విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం జగన్ హెలికాఫ్టర్ ల్యాండింగ్ వివాదం .. సీఎంవో సీరియస్

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ కానున్న నేపథ్యంలో ఆయన గన్నవరం ఎయిర్ పోర్ట్ కు హెలికాప్టర్ లో వెళ్లారు. అయితే హెలికాఫ్టర్ ల్యాండింగ్ సమయంలో సమస్యలు ఉన్నాయని అధికారులు సమాచారం అందించారు. దీంతో సీఎంఓ అధికారులు సీరియస్ అవుతున్నారు. అధికారులు తప్పుడు సమాచారం ఇవ్వటంతో ల్యాండింగ్ సమయంలో జాప్యం జరగటంతో సీఎం జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ కు ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ కాస్త ఆలస్యంగా జరగనుంది.

ఆ జిల్లా మహిళలకు బతుకమ్మ చీరలు లేనట్టే ... ఎందుకంటేఆ జిల్లా మహిళలకు బతుకమ్మ చీరలు లేనట్టే ... ఎందుకంటే

సీఎం జగన్ మోహన్ రెడ్డి హెలికాఫ్టర్ ల్యాండింగ్ వివాదం ఈ రోజు మాత్రమే కాకుండా, ఇటీవల వరదకు గురైన కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటించిన సందర్భంలోనూ సీఎం హెలికాప్టర్ ల్యాండింగ్ పై అధికారులు తప్పుడు సమాచారం అందించారు.హెలికాఫ్టర్ ల్యాండింగ్ వివరాలను ఒక క్రమ పద్ధతిలో డిగ్రీలు, మినిట్స్, సెకండ్స్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అధికారులు కేవలం డిగ్రీల్లో మాత్రమే ఇచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో ల్యాండింగ్ సమయంలో సమస్యలు తలెత్తుతున్నాయని సీఎం అధికారులు గుర్తించారు. ఒకసారి కాదు నేడు సైతం ఇలాగే జరగటంతో సీఎం కార్యాలయం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది.

CM Jagan helicopter landing dispute .. CMO Serious

ఇది చాలా నిర్లక్ష్యం అంటూ సీఎంఓ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. సీఎం కార్యాలయం అధికారులు కర్నూలు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై డీఆర్ఓ మరియు అధికారులు సీఎం హెలికాప్టర్ ల్యాండింగ్ విషయంలో తప్పుడు సమాచారం ఎందుకిచ్చారు అనే అంశంపై విచారణ జరుపుతున్నారు. జగన్ హెలికాఫ్టర్ ల్యాండింగ్ వివరాలపై నిర్లక్షంగా వ్యవహరించిన సర్వే శాఖ డి ఈ వేణుపై వేటుపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

English summary
CM Jagan Mohan Reddy's helicopter landing dispute not only today, but also during the recent floods in Kurnool district, the officials had given false information on the landing of the CM helicopter. However, CMO officials found that the landing problems were only caused by the fact that the officers were given the wrong information .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X