విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎస్ఈసీ నిమ్మగడ్డకు చంద్రబాబు లేఖ.. కొందరు అధికారులపై ఫిర్యాదు,

|
Google Oneindia TeluguNews

ఏపీలో పంచాయతీ ఎన్నికలు కొనసాగుతోన్నాయి. రెండు విడతల ఎన్నికలు/ ఫలితాలు వెలువడ్డాయి. మూడు/ నాలుగో విడత ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఎన్నికల సరళిపై సందేహాలు తలెత్తగా.. విపక్ష నేతలు ఎస్ఈసీ దృష్టికి తీసుకొస్తున్నారు. తాజాగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు లేఖ రాశారు. కొందరు అధికారులపై ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపణలు చేశారు.

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గారని ఆరోపణలు చేశారు. టీడీపీ మద్దతుదారుల నామినేషన్లను తిరస్కరిస్తున్నారని తెలిపారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన్‌రెడ్డి బెదిరింపులతో 33 పంచాయతీల్లో నామినేషన్లు ఉద్దేశపూర్వకంగా తిరస్కరించారని ఆ లేఖలో పేర్కొన్నారు. నామినేషన్లు ఎందుకు తిరస్కరించారో ఇప్పటివరకు అధికారులు వెల్లడించలేదని చెప్పారు.

chandrababu writes letter to sec nimmagadda ramesh

Recommended Video

#TOPNEWS: FASTag | LPG Price Hike- To Cost ₹ 50 More| AP Municipal Elections

రాజ్యాంగస్ఫూర్తికి వ్యతిరేకంగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అలా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేఖలో చంద్రబాబు కోరారు. ఏపీలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు/ నిమ్మగడ్డ ఒక్కటి అని వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏకగ్రీవాలకు ఓకే చెప్పడంతో.. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు కామెంట్ చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు ఎస్ఈసీకి లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

English summary
tdp chief chandrababu naidu writes letter to sec nimmagadda ramesh kumar on panchayat naminations reject issue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X