హించారు. 175 స్థానాల్లో గెలుపే ల‌క్ష్యంగా ప‌ని చేయాల‌ని..ముందుగానే ఎన్నిక‌లు వ‌చ్చినా సిద్దంగా ఉండాల‌ని..ఆ స్థానాల్లో అభ్య‌ర్ధుల‌ను ముందుగానే ఖ‌రారు చేస్తామ‌ని సీయం ప్ర‌క‌టించారు..

అభ్య‌ర్దుల ఎంపిక పై క‌స‌ర‌త్తు..

అభ్య‌ర్దుల ఎంపిక పై క‌స‌ర‌త్తు..

టిడిపి అధినేత చంద్ర‌బాబు 2019 ఎన్నిక‌ల పై క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టారు. ఇందులో భాగంగా మూడు ర‌కాలుగా స‌ర్వే లు చేయిస్తున్న చంద్ర‌బాబు వాటి ఫ‌లితాల‌ను నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ప‌రిశీలిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌ర్య‌ట‌న‌ల తో బిజీగా ఉన్న చంద్ర‌బాబు ఈ రోజు పార్టీ అభ్య‌ర్ధుల స‌ర్వేల పై దృష్టి పెట్టారు.

పార్టీ కార్యాల‌య సిబ్బంది తో ప్ర‌త్యేక స‌మావేశం ఏర్పాటు చేసారు. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా సిట్టింగ్ ల పై వ‌స్తున్న ప్ర‌జా స్పంద‌న‌..వారి ప‌నితీరు..వారి పై ఉన్న ఆరోప‌ణ‌లు వంటి వాటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే వైసిపి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల పేరు తో దాదాపు అభ్య‌ర్ధుల‌ను ఖ‌రారు చేసింది. వీరికి పోటీగా బ‌రిలో ఎవరిని దించాల‌నే దాని పై చంద్ర‌బాబు లోతుగా అధ్య యనం చేస్తున్నారు. ఒక‌ర‌కంగా ఏపిలో 175 సీట్ల‌కు పోటీ చేయాల‌ని చెప్ప‌టం ద్వారా పొత్తు లేద‌నే సంకేతాలు ఇస్తున్న ట్లుగా టిడిపిలో అప్పుడే ప్ర‌చారం జ‌రుగుతోంది.

వంద సీట్ల‌లో అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న‌కు స‌మాయ‌త్తం..

వంద సీట్ల‌లో అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న‌కు స‌మాయ‌త్తం..

గ‌తంలో రేపు నామినేష‌న్ల కు చివ‌రి రోజు అనగా ఈ రోజు రాత్రి టిడిపి అభ్య‌ర్ధుల ఖ‌రారు జ‌రిగేది. అయితే, ఈ సారి ఏపి తో పాటుగా జాతీయ రాజ‌కీయాల్లోనూ పాత్ర పోషించాల్సి ఉండ‌టంతో అభ్య‌ర్ధుల‌ను ముందుగానే ప్ర‌క‌టించాల‌ని సీయం భావిస్తున్నారు. ఇందు కోసం ముందుగా పార్టీ బ‌లంగా ఉన్న వంద నియోజ‌క‌వ‌ర్గాల అభ్య‌ర్ధుల‌ను ఖ‌రారు చేసి వారికి అక్క‌డ ప‌ని చేసుకోవ‌టానికి వీలుగా వాతావ‌ర‌ణం క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు. అందులో భాగంగానే.. చిత్తూరు జిల్లాలో పీలేరు, పుంగ‌నూరు, చంద్ర‌గిరి వంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్ధుల‌ను ఇప్ప‌టికే ఖ‌రారు చేసారు. మ‌రి కొద్ది రోజు ల్లో పార్టీ ముఖ్య నేత‌ల స‌మావేశం నిర్వ‌హించాల‌ని భావిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 25 నాటికి ఎన్నిక‌ల నోటిఫికేష్ వ‌చ్చే అవకా శం ఉండ‌టంతో..సంక్రాంతి నాటికి అభ్య‌ర్ధుల‌ను ఖ‌రారు చేసి..ప్ర‌భుత్వ ప‌రంగా చేప‌ట్టిన సంక్షేమ - అభివృద్ది కార్య‌క్ర మాల పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల‌ని భావిస్తున్నారు.

మోదీ అండ్ కో లో జ‌గ‌న్ పాత్ర‌..

మోదీ అండ్ కో లో జ‌గ‌న్ పాత్ర‌..

ఏపి లో తాము రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం పోరాటం చేస్తుంటే వైసిపి మోదీ అండ్ కో లో భాగస్వామి గా మారింద‌నే విష‌యాన్ని ప్ర‌చారం చేయాల‌ని టిడిపి నిర్ణ‌యించింది. తెలంగాణ ఎన్నిక‌ల ప‌లితాల త‌రువాత జ‌రిగిన ప‌రిణామాల పై విస్తృతంగా ప్ర‌జ‌ల్లో ప్ర‌చారం చేయాల‌న డిసైడ్ అయింది.

పార్టీ నేత‌ల‌తో టెలి కాన్ఫిరెన్స్ లోనూ చంద్ర‌బాబు ఇదే అంశాన్ని ప్ర‌స్తావించారు. జగన్‌కు ఓవైసీ ఎప్పుడు దోస్త్ అయ్యారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. జగన్‌, ఓవైసీకి మోదీయే దోస్తీ కుదిర్చారా..అని నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మేడ్చల్‌లో సోనియా చెప్పగానే కేసీఆర్ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టారని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ తొలుత హోదాకు మద్దతిచ్చి తర్వాత మాటమార్చిందన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే వైసీపీ సంబరాలు చేసుకుంటోందని విమర్శించారు. దేశంలో మూడో కూటమి అంటే బీజేపీకి దొడ్డిదారిన మేలు చేయడమే అని,.. దేశం మొత్తం మోదీ పాలనను తిరస్కరి స్తోంద‌ని చంద్రబాబు విశ్లేషిస్తున్నారు.

English summary
TDP Chief Chandra Babu started Mission 2019. He started Candidates selection process. Chandra Babu selecting candidates base on survey reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X