విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చింత‌మ‌నేనికి చిరిగింది..! ఇక య‌ర‌ప‌తినేని కోసం పోలీసులు ఎదురుచూపు..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివ‌ప్ర‌సాద్ ఆత్మ‌హ‌త్య తర్వాత టీడీపీ నేత‌ల్లో నైరాశ్యం నెలకొంది. ఇప్పుడు చింత‌మ‌నేని రిమాండ్‌లో ఉండ‌టంతో పార్టీ శ్రేణుల్లో భరోసా నింపేందుకు పార్టీ జాతీయ అద్యక్షుడు చంద్ర‌బాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. కొద్దికాలం క్రితం చ‌లో ఆత్మ‌కూరు అంటూ హ‌డావుడి చేసిన చంద్రబాబు, తాజాగా ఇప్పుడు చ‌లో దెందులూరు అంటూ పార్టీని స‌మాయ‌త్తం చేయ‌బోతున్నారు.

అయితే మ‌రోవైపు గుర‌జాల మాజీ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తుంది. తాను చట్ట వ్యతిరేక విధానాలకు పాల్పడలేదని య‌ర‌ప‌తినేని చెబుతున్నా, సీబీఐ ద‌ర్యాప్తులో త‌ప్పులు వెలుగుచూస్తాయ‌ని టీడీపీ శ్రేణులు కూడా అంచ‌నా వేసుకుంటున్నాయి. ఇలా వ‌రుస‌గా అరెస్టుల ప‌రంప‌ర కొన‌సాగితే పరిస్థితి ఏంటనే చర్చ టీడిపిలో జరుగుతోంది. అవినీతి ఆరోప‌ణ‌లతో పాటు, గ‌తంలో వైసీపీని ఇబ్బంది పెట్టిన నేత‌ల తాలూకూ పాత‌చిట్టాను కూడా బ‌య‌ట‌కు తీసి దోషులుగా కోర్టు బోనులో నిల‌పాల‌నే ప్రణాళికలో వైసీపీ నాయకులు ఉన్నట్టు ఉన్న‌ట్టుగా తెలుస్తోంది.

chintamaneni went into remind..next Yarapathineni..?

ఎపిలో తెలుగుదేశం పార్ఠీ అదికారంలో ఉన్నప్పుడు ఎండుటాకులా ఎగిరి పడ్డ చింతమనేని ప్రభాకర్ చరిత్ర ముగిసింది. ఎమ్మెల్యే పదవిని, టీడిపి పెద్దల అండను అడ్డంపెట్టుకుని ప్రభాకర్ కొనసాగించిన అరచకాలను వైసీపీ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసింది. దెందులూరు నియోజక వర్గంలో చింతమనేని ప్రభాకర్ సాగించిన దందాల మీద విచారణ జరిపి ఆయనపై చర్యలకు ఉపక్రమించింది ప్రభుత్వం.

చింతమనేని ప్రభాకర్ సామాన్య ప్రజానీకాన్ని ఎంత‌టి మ‌నోవేద‌న‌కు గురిచేసారో అదే మనో వేదన ఆయనకు ప్రత్యక్ష్యంగా తెలియాలని స్ధానిక ప్రజానికం డిమాండ్ చేస్తున్నారు. ఐదేళ్ల‌పాటు న‌ర‌కం చ‌విచూశామో వారికీ రుచిచూపాలి. అనేంత‌గా వైసీపీ శ్రేణులు టీడీపీ నేత‌ల విష‌యంలో ఆగ్రహంగా ఉన్నారు. తాజాగా యరపతినేని శ్రీనివాస రావు మెడకు కూడా ఉచ్చు బిగుసుకోబోతున్నట్టు అమవరావతిలో పెద్ద చర్చ జరుగుతోంది.

English summary
Chinthamaneni Prabhakar who went into custody recently in ap. Now the former MLA of the Gurukala is also a trap around Srinivasa Rao. The TDP ranks are also aware that he does not indulge in unlawful practices, but the CBI is looking for a light in the ramp. If this is going to be a case of arrests, the debate is going on in the TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X