విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం జగన్‌వి తుగ్లక్ నిర్ణయాలు... రాజధాని ప్రకటనపై చంద్రబాబు నిప్పులు

|
Google Oneindia TeluguNews

అసెంబ్లీ రాజధాని నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. ప్రభుత్వ చర్యలను ఆయన తుగ్లక్ చర్యలుగా అభివర్ణించారు. రాజధానిని మూడు భాగాలుగా మార్చాలకున్న సీఎం నిర్ణయాల వల్ల రాష్ట్రం అంధకారంలోకి నెట్టబడుతుందని ఆయన విమర్శించారు. రాజధానిపై ప్రకటన చేసేందుకే టీడీపీ ఎమ్మెల్యేలను సస్సెండ్ చేశారని ఆయన ఆరోపించారు. ఈ సంధర్భంగా సీఎం జగన్ ఓ బఫూన్‌లా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. ఎమ్మెల్యేల సస్పెషన్ చేసిన తర్వాత ఎమ్మెల్యేలతో కలిసి ప్రజావేదిక వద్ద నిరసన తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

రాజధాని పై కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాన... ఒకేదగ్గర అభివృద్ది ఎందుకని ప్రశ్న..? రాజధాని పై కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాన... ఒకేదగ్గర అభివృద్ది ఎందుకని ప్రశ్న..?

 రాజధానిపై స్పష్టత ఇచ్చిన సీఎం జగన్

రాజధానిపై స్పష్టత ఇచ్చిన సీఎం జగన్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. అంతకు ముందు టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. అనంతరం సభలో రాజధాని నిర్మాణాలపై సీఎం జగన్ స్ఫష్టత ఇచ్చారు. మూడు రాజధానులంటూ ప్రకటించారు. మరో వారం రోజుల్లో ప్రకటన వస్తుందంటూ జగన్ స్పష్టం చేశారు. అధికార వికేంద్రీకరణ జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఈనేపథ్యంలోనే ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజధాని నిర్ణయంపై సీఎం జగన్ ప్రకటించిన నిర్ణయాలను ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు.

రాజధానిపై స్పష్టత ఇవ్వమని అడిగితే సస్పెండ్ చేశారు

రాజధానిపై స్పష్టత ఇవ్వమని అడిగితే సస్పెండ్ చేశారు


నిరసన అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు.. తాము రాజధానిపై స్పష్టత ఇవ్వమని అడిగితే... ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని అన్నారు. దీంతో రాష్ట్రం ఏమవుతుందనే అందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాజధాని ఏర్పాటుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతాయని అన్నారు. ఇప్పటివరకు పెట్టుబడి దారులు హైదరాబాద్ నుండి అమరావతికి వచ్చారని, ఇక ఇప్పుడు వైజాగ్ వెళ్లాల్సి వస్తుందని అన్నారు.

జగన్‌వి తుగ్లక్ నిర్ణయాలు

జగన్‌వి తుగ్లక్ నిర్ణయాలు

ఎప్పుడు ఏ నిర్ణయం ప్రకటిస్తారో తెలియని పరిస్థితి నెలకొందని అందుకే ఇది తుగ్లక్ పాలన అన్నారు. ఎవరైనా ప్రజలు పనుల కోసం వస్తే... జిల్లాలు తిరగాల్సి వస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుని అధికారాన్ని కంట్రోల్ చేస్తారని ప్రశ్నించారు. మరోవైపు ఏడు నెలల్లో ఒక్క పెట్టుబడి కూడ రాలేదని, నాలుగు లక్షల మంది వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చారని అయితే వారికి జీతాలు చెల్లించే పరిస్థితి లేదని అన్నారు. రాజధానిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కావాలనే టీడీపీ సభ్యుల పేర్లు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఒకవేళ నిజంగా అక్రమాలు జరిగితే.. అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

ఐదేళ్లు కష్టపడి అభివృద్ది చేశాము

ఐదేళ్లు కష్టపడి అభివృద్ది చేశాము

ఇక రాజధానిపై ఆదాయం వస్తుందని , ఈ నేపథ్యంలోనే అమరావతిలో రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన సంపదను సృష్టించామని , గత ఐదేళ్లు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ది బాటాలో పయనింపచేశారని అన్నారు. ఇందుకోసం అమరావతి నిర్మాణంపై కాలాయాపన చేశారని అన్నారు. కావాలనే టీడీపీ నేతలతో పాటు తన కుటుంబంపై బురద జల్లుతున్నారని విమర్శించారు.

సీఎం ఎక్కడ ఉంటారు..?

సీఎం ఎక్కడ ఉంటారు..?


ఇక విశాఖలో రాజధాని అంటూన్న సీఎం జగన్ విశాఖకు వచ్చిన డాటా సెంటర్‌ను రద్దు చేశారని , అందుకే అమరావతిలో అందుకే కనీసం రోడ్ల గుంతలు కూడ పూడ్చడం లేదని అన్నారు. సీఎం నిర్ణయాలను ప్రజలు ఆలోచన చేయాలని అన్నారు. ఇక రాజధానిని వికేంద్రికరిస్తామని చెప్పిన సీఎం ఏక్కడ నుండి పరిపాలన చేస్తారని ప్రశ్నించారు. హైకోర్టు , పరిపాలన వ్యవస్థలు వేర్వేరుగా ఉంటే ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు

English summary
TDP chief Chandrababu Naidu has fired over the YCP government's decision on the capital annoncement in the assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X