• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

విజయవాడ ట్రాఫిక్ కష్టాలకు చెక్.. నేటి నుండి బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ట్రయల్ రన్

|

ట్రాఫిక్ కష్టాలతో నరకం చూస్తున్న బెజవాడ వాసులుకు ఇక నుండి ట్రాఫిక్ కష్టాల నుండి కొంతమేర ఉపశమనం లభించనుంది. . ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తోన్న బెంజిసర్కిల్ ప్లైఓవర్ ఇక వినియోగానికి సిద్దమైంది. నెల క్రితం నిర్మాణానికి సంబంధించిన అన్ని పనులు పూర్తి కాగా నేడు అధికారులు దీనిపై ట్రయల్‌రన్‌ నిర్వహిస్తున్నారు. ఇది నిత్యం ట్రాఫిక్ తో సతమతం అవుతున్న బెజవాడ వాసులకు నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి .

బెజవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలకు చెక్ .. అందుబాటులోకి బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్

బెజవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలకు చెక్ .. అందుబాటులోకి బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్

భాగ్యనగర్ లో ట్రాఫిక్ సమస్య ఎలా ఉంటుందో ఏపీలో విజయవాడకు కూడా అంతే ట్రాఫిక్ సమస్య నగర వాసులను ఇబ్బంది పెడుతుంది. ఇక ఈ నేపధ్యంలో విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరేలా వారి దశాబ్దాల కల నెరవేరేలా విజయవాడ నగరంలో వచ్చిన బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ నేటి నుండి అందుబాటులోకి రానుంది . నేటి నుండి ఏలూరు వైపు నుంచి వచ్చే వాహనాలను అనుమతించాలని నిర్ణయించారు. నేడు ఎటువంటి ప్రారంభోత్సవం లేకుండానే సాంకేతిక అంశాల పరిశీలన కోసం వంతెన పై నుంచి ట్రయల్ రన్ నిర్వహించాలని నిర్ణయించారు అధికారులు.

నేటి నుండి ట్రయల్ రన్

నేటి నుండి ట్రయల్ రన్

ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఈ ఫ్లై ఓవర్ పై వాహనాలను అనుమతించనున్నారు. రామవరప్పాడు నుంచి వారధి వైపు వెళ్లే వాహనాలను ఫ్లైఓవర్‌లో ప్రయాణించడానికి అనుమతిస్తారు. ట్రయిల్‌రన్ అనంతరం వాహనాల ప్రయాణాలను కొనసాగించడంపై నగర ట్రాఫిక్ పోలీసులతో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం విద్యా సాగర్ పేర్కొన్నారు . ఇక విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు, కలెక్టర్‌ ఇంతియాజ్, ఎన్‌హెచ్‌ఏఐతో పాటు పలు నగర శాఖల అధికారులు బెంజి సర్కిల్‌ ఫ్లైఓవర్‌ను సందర్శించి వాహనాలకు పచ్చ జెండా ఊపి అనుమతిస్తారు.

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో ప్రారంభానికి నిర్ణయం

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో ప్రారంభానికి నిర్ణయం

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో త్వరలో బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ లాంఛనంగా ప్రారంభం కానుంది. అయితే ఆయన ఎప్పుడు వస్తారన్న దానిపై క్లారిటీ లేకపోవడంతో ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు. ఇక టీడీపీ హయాంలో విజయవాడలో ఈ ఫ్లై ఓవర్ ను కేవలం నిర్మల కాన్వెంట్ వరకే నిర్మించాలనుకున్నారు. ఆ తర్వాత భవిష్యత్తు అవసరాలను, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రి కూడలి వరకు పొడిగించాలని భావించారు అప్పటి సీఎం చంద్రబాబు. ఇక ఎంపీ కేశినేనినానీ ఈ ఫ్లై ఓవర్ కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. బాగానే లాబీయింగ్ చేశారు. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే బెంజి సర్కిల్ లో ట్రాఫిక్ రద్దీ చాలామేరకు తగ్గుతుంది.

English summary
Public of Vijayawada in and around region are immensely happy today, as the much awaited Benz circle flyover is open for the public. Traffic situation across Benz circle used to be unimaginable, especially in peak hours. For now, the flyover is open for its trail run, Central minister Nithin Gadkari will be inaugurating the flyover formally next month. Meanwhile the authorities have restricted the two wheelers from using the flyover. Only four wheelers and heavy weight vehicles are allowed to utilize the flyover as of now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X