విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విద్యుత్ పై టీడీపీ కే పేటెంట్ .. ప్రజలపై గంటకు రూ.9కోట్ల అప్పు .. సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నిప్పులు చెరిగారు. వైసిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని,అప్పులు చేయడమే ప్రధానంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుప్పించారు. కోర్టులు చివాట్లు పెట్టినా జగన్ తీరు మారటం లేదని మండిపడ్డారు.

రైతులకు విద్యుత్ నగదు బదిలీకి ఆమోదం తెలిపిన ఏపీ క్యాబినెట్ .. భగ్గుమంటున్నటీడీపీ నేతలు రైతులకు విద్యుత్ నగదు బదిలీకి ఆమోదం తెలిపిన ఏపీ క్యాబినెట్ .. భగ్గుమంటున్నటీడీపీ నేతలు

రాష్ట్రమేమన్నా జగన్ కు బానిసనా ? బాబు ప్రశ్న

రాష్ట్రమేమన్నా జగన్ కు బానిసనా ? బాబు ప్రశ్న


ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ, కోర్టు కేసుల కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్ర ప్రజలపై గంటకు 9 కోట్ల రూపాయలు అప్పు మోపుతున్నారని ఆరోపించారు చంద్రబాబు నాయుడు. నిముషానికి 18 లక్షల చొప్పున, సెకనుకు 30 వేల రూపాయల చొప్పున ప్రజలపై అప్పు భారం పడుతుందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రమేమీ సీఎం జగన్మోహన్ రెడ్డి కి బానిస కాదంటూ ఆయన మండిపడ్డారు.

టీడీపీ హయాంలో కరెంట్ చార్జీలు పెంచలేదు

టీడీపీ హయాంలో కరెంట్ చార్జీలు పెంచలేదు

విద్యుత్ రంగంపై టీడీపీకి సర్వహక్కులు ఉన్నాయని పేర్కొన్న చంద్రబాబు టిడిపి హయాంలో నిరంతర విద్యుత్ సరఫరా చేశామని, రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలకు నాంది పలికింది తమ ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో కరెంటు చార్జీలను ఒక్క రూపాయి కూడా పెంచలేదని ఆయన పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సార్లు కరెంటు చార్జీలు పెంచిందని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

 ఎస్సీ, ఎస్టీలకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత టిడిపిదే అన్నారు .

ఎస్సీ, ఎస్టీలకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత టిడిపిదే అన్నారు .

ఉచిత విద్యుత్ ఆలోచన ఎన్టీఆర్ ది... మీటర్లతో రైతులకు నష్టం

రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఆలోచన చేసింది టీడీపీ అని, ఎన్టీఆర్ హయాంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని అటువంటి ఆలోచనకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గండి కొడుతున్నారని ఆరోపించారు.ఉచిత విద్యుత్ రైతుల హక్కు అన్న చంద్రబాబు, ప్రభుత్వం దయాదాక్షిణ్యాలతో ఇస్తున్నది కాదు అంటూ పేర్కొన్నారు. మీటర్లు పెట్టాలన్న నిర్ణయంతో మెట్ట ప్రాంతాల్లో రైతులు,ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల రైతులు నష్ట పోతారు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Recommended Video

TDP State President రేసులో Atchannaidu, Ram Mohan Naidu జస్ట్ మిస్ ! || Oneindia Telugu
నగదు బదిలీ కాదు.. రైతు మెడకు ఉరితాడు

నగదు బదిలీ కాదు.. రైతు మెడకు ఉరితాడు

విద్యుత్ రంగంలో ఎన్నో ఉపయోగకరమైన సంస్కరణలు తీసుకు వచ్చిన టిడిపికి విద్యుత్ గురించి మాట్లాడటానికి పేటెంట్ హక్కులు ఉన్నాయన్నారు. మీటర్లు పెట్టాలన్న నిర్ణయంతో రైతులు నష్టపోతారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వాలు రైతు పై ఒక్క రూపాయి కూడా భారం పడదు అని చెప్పి నాటకాలాడుతున్నారు అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది రైతుల మనుగడకు సంబంధించిన విషయం అంటూ ఆయన ఫైర్ అయ్యారు. రైతులకు నష్టం చేస్తే టీడీపీ సహించదని చంద్రబాబు పేర్కొన్నారు . నగదు బదిలీ కాదు ఏపీ ప్రభుత్వ విధానం రైతు మెడకు ఉరితాడు అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు .

English summary
Chandrababu was incensed that hundreds of crores of rupees were being spent on court cases, enforcing anti-public policies.Chandrababu Naidu alleged that Rs 9 crore per hour was being levied on the people of the state. He was incensed that the state was not a slave to CM Jaganmohan Reddy and tdp has a patent to talk about free electricity .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X