విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుది నీచమైన పాలన .. ఎన్నికల సమయంలో ఏం చేశారో చెప్పిన మంత్రి నానీ

|
Google Oneindia TeluguNews

ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశాల్లో వాడివేడి చర్చ సాగుతోంది. పౌరసరఫరాల కు సంబంధించి మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ చంద్రబాబు పై నిప్పులు చెరిగారు. చంద్రబాబు పాలనలో గత ఎన్నికల ముందు నిధుల దుర్వినియోగం అయిందని పౌరసరఫరాల శాఖకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ఆయన ఆరోపించారు. చాలా నీచమైన పాలన సాగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇంతకీ చంద్రబాబు ఏం చేశారో చెప్తూ..

టీడీపీది కుల రాజకీయం .. వైసీపీది మత రాజకీయం అని పురంధరేశ్వరి ఫైర్టీడీపీది కుల రాజకీయం .. వైసీపీది మత రాజకీయం అని పురంధరేశ్వరి ఫైర్

పోరాసరఫరాల శాఖ నిధులను దారి మళ్లించిన టీడీపీ అని ఆరోపణలు చేసిన మంత్రి కొడాలి నానీ

పోరాసరఫరాల శాఖ నిధులను దారి మళ్లించిన టీడీపీ అని ఆరోపణలు చేసిన మంత్రి కొడాలి నానీ

గత ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్లో పౌరసరఫరాల శాఖకు మూడు వేల కోట్ల నిధులను కేటాయించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపణలు గుప్పించారు. అధికారులు నాలుగు వేల కోట్ల రూపాయలు నిధులు అవసరమని చెప్తే, మూడువేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి కనీసం అవి కూడా ఇవ్వకుండా, ఆ నిధులను దారి మళ్లించారని కొడాలి నాని ఆరోపించారు. రైతులకు, నిరుపేదలకు లబ్ధి చేకూర్చాల్సిన పౌరసరఫరాల శాఖ లో గత పాలక ప్రభుత్వం టీడీపీ చేసిన దోపిడి వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పౌరసరఫరాల సంస్థ కార్పొరేషన్ నిధులను పసుపు కుంకుమ పథకానికి మళ్లించారని, ఎన్నికలకు ముందు ప్రజలను ప్రలోభ పెట్టి అందులో భాగంగా ఆ నిధులను పసుపు కుంకుమ పథకంలో మహిళలకు అందించారని కొడాలి నాని పేర్కొన్నారు.

ఇవ్వాల్సిన నిధులే కాదు, శాఖలో ఉన్న నిధులను కూడా పసుపు కుంకుమ పథకానికి వాడుకున్న బాబు

ఇవ్వాల్సిన నిధులే కాదు, శాఖలో ఉన్న నిధులను కూడా పసుపు కుంకుమ పథకానికి వాడుకున్న బాబు

శాసనసభలో టిడిపి సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ వారి సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పలు ఆరోపణలు గుప్పించారు. సివిల్ సప్లై కార్పొరేషన్ కు మూడు వేల కోట్ల బడ్జెట్ ను కేటాయించి వాటిని విడుదల చేయలేదని ఆయన పేర్కొన్నారు. రైతుల నుండి ధాన్యాన్ని సేకరించడానికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అవసరమైన నిధులు కూడా ఇవ్వకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని నాని అన్నారు. కనీస రైతుల పట్ల కూడా సానుభూతి లేని నీచమైన ప్రభుత్వం టిడిపి అని, చంద్రబాబు నీచమైన పాలన సాగించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక టిడిపి హయాంలో పౌరసరఫరాల శాఖకు సంబంధించిన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుండి పలుమార్లు నిధులను టిడిపి దారి మళ్లించిన వివరాలను తేదీలతో సహా నాని శాసనసభలో వివరించారు.

 ఎన్నికల కోసం దొడ్డిదారిన నిధులను వాడుకున్న బాబు అంటూ కొడాలి నానీ ఫైర్

ఎన్నికల కోసం దొడ్డిదారిన నిధులను వాడుకున్న బాబు అంటూ కొడాలి నానీ ఫైర్


ఇక సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి ఇవ్వాల్సిన మూడు వేల కోట్ల నిధులను ఇవ్వకుండా, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుండి 4800కోట్లు నిధులను కూడా వాడుకున్నారని ప్రస్తుతం వారి వద్దనుండి తమకు 8836 కోట్ల నిధులు వరకు రావాల్సి ఉందని కొడాలి నాని లెక్క చెప్పారు. ఎక్కడ , ఎప్పుడు , ఏ ఎకౌంటు నుండి, ఎంత సొమ్ము దారి మళ్లిందో చెప్పిన నాని నిధుల లేమితో రైతులకు చెల్లించాల్సిన డబ్బు చెల్లించలేదని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 970 కోట్ల రూపాయల బకాయిలను రైతులకు చెల్లించాల్సి ఉందని, అయితే వైసిపి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి గారి సహకారంతో రైతులకు బకాయిలు చెల్లించామని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ఎన్నికల కోసం దొడ్డిదారిన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నిధులను చంద్రబాబు మళ్లించారని పేర్కొన్న నాని టీడీపీ ఈ లెక్కకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

English summary
Giving a reply to a question raised by a TDP member in the Legislative Assembly, Minister for Civil Supplies Kodali Nani alleged that former Chief Minister N Chandrababu Naidu had diverted funds of the Civil Supplies Corporation to Pasupu Kumkuma scheme. He slammed for not releasing budgetary allocation of Rs 3,000 crore to the Civil Supplies Corporation. Nani came down heavily on Chandrababu for not having concern towards farmers as funds required for the Civil Supplies Corporation to procure paddy from farmers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X