విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శాసనసభలో ఉల్లి లొల్లి: స్పీకర్..సీఎం సీరియస్ : లోకేశ్..బాలకృష్ణ పై రోజా ఫైర్...!

|
Google Oneindia TeluguNews

ఉల్లి ధరల వ్యవహారం ఏపీ అసెంబ్లీ రగడకు కారణమైంది. ఉల్లి ధరలు..నిత్యావసరాల పైన టీడీపీ వాయిదా తీర్మానం ఇవ్వగా..స్పీకర్ దానిని తిరస్కరించారు. ఉదయం వెంకటాయ పాలెంలో ఎన్టీఆర్ విగ్రహనికి నివాళి అర్పించిన తరువాత టీడీపీ నేతలు ఉల్లిపాయలతో దండలు మెడలో వేసుకొని నిరసన ప్రదర్శన నిర్వహించారు. అసెంబ్లీ ప్రాంగణంలోనూ బైఠాయించారు. ఇక, సభలో స్పీకర్ టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం తిరస్కరించిన తరువాత..రాష్ట్రంలో మహిళా భద్రత గురించి సభలో స్వల్ప కాలిక చర్చ మొదలైంది. అయినా..తమ వాయిదా తీర్మానం తిరస్కరించటం పైన టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించారు. ఆ సమయంలో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి జగన్..రాష్ట్రంలో ఉల్లి ధరల నియంత్రణ..సరఫరా గురించి ప్రకటన చేసారు. దీని పైన టీడీపీ నేతలు తమకు మాట్లాడే అవకాశం ఇవ్వావలంటూ డిమాండ్ చేస్తూ నినాదాలు కొనసాగించారు. దీంతో..వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు సైతం వారికి పోటీగా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేసారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ..చంద్రబాబు పైన ఫైర్ అయ్యారు.

అచ్చెన్నకు సీఎం జగన్ పలకరింపుతో..: ఈ నెల 17వరకు ఏపీ అసెంబ్లీ: బీఏసీలో ఆసక్తికర పరిణామాలు...!అచ్చెన్నకు సీఎం జగన్ పలకరింపుతో..: ఈ నెల 17వరకు ఏపీ అసెంబ్లీ: బీఏసీలో ఆసక్తికర పరిణామాలు...!

 ఏ రాష్ట్రంలో లేని విధంగ..కిలో రూ 25కే..

ఏ రాష్ట్రంలో లేని విధంగ..కిలో రూ 25కే..

ఏ రాష్ట్రంలో లేని విధంగా..ఉల్లి కొరత దేశ వ్యాప్తంగా ఉన్నా కేవలం ఏపీలో మాత్రం కిలో ఉల్లిపాయను రూ 25 కు అందిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ సభలో స్పష్టం చేసారు. రాజస్థాన్ తో సహా దేశంలో ఎక్కడ ఉల్లి అందుబాటులో ఉన్నా ..తెప్పిస్తూ..సబ్సిడీ ధరకే ఉల్లిని అందిస్తున్నామని సీఎం చెప్పుకొచ్చారు. చంద్రబాబు హాయంలో ఉల్లిని రైతులు పొలాల్లోనే వదిలేసి వెళ్లిన సందర్బాలు ఉన్నాయని జగన్ ఫైర్ అయ్యారు. తామె అనేక రకాలుగా ఉల్లిని దిగుమతి చేసుకొనే ప్రయత్నం చేస్తున్నామని.. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థలో మాత్రం కిలో ఉల్లిని రూ 200కు విక్రయిస్తున్నారని జగన్ ఆరోపించారు. మరిన్ని చర్యల ద్వారా ఉల్లి కొరత లేకుండా చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. సబ్సిడీ ధరలకే రైతు బజార్ల ద్వారా ఉల్లిని అందుబాటులోకి తెస్తున్నామన్నారు.

 గిఫ్ట్ గా స్పీకర్ కు ఉల్లి....ప్రభుత్వం సీరియస్

గిఫ్ట్ గా స్పీకర్ కు ఉల్లి....ప్రభుత్వం సీరియస్

ముఖ్యమంత్రి ప్రకటన తరువాత వైసీపీ సభ్యురాలు రజని మహిళా భద్రత మీద చర్చ మొదలు పెట్టారు. ఆ సమయంలో టీడీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు. దీంతో..స్పీకర్ టీడీపీ సభ్యుల మీద ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉల్లి ధర మీద ముఖ్యమంత్రి ప్రకటన చేసారని.. మహిళా భద్రత మీద చర్చ అడ్డుకోవటం సరికాదని మండిపడ్డారు. అయినా టీడీపీ సభ్యులు ఆందోళన వీడకపోవటంతో వైసీపీ మహిళా సభ్యులు అభ్యంతర వ్యక్తం చేసారు. మహిళా సమస్యల పైన మాట్లాడుతుంటే అడ్డుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు. మంత్రి బుగ్గన జోక్యం చేసుకొని హెరిటేజ్ లో సైతం కిలో ఉల్లిని రూ 25కే అమ్ముతామని చంద్రబాబు ప్రకటించగలరా అని ప్రశ్నించారు. స్పీకర్ కు ఉల్లిని గిఫ్ట్ గా పంపిస్తారా అంటూ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

లోకేశ్..బాలకృష్ణ పైన రోజా ఫైర్..

లోకేశ్..బాలకృష్ణ పైన రోజా ఫైర్..

టీడీపీ నేతలు మహిళా భద్రతకు అడ్డుకోవటం...స్పీకర్ పోడియం వద్దకు రావటంతో వారికి పోటీగా వైసీపీ మహిళా ఎమ్మెల్యేల సైతం పోడియం వద్దకు చేరుకున్నారు. మహిళా భద్రత మీద చర్చించాలని డిమాండ్ చేసారు. వైసీపీ ఎమ్మెల్యేలు హెరిటేజ్ లో కిలో ఉల్లి రూ 200 అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. నిరసనల మధ్యే వైసీపీ సభ్యురాలు రజని తన ప్రసంగం కొనసాగించారు. వైసీసీ సభ్యురాలు రోజా టీడీపీ నేతల తీరు మీద మండిపడ్డారు. దిశ అంశాన్ని ప్రస్తావించారు. లోకేశ్ ఫొటోలు..బాలక్రిష్ణ అమ్మాయి కనిపిస్తే కడుపు చేయాలనే అంశాలు ఎక్కడా లేవనెత్తుతారో అనే భయం టీడీపీలో కనిపిస్తుందన్నారు. లోకేశ్ పప్పు లోకి ఉల్లి లేదని బాధ పడుతున్న చంద్రబాబు.. ఆయనకు అమ్మాయిలు లేకపోవటంతో ఆడవారి బాధలు కనిపించటం లేదని దుయ్యబట్టారు. దిశ నిందితులకు వెంటనే శిక్ష పడాలని దేశం మొత్తం కోరుకుంది. వారి ఎన్ కౌంటర్ తో మహిళలు సంబరాలు చేసుకుంటున్నారని వివరించారు.

English summary
AP CM jagan state that only Ap Govt giving kg Onion for rs 25. Planning to import onion from different places to clear the shortage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X