విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్‌కు ముగ్గురు భార్యలు..నలుగురు పిల్లలు ఎక్కడ చదువుతున్నారు: వెంకయ్య పైనా.. జగన్ విసుర్లు!

|
Google Oneindia TeluguNews

Recommended Video

YS Jagan Strong Counter To Pawan Kalyan || చంద్రబాబు,వెంకయ్య పైన విసుర్లు! || Oneindia Telugu

ముఖ్యమంత్రి జగన్ మరోసారి పవన్ కళ్యాన్ భార్యల సంగతి ప్రస్తావించారు. పాదయాత్ర సమయంలో నాడు జగన్ ఇదే రకంగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికి కారణమయ్యాయి. ఇక, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల భాష భోదన గురించి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు బడుతున్న వారికి జగన్ సమాధానం ఇచ్చారు. అందునా వారి పేర్లు ప్రస్తావించి వారి పిల్లలు ఎక్కడ చదువుతున్నారు..ఇంగ్లీషు మీడియంలో కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన కుమారుడిని ఎక్కడ చదవించారు.. వెంకయ్య నాయుడు తన కుమారుడు..మనవళ్లను ఇంగ్లీషు మీడియంలో చదివించలేదా అని నిలదీసారదు. పెరుగుతున్న పోటీ ప్రపంచంలో మన పిల్లలు ఎదగాలంటే..అవకాశాలు అందుకోవాలంటే ఇంగ్లీషు మీడియం భోదన తప్పనిసరని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.

విజయ్ చందర్ కే ఆ పదవి : సీఎం జగన్ కీలక నిర్ణయం : వారందరి ఆశలు..ఇక..!విజయ్ చందర్ కే ఆ పదవి : సీఎం జగన్ కీలక నిర్ణయం : వారందరి ఆశలు..ఇక..!

పవనకు ముగ్గురు భార్యలు..నలుగురో..అయిదుగురో పిల్లలు..

పవనకు ముగ్గురు భార్యలు..నలుగురో..అయిదుగురో పిల్లలు..

గతం తన పాదయాత్ర సమయంలో పవన్ కళ్యాన్ భార్యల ప్రస్తావన తీసుకొచ్చి..కార్లు మార్చినట్లుగా పవన్ భార్యలను మారుస్తారని పవ్యాఖ్యలు చేసిన జగన్..ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వ కార్యక్రమం లో అదే రకంగా వ్యాఖ్యలు చేసారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతోత్సవాల్లో భాగంగా..ఆయన తన ప్రభుత్వం గవర్నమెంట్ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం నిర్వహించాలని నిర్ణయించిన విషయం గురించి వివరించారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ విమర్శలు చేసారని చెప్పుకొచ్చారు.

పవన్ కల్యాణ్ పిల్లల గురించి

పవన్ కల్యాణ్ పిల్లల గురించి

పవన్ కల్యాణ్ పిల్లల గురించి ప్రస్తావిస్తూ.. యాక్టర్ పవన్‌కు ముగ్గురు భార్యలు..వారికి నలుగురో..అయిదుగురో పిల్లలు..వారంతా ఎక్కడ చదువుతున్నారని ప్రశ్నించారు. వారిని ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో చదవటం లేదా..పేదలకు మాత్రమే ఇంగ్లీషు మీడియం చదవులు అవసరం లేదా అని ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారు.

వెంకయ్య నాయుడు..చంద్రబాబు పిల్లలు సైతం..

వెంకయ్య నాయుడు..చంద్రబాబు పిల్లలు సైతం..

అదే విధంగా వెంకయ్య నాయుడు సైతం ఇంగ్లీషు మీడియం నిర్ణయం పైన వ్యాఖ్యలు చేస్తున్నారని జగన్ చెప్పారు. ఆయన పిల్లలు..మనవళ్లు..మనవరాళ్లు ఇంగ్లీషు మీడియంలో కాదా చదివింది అని సీఎం ప్రశ్నించారు. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు తన కుమారుడు లోకేశ్ ను ఎక్కడ చదివించారని నిలదీసారు. మనవడు దేవాన్ష్ ను ఎక్కడ చదివించబోతున్నారో చెప్పాలన్నారు.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో

ప్రస్తుత పోటీ ప్రపంచంలో

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పోటీలో ఇంగ్లీషు మీడియం చదవకుండా మన పిల్లలు పోటీ పడలేరని..అది మన రాష్ట్రానికి.. జాతికి నష్టం చేస్తుందని చెప్పుకొచ్చారు. పేద పిల్లలకు ఇంగ్లీషు విద్య అందించాలనే తమ లక్ష్యమని పేదలకు అది అందిస్తుంటే వీరికి ఎందుక నచ్చటం లేదని ప్రశ్నించారు.

మదర్సాలకు అమ్మఒడి..

మదర్సాలకు అమ్మఒడి..

ఇక, ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషా కోరినట్లుగా మదర్సాలను డెవలప్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా అక్కడ మత పరమైన భోదనలతో పాటుగా వారి భవిష్యత్ కు అవసరమైన విద్యా భోదన సైతం అవసరమని చెప్పుకొచ్చారు. అక్కడ చదివే పిల్లలకూ అమ్మ ఒడి అమలు చేస్తామన్నారు. ఇక, తనకు కొంత సమయం ఇస్తే మార్చి నాటికి పెళ్లి కానుక పధకాన్ని లక్ష వరకు పెంచి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా మసీదులకు నిధులు.. ఇమాంలకు హామీ ఇచ్చిన విధంగా పారితోషకాలు అందిస్తామని స్పష్టం చేసారు. ఫీజు రీయంబర్స్ మెంట్ పూర్థి స్థాయిలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.

English summary
Cm Jagan once again personal comments on Pawan Kalyan. Jagan says actor pawan has three wives and four or five children.They studying in English medium schools. At the same time Venkaiah and Chandra babu child also studied in english medium. But they objecting poor people study in English medium schools.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X