విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం జగన్ ఆగ్రహం..అసంతృప్తి..!! ప్రతిపక్షంలోనే ఎదుర్కొన్నాం..ఇప్పుడు ఏంటి ఇలా....!!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ కు కోపం వచ్చింది. దేశంలో ఎవరూ చేయని విధంగా ప్రజలకు సంక్షేమం..మేలు చేస్తుంటే మీడియాలో ఎందుకింత వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ పధకాలు..నిర్ణయాలకు తగిన ప్రచారం దక్కడం లేదనే అభిప్రాయం ఆయనలో ఏర్పడినట్లు తెలుస్తోంది. తాజాగా ఛలో ఆత్మకూరు విషయంలో పోలీసులు ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం లేకుండా రెండు పార్టీల నేతలను ముందుగానే హౌస్ అరెస్ట్ చేసారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు తన ఇంటి నుండే ప్రభుత్వం మీద విమర్శలు చేయటం.. హైడ్రాగా కొనసాగటం..జాతీయ మీడియాలో దానికి విశేష ప్రాచుర్యం కల్పించటం పైన సీఎంఓ లో పెద్ద ఎత్తున చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తమ ప్రభుత్వం చేస్తున్న నిర్నయాల గురించి ఎక్కడా ప్రస్తావించని జాతీయ మీడియా..స్థానిక మీడియా ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారం పైనే ఎక్కువగా చర్చ సాగింది. అయితే..దీని పైన ముఖ్యమంత్రి సైతం ఎక్కడ లోపం జరుగుతోంది..ఇంత మంచి చేస్తున్నా..ఇంత మందిని అప్పాయింట్ చేసుకున్నా..ఎందుకీ వ్యతిరేక ప్రచారం సాగుతోంది అంటూ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే అధికారంలో ఉన్న చంద్రబాబును..ఆయన మద్దతు మీడియాను ఎదుర్కొని ప్రజలను మెప్పించి అధికారంలోకి వచ్చాము. ఇక, ఇప్పుడు అధికారంలో ఉండీ ఏంటీ పరిస్థితి..ఏం చేయాలనే దాని పైన వైసీపీ కోర్ టీంలో చర్చ మొదలైంది...

CM Jagan serious on media communications officials on negative campaign in national media

ఇంత చేసినా..వ్యతిరేక ప్రచారమా...
ఆర్దికంగా కుదేలైన రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. అవినీతికి ఆస్కారం లేకుండా పాలన చేస్తున్నాం. ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నాం. ఇంత చేసినా..జాతీయ మీడియా అదే విధంగా రీజనల్ మీడియాలో కొందరు ప్రభుత్వం పైన వ్యతిరేక ప్రచారం చేయటాన్ని ప్రభుత్వంలోని ముఖ్యులకు అసహనం కలిగిస్తోంది. ఛలో ఆత్మకూరు కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ముందుగానే జాతీయ మీడియాను సైతం అమరావతికి పిలిపించారు. పోలీసులు అడ్డుకుంటారని అంచనా వేసి వారిని ముందుగానే తన నివాసంలోకి తీసుకొచ్చారు. ఇక..హౌస్ అరెస్ట్ చేసినా.. ఆత్మకూరు బయలు దేరుతున్నానంటూ వాహనం ఎక్కారు. గేట్ వద్దకు రాగానే పోలీసులు అప్పటికే భారీగా మొహరించి ఉండటం.. గేటుకు తాళ్లతో కట్టేయటంతో దానిని అక్కడ ఉన్న జాతీయ మీడియా హైలెట్ చేసింది. దీని ద్వారా ఏపీలో రాజకీయ దాడులు జరుగుతున్నాయని.. శాంతి భద్రతలు అదుపు తప్పాయనే కోణంలో కధనాలు ప్రసారం అయ్యాయి. ఇక.. జాతీయ దిన పత్రికల్లో ఏపీ ప్రభుత్వం పీపీఏల మీద తీసుకున్న నిర్ణయాలు.. రాజధాని..పోలవరం పైన ప్రభుత్వ ఆలోచనల ద్వారా ఏపీకి నష్టం చేస్తున్నారనే అభిప్రాయం కలిగే కధనాలు వస్తున్నాయి. దీని పైన ముఖ్యమంత్రి తన మీడియా కమ్యూనికేషన్ల విభాగంలో ఉన్న అధికారుల పైన ఆగ్రహంతో పాటుగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే...
తొలి నుండి మీడియా మేనేజ్ మెంట్ లో టీడీపీ పై చేయి సాధిస్తూ వచ్చింది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో సైతం ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పైనే ఎక్కవగా వ్యతిరేక కధనాలు వచ్చేవి. అయినా.. అధికారంలో ఉన్న చంద్రబాబును..బలమైన మీడియా మద్దతును ఎదుర్కొని ప్రజల్లో ఉంటూ జగన్ ఒంటి చేత్తో అధికారం చేపట్టారు. కానీ, ఇప్పుడు ప్రభుత్వంలో ఉంటూ అనేక నిర్ణయాలు..హామీలు అమలు చేస్తూ.. పధకాలు ఇస్తున్నా జగన్ పైన వ్యతిరేక భావం కలిగేలా ప్రచారం సాగుతోంది. ఏపీలోనే కాదు..జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రచారంతో జగన్ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ తన ప్రభుత్వంలో మీడియా కమ్యూనికేషన్ల కోసం భారీ వేతనాలతో అనేక మందిని నియమించుకున్నారు. అయినా..ఆశించిన స్థాయిలో ప్రభుత్వ పధకాలకు.. నిర్ణయాలకు ప్రచారం రావటం లేదు. పైగా వ్యతిరేక ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. జాతీయ స్థాయి మీడియా కోసం ప్రత్యేకంగా నియామకాలు చేసారు. అయినా ఫలితం ఆశించిన స్థాయిలో లేదు. దీంతో..ముఖ్యమంత్రి జగన్ దీని పైన సీరియస్ గా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో..రానున్న రోజుల్లో ప్రభుత్వం మీద జరుగుతున్న వ్యతిరేక ప్రచారం కంట్రోల్ చేసుకోవటం..అనుకూల ప్రచారం కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
CM Jagan serious on media communications officials on negative campaign in national media. since two months national and regional media campaiging neagative stories on Cm Jagan decisions. Now this issue became damging for YCP leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X