విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నారాలోకేష్ కు ఆ కీలక బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

గత ఎన్నికల్లో ఊహించని విధంగా ఘోర పరాజయం పొందిన టిడిపిని తిరిగి ఏపీలో పుంజుకునేలా చేయడానికి చంద్రబాబు రంగంలోకి దిగారు. ఇప్పటికే ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ శ్రేణులకు నేనున్నా అంటూ భరోసా ఇస్తున్నారు. ఇక చంద్రబాబు తర్వాత ఏపీలో పార్టీలో కీలకంగా వ్యవహరించే నేత ఎవరు అంటే నారా లోకేష్ అని పార్టీ వర్గాలు చెప్పినా లోకేష్ పార్టీని నడిపించగల సమర్ధుడు కాడని ప్రతిపక్షాలు జోరుగానే ప్రచారం చేశాయి. ఇక ఈ నేపధ్యంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పజెప్పబోతున్నారు అని తెలుస్తుంది .. ఇక ఇంతకీ చంద్రబాబు లోకేష్ కు అప్పగించే ఆ కీలక బాధ్యత ఏంటి అన్నది తెలిసినా.. లోకేష్ ఆ బాధ్యత విషయంలో సక్సెస్ అవుతారా అన్నది ప్రస్తుతానికయితే సస్పెన్స్ .

సభాకాలం వృధా చేస్తున్నారు .. అచ్చెన్నాయుడు వల్లే సభ పాడవుతుందని స్పీకర్ ఫైర్సభాకాలం వృధా చేస్తున్నారు .. అచ్చెన్నాయుడు వల్లే సభ పాడవుతుందని స్పీకర్ ఫైర్

 రాజకీయాల మీద ఊహించని రీతిలో సోషల్ మీడియా ప్రభావం .. టీడీపీ సోషల్ మీడియా విభాగ బాధ్యతలు లోకేష్ కు అప్పగింత

రాజకీయాల మీద ఊహించని రీతిలో సోషల్ మీడియా ప్రభావం .. టీడీపీ సోషల్ మీడియా విభాగ బాధ్యతలు లోకేష్ కు అప్పగింత

చంద్రబాబు లోకేష్ కు అప్పగించిన బాధ్యత చూస్తే ఒకింత ఆశ్చర్యం అనిపించినా ఇప్పుడు రాజకీయాలు కూడా దాని మీదే ఎక్కువ ఆధారపడి సాగుతున్నాయి. ఇప్పుడు ప్రతీ అంశంపై ప్రభావం చూపించే అంశం సోషల్ మీడియా అని చెప్పక తప్పదు . అందుకే ఇప్పటి నుండి లోకేష్ తెలుగు దేశం పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని చూసుకోవాలని చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. లోకేష్ వ్యక్తిగతంగా సోషల్ మీడియా టీం తో సమన్వయం చేసుకుంటారు. అంతే కాదు వారికి కావాల్సిన ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తారు.

గత ఎన్నికల్లో వైసీపీ సోషల్ మీడియా విభాగం పని తీరు వల్లే విజయం సాధించారని చంద్రబాబు భావన

గత ఎన్నికల్లో వైసీపీ సోషల్ మీడియా విభాగం పని తీరు వల్లే విజయం సాధించారని చంద్రబాబు భావన

గత ఎన్నికల్లో వైసీపీ సోషల్ మీడియా ప్రచారం ద్వారానే చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఇక వైయస్ జగన్ తన రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్ మరియు పీకే టీం చేసిన సమర్థవంతమైన సోషల్ మీడియా ప్రచారం ద్వారా ఎక్కువగా ప్రయోజనం పొందారు. వైసీపీ విజయానికి సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రచారమే కారణం అని చంద్రబాబు భావిస్తున్నారు. టీడీపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకేష్ ఇలాంటి వ్యూహాన్ని అమలు చేస్తే టీడీపీకి లాభిస్తుందని భావించి చంద్రబాబు లోకేష్ కు సోషల్ మీడియా ద్వారా పార్టీ కార్యాకలాపాలు కొనసాగించాలని, అవసరమైన ప్రచారం చెయ్యాలని బాధ్యతను అప్పగించి ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటి నుండే సోషల్ మీడియాను తెగ వాడెయ్యాలని బాబు నిర్ణయం .. అందుకే చినబాబుకు ఆ బాధ్యతలు

ఇప్పటి నుండే సోషల్ మీడియాను తెగ వాడెయ్యాలని బాబు నిర్ణయం .. అందుకే చినబాబుకు ఆ బాధ్యతలు

ఇక ఈ నేపథ్యంలోనే చినబాబు రంగంలోకి దిగానున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఓటమి పాలైన టీడీపీ గతంలో ఎన్నడూ లేనంత ఘోర పరాభవాన్ని చవి చూసింది . ఇక దానికి కీలక భూమిక పోషించింది మాత్రం సోషల్ మీడియా నే . ఇక అలాంటి సోషల్ మీడియా ద్వారానే వై ఎస్ జగన్ చేస్తున్న తప్పులను ఎండగట్టాలని టీడీపీ అధినేత నిర్ణయించారు. ఇక ఆదిశగానే ఆయన అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ఈ మధ్య లోకేష్ బాబు కూడా ట్విట్టర్ ను తెగ వాడేస్తున్నారు. మొదట నుండి టెక్నాలజీని అంది పుచ్చుకునే విషయంలో చంద్రబాబు ఎప్పుడూ ముందే ఉండే వారు. కానీ గత ఎన్నికల ముందు వైసీపీ రాజకీయ సలహాదారు పీకే టీం ఆ పని వైసీపీ కోసం సక్సెస్ ఫుల్ గా చేసి వైసీపీ విజయానికి కారణం అయ్యారు. ఇక ఇప్పటి నుండి అయినా సోషల్ మీడియా పిన కూడా పట్టు సాధించాలనే చంద్రబాబు ఈ తరహా నిర్ణయం తీసుకున్నారు.

English summary
Telugu Desam Party chief Nara Chandrababu Naidu is busy coordinating with his party leaders on how to get the party back on track after the disastrous campaign in 2019 election.The latest we hear is that Chandrababu has handed over a key job to his son Nara Lokesh.Apparently, Lokesh will be looking after Telugu Desam Party’s social media wing from now on. He will be personally coordinating with the concerned team and give key inputs.Incidentally, YS Jagan was largely benefited by the effective social media campaigning that was done by his political advisor Prashant Kishore and his team. Lokesh will be looking to replicate a similar strategy.Well, it looks like Lokesh is trying his best to help his father in getting TDP back to winning ways.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X