విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో మద్యం ధరలు పెంచటానికి రీజన్ చెప్పిన సీఎం జగన్ .. ఏం చెప్పారంటే

|
Google Oneindia TeluguNews

కేంద్రం ఇచ్చిన సడలింపుల నేపధ్యంలో వైన్స్ షాపులు తెరవాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువగా మారాయి . కరోనా ప్రబలటానికి రీజన్ గా మారుతుంది అని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక ఈ క్రమంలో నిన్నటి నుండి మద్యం విక్రయాలు ప్రారంభం కాగా ఏపీలో లిక్కర్ కోసం జనం జాతరలా రావటం అందరికీ షాకింగ్ గా అనిపించింది . ఇక ఈ నేపధ్యంలో ఈ రోజు మరోమారు 50 శాతం ధరలను పెంచిన ఏపీ సర్కార్ ఇప్పటివరకు మొత్తం 75 శాతం లిక్కర్ ధరలను పెంచింది. ఇక లిక్కర్ ధరల విషయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు . లిక్కర్ ధరలను ఎందుకు పెంచారో ఆయనే స్వయంగా పేర్కొన్నారు.

Recommended Video

Andhra Pradesh Govt to Hike Liquor Prices By 25 Percent | Onewindia Telugu

అక్కడ ఆన్ లైన్ లో మద్యం విక్రయాలు .. ఇంటికే లిక్కర్ .. ఎందుకంటేఅక్కడ ఆన్ లైన్ లో మద్యం విక్రయాలు .. ఇంటికే లిక్కర్ .. ఎందుకంటే

అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ .. మద్య నియంత్రణే కర్తవ్యం అన్న సీఎం

అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ .. మద్య నియంత్రణే కర్తవ్యం అన్న సీఎం

కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మద్యపాన నిషేధానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు సీఎం జగన్ . వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏపీలో దశల వారీ మద్యపాన నిషేధానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఈ నేపధ్యంలో ప్రస్తుత తరుణంలో నెలకొన్న పరిస్థితులపై సీఎం జగన్ తమ ప్రభుత్వం మధ్య నిషేదానికే కట్టుబడి ఉందని సీఎం జగన్ స్పష్టం చేశారు. మద్యపాన నియంత్రణలో భాగంగా మద్యపానాన్ని కొనకుండా కట్టడి చెయ్యటానికి లిక్కర్‌ ధరలను భారీగా పెంచినట్టు సీఎం జగన్ వెల్లండిచారు.

మద్య నియంత్రణలో భాగంగానే భారీ ధరలు

మద్య నియంత్రణలో భాగంగానే భారీ ధరలు

ఇదే సమయంలో అక్రమ మద్యం రవాణాను అరికట్టటం కోసం గట్టి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఇక ఇప్పటికే ఢిల్లీలో 70 శాతం లిక్కర్‌ ధరలు పెంచారని ఇక ఈ క్రమంలోనే 75 శాతం పెంచి కొనుగోలు శాతం తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు సీఎం జగన్ . ఇక మద్య నియంత్రణలో భాగంగా మద్యం దుకాణాల సంఖ్యను మరో 13 శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే 20 శాతం తగ్గించామని పేర్కొన్న సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి మద్య నియంత్రణకు తీసుకున్న చర్యలను వివరించారు.

 షాక్ కొట్టించే రేట్లు ఉంటే కొనుగోలు చెయ్యరని నిర్ణయం తీసుకున్నామన్న జగన్

షాక్ కొట్టించే రేట్లు ఉంటే కొనుగోలు చెయ్యరని నిర్ణయం తీసుకున్నామన్న జగన్

ఇక మద్యపాన నియంత్రణలో భాగంగా మద్యం అమ్మకాల వేళలను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటవరకూ పరిమితం చేశామని . అందులో భాగంగానే ఈ 75 శాతం పెంపు నిర్ణయం కూడా తీసుకున్నామని ఆయన చెప్పుకొచ్చారు . ఇక అసలే లాక్ డౌన్ , పనుల్లేక ఖాళీగా ఇళ్లకే పరిమితం అయిన జనాలు .. ఇక వీరు లిక్కర్ షాపులకు క్యూ కట్టకుండా షాక్‌ కొట్టించే రేట్లు ఉండాలని నిశ్చయించుకున్నందువల్లే ఈ విధంగా ధరలు పెంచామని చెప్పారు. మద్య నియంత్రణకే వైసీపీ సర్కార్ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

English summary
In the wake of the corona epidemic, liquor stores have been closed for days with a lockdown to curb the spread. The latest decision by AP CM Jagan Mohan Reddy will now cause new problems in the AP. Opposition parties have been criticizing Corona for turning into a raison With the sale of alcohol from yesterday onwards, it was a shock to all the people coming for the Liquor in AP. AP CM hiked the prices once again and gave clarity of liquor rates hike .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X