• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ప్ర‌ధాని చెప్పేందుకు ఏమీ లేదు : గైర్హాజ‌రే తీవ్ర నిర‌స‌న : జ‌గ‌న్ - ప‌వ‌న్ మౌనం వెనుక‌..!

|

ప్ర‌ధాని మోదీని కార్న‌ర్ చేయటానికి ఏపి సీయం చంద్ర‌బాబు ఏ అవ‌కాశాన్ని వ‌దులు కోవ‌టం లేదు. వ‌చ్చే నెల ఆరున ప్ర‌ధాని ఏపికి రావ‌టం పై ఇప్ప‌టికే విమ‌ర్శ‌లు చేసిన ముఖ్య‌మంత్రి..వాటికి కొన‌సాగింపుగా మ‌రిన్ని అస్త్రాలు ఎక్కు పె ట్టారు. అదే స‌మ‌యంలో ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న పై జ‌గ‌న్ - వ‌ప‌న్ ఎందుకు నిర‌స‌న తెల‌ప‌టం లేద‌ని నిల‌దీస్తున్నారు..

బ‌తికామో..చచ్చామో చూడ్డానికా : జ‌న‌వ‌రి 1న ఏపిలో టిడిపి నిర‌స‌న‌లు : బాబు టార్గెట్ మోదీ..!

గైర్హాజ‌రీయే నిర‌స‌న‌..

ప్ర‌ధాని మోదీ ఏపి ప‌ర్య‌ట‌న పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మ‌రో సారి ఫైర్ అయ్యారు. ప్ర‌ధాని మోదీ కార‌ణంగా ఏపికి న‌ష్టం జ‌రిగింద‌ని ఆరోపించారు. ఏపి విభజన గాయంపై కారం పూయడానికే ప్రధాని మోదీ ఏపీకి వస్తున్నారని చంద్ర బాబు మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ చేసిందేమీ లేదని.. అందుకే చెప్పేందుకు ఏమీ ఉండదన్నారు. విభజన చట్టంలో ఉన్నవి చేయలేదని, ఇచ్చిన హామీలనూ నెరవేర్చలేదని విమర్శించారు. రాజధాని పనులనో, పోలవరం పనులనో చూసేందుకు వస్తే బాగుండేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల పనుల పరిశీలనకు కాకుండా పార్టీ కార్యక్రమాలకు రావడమే మోదీ రాజకీయమని దుయ్యబట్టారు.

Chandrababu fire on Modi : call for absence of P.M meeting..

ప్రధాని పర్యటనకు గైర్హాజరు కావడమే తీవ్ర నిరసన అని చెప్పారు. ఆయన పర్యటకు ఎవరూ హాజరుకాకుండా గుణపాఠం చెప్పాలని కోరారు. జనవరి 1న రాష్ట్ర వ్యాప్తంగా భాజపాకు వ్యతిరేకంగా నిర్వహించే ఆందోళనల్లో పాల్గొని శాంతియుతంగా నిరసన తెలపాలని నేతలకు చంద్రబాబు సూచించారు. ఇదే స‌మ‌యంలో బిజెపి నేత‌లు గుంటూరు లో ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు..

జ‌గ‌న్ - ప‌వ‌న్ ల‌క్ష్యంగా..

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌ధాని పై విమ‌ర్శ‌లు కొన‌సాగిస్తూనే.. జ‌గ‌న్ -వ‌ప‌న్ ల‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ప్రధాని మోదీ గుంటూరు పర్యటనపై వైకాపా అధ్యక్షుడు జగన్‌, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఎందుకు మాట్లాడరని.. ఆ రెండు పార్టీలు ఎందుకు నిరసనలు తెలపడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తెదేపా 10 ధర్మపోరాట సభలు నిర్వహిస్తే వైకాపా, జనసేన ఏం చేస్తున్నాయని నిలదీశారు.

జ‌గ‌న - ప‌వ‌న్ బిజెపికి అను కూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఇప్ప‌టికే ప‌లు మార్లు ముఖ్య‌మంత్రి ఆరోప‌ణ‌లు చేసారు. ఇప్పుడు ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌కు పిలుపునిచ్చిన చంద్ర‌బాబు...న‌ల్ల‌బ్యాడ్జిల‌తో నిర‌సన కార్య‌క్ర‌మంలో పాల్గొనాల‌ని డిసైడ్ అయ్యారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP C.M Chandra Babu fire on P.M modi on his AP tour. He Called People do not attend Modi's meeting in Guntur. That is th only way for protest against his attitude.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more