విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నా రాజకీయ జీవితంలో ఇలాంటి అరాచకాలు చూడలేదని ఆవేదన ..నెల్లూరు కూల్చివేతలపై బాబు

|
Google Oneindia TeluguNews

నెల్లూరులో టీడీపీ నేత ఇళ్ళ కూల్చివేతలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఏపీలో వైసీపీ పాలనలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని నా నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇలాంటివి చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. . తెలుగుదేశం పార్టీ నేతలపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

<strong>హాస్టల్ లో నీటి కొరత .. విద్యార్థినుల జుట్టు కట్ చేయించిన ప్రిన్సిపల్ .. షాక్ అయిన తల్లిదండ్రులు </strong>హాస్టల్ లో నీటి కొరత .. విద్యార్థినుల జుట్టు కట్ చేయించిన ప్రిన్సిపల్ .. షాక్ అయిన తల్లిదండ్రులు

టీడీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్‌ చేశారని ఆవేదన చెందిన చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక టీడీపీ కార్యకర్తలపై 469 దాడులు జరిగాయన్నారు. 8 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని ఆయన ఆక్రోశం వెళ్లగక్కారు. నెల్లూరులో టీడీపీ నేతల ఇళ్లను వైసీపీ నేతలు కక్ష కట్టి మరీ తమ ప్రభుత్వంలోని అధికారులతో చెప్పి కూల్చేశారన్నారు. ఇక టీడీపీ కార్యకర్తలు, వారి మాట వినని ప్రజలను గ్రామాలు వదిలివెళ్లే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. జర్నలిస్టులు, సోషల్‌ మీడియాలో విమర్శించిన వారినీ వదలడం లేదని ఆయన పేర్కొన్నారు . వైసీపీ అరాచకాలపై పోలీసులు ఏమీ చెయ్యలేకపోతున్నారని , పోలీస్ వ్యవస్థ అచేతనంగా మారిందని చంద్రబాబు విమర్శించారు.నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల ఇళ్లను కూడా కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలు గ్రామాలను వదిలి వెళ్లే పరిస్థితిని తీసుకొచ్చారని అన్నారు. ఇక వైసీపీ నేతలు గ్రామాలకు వెళ్లి ఎక్కడికైనా వెళ్లి తలదాచుకోండి అని ఉచిత సలహా ఇస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.

Chandrababu responded on nellore demolishes .. Anarchists are not seen in my whole political life

ఈ రోజు నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురంలో నివసిస్తున్న తెలుగుదేశం నేత జహీర్ అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టారంటూ అధికారులు ఆయనకు చెందిన మూడు ఇళ్ళను కూల్చివేశారు. సమాచారం అందుకున్న టీడీపీ నేతలు అక్కడికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగినా కూల్చివేతలను మాత్రం ఆపలేకపోయారు. ఇవి కక్ష సాధింపు చర్య అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నా దాడులు, కూల్చివేతలు మాత్రం ఆపలేకపోతున్నారు. వైసీపీకి ఓటు వెయ్యనంత మాత్రాన ఇల్లు కూల్చేస్తారా అంటూ మండిపడుతున్నారు. దీంతో నేటి తెల్లవారుజాము నుంచే భారీగా పోలీసులు మోహరించారు. కూల్చివేతలను పర్యవేక్షిస్తున్న నెల్లూరు ఆర్డీవో చిన్నికృష్ణ, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తదితరులు ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. . కాలనీలో అడుగడుగునా పోలీసుల ఆంక్షలు విధించారు.

English summary
Chandrababu told to media that the TDP leaders and activists were targeted. He was outraged that eight TDP activists were killed in the rule of ycp . In Nellore, the houses of the TDP leaders have demolished . TDP activists, who have not listened to their voice, have been forced to leave the villages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X