• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నాకు ఒక్క భార్యే: కొందరికి ముగ్గురు కూడా సరిపోక: శాసనసభలో జగన్ పంచ్ లు..!

|
  AP Assembly Winter Sessions 2019 : AP CM Jagan Satires And Punches || Oneindia Telugu

  ముఖ్యమంత్రి జగన్ శాసనసభా వేదికగా మరోసారి భార్యల అంశాన్ని ప్రస్తావించారు. అయితే, ఈ సారి ఎవరూ పేరును ఎత్తకుండానే పంచ్ లు వేసారు. దిశ ఘటన..ఏపీలో మహిళా భద్రత పైన చర్చకు సీఎం సమాధానం ఇచ్చారు. ఆ సమయంలో నేరం జరిగిన తరువాత విచారణ..శిక్ష వేయటంలో జాప్యం ఉండకూడదని చెప్పుకొచ్చారు. ఆ సందర్భంలో తనకు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని..చెల్లి ఉందని చెబుతూనే..తనకు ఒక్క భార్యే నంటూ వ్యాఖ్యానించారు. ప్రసంగం కొనసాగిస్తూ మరో సందర్భంలో కొందరు ఇద్దరు కాదు..ముగ్గురు కాదు..నాలుగో భార్య కోసం ముందుకొస్తూ ఉంటారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల సమయంలో వైసీపీ నేతల నవ్వులు సభలో వినిపించాయి. ఇక, చంద్రబాబు హాయంలో మహిళలపైన జరిగిన నేరాల చిట్టాను జగన్ బయట పెట్టారు. ఏపీలో మహిళా భదత్ర దిశగా కొత్త చట్టం తీసుకువస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

  మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే 21 రోజుల్లో ఉరిశిక్ష: హాట్సాఫ్ కేసీఆర్..పోలీసు: సీఎం జగన్ సంచలనం..!

  నాకు ఇద్దరు పిల్లలు..ఒక్క భార్యే..

  ముఖ్యమంత్రి జగన్ పరోక్షంగా పవన్ కళ్యాణ్ మీద పంచ్ లు వేసారు. దిశ హత్య కేసు తరువాత ఏ రకంగా స్పందించాలో వాస్తవంగా తెలియలేదని ఆవేదన వ్యక్తం చేసారు. తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని.. ఒక చెల్లి ఉందని..ఒక్క భార్యే ఉందని వ్యాఖ్యానించారు. ఇక, చంద్రబాబు హయాంలో జరిగిన మహిళల పైన నేరాలను అంకెలతో సహా వివరించారు. మహిళల పైన అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయనే భయం ఉండేలా చట్ట సవరణ అవసరమని అభిప్రాయ పడ్డారు. అదే సమయంలో బహుళ భార్య ఉన్నారనే కేసులు అంకెల వివరాలను వెల్లడించారు. ఆ సందర్బంలో కొందరు ఒకరు కాదు.. ఇద్దరు కాదు..ముగ్గురు సరిపోరు అనే విధంగా మరో భార్య కోసం ముందుకొస్తున్నారంటూ కామెంట్ చేసారు. సభ ముగిసిన తరువాత ఎమ్మెల్యేల మద్య సీఎం పంచ్ ల మీదనే చర్చ సాగింది.

  CM jagan interesting comments against Pawan Kalyan in assembly

  చంద్రబాబు హాయంలో లెక్కలు ఇలా..

  చంద్రబాబు హాయంలో మహిళల పైన దాడుల లెక్కలను సీఎం జగన్ బయట పెట్టారు. ఆయన పాలించిన అయిదేళ్ల కాలంలో వేలాది సంఖ్యలో మహిళలకు సంబంధించి కేసులు వేల సంఖ్యలో నమోదైనట్లుగా చెప్పుకొచ్చారు. అందులో రేపు కేసులు 2016లో 969 కాగా.. 2017లో 1046 గా ఉన్నాయని..అదే విధంగా 2018 లో 1096 రేపు కేసులు నమోదయ్యాయని సీఎం వివరించారు. ఆయన హాయంలో అన్యాయం జరిగిన మహిళలకు న్యాయం కూడా జరగలేదని విమర్శించారు. ఏపీలో తీసుకొస్తున్న కొత్త చట్టం ప్రకారం 21 రోజుల్లోనే నిందితులకు శిక్ష పడుతుందన్నారుద. నేరాలు నియంత్రణలో భాగంగానే మద్య నిషేధం తీసుకొస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా జీరో ఎఫ్ఐఆర్ విధానం అందుబాటులోకి తీసుకొస్తున్నామని ప్రకటించారు. ఈ నెల 11న సభలో మహిళా భద్రతకు సంబంధించి కొత్త బిల్లును సభలో ప్రవేశ పెడతామని సీఎం ప్రకటించారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  CM Jagan indirect comments on Janasena chief pawan Kalyan in Assembly. CM says he has only one wife..and he says that some people not satisfying with three wives moving for another wife.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more