• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సీఎం రమేష్ చాలా రిచ్ గురూ..! దుబాయ్ లో కుమారుడి నిశ్చితార్దం: 15 ప్రత్యేక విమానాల్లో..!

|

సీఎం రమేష్. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. సడన్ గా టీడీపీ నుండి బీజేపీలోకి మారిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో కీలకం. బీజేపీకి రాజ్యసభలో అనేక బిల్లులు పాస్ అవ్వటంలో ఇతర పార్టీల మద్దతు కూడగట్టటంలో కీలకంగా వ్యవహరించారు. అయితే..ఏపీలో మాత్రం ఆయన టీడీపీ మాజీ నేతగా..రాజ్యసభ సభ్యుడిగా..ఒక పారిశ్రామిక వేత్తగా మాత్రమే ఎక్కువగా చెప్పుకుంటారు. అయితే, ఇప్పుడు దేశ వ్యాప్తంగానే అందరూ సీఎం రమేష్ గురించి మాట్లాడుకుంటున్నారు. గతంలో గాలి జనార్ధన రెడ్డి ఇంట్లో జరిగిన వివాహం ఘనంగా జరిపించిన అంశం అప్పట్లో హాట్ టాపిక్. ఇక, ఇప్పుడు సీఎం రమేష్ కుమారుడి నిశ్చితార్దం పైన అక్కడ పార్లమెంట్ సభ్యుల మధ్య..ఏపీలో సాధారణ ప్రజల్లోనూ చర్చకు కారణమైంది. ఎందుకంటే..సీఎం రమేష్ తన కుమారుడి నిశ్చితార్దానికి చేసిన ఏర్పాట్లు.. ఖర్చు చూసి.. ఔరా..అనుకుంటున్నారు.

టీడీపీకి మరో షాక్..! సీఎం జగన్ తో బీఎమ్మార్‌ మంతనాలు: వైసీపీలో ఎంట్రీ ఖాయమేనా..!టీడీపీకి మరో షాక్..! సీఎం జగన్ తో బీఎమ్మార్‌ మంతనాలు: వైసీపీలో ఎంట్రీ ఖాయమేనా..!

దుబాయ్ లో కుమారుడి నిశ్చితార్ధం

దుబాయ్ లో కుమారుడి నిశ్చితార్ధం

సీఎం రమేష్ కుమారుడు రిత్విక్ నిశ్చితార్ధం ఈ రోజు దుబాయ్ లో జరుగుతోంది. పారిశ్రామిక వేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజాతో నిశ్చితార్ధం ఖరారైన సమయం నుండి సీఎం రమేష్ ఈ వేడుక నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. దీనిని దుబాయ్ లో నిర్వహణ కోసం నెల రోజులుగా ఏర్పాట్లు మొదలు పెట్టారు. అందులో భాగంగా..దుబాయ్ లోని వాల్డాఫ్ర్ అస్టోరియా, రసాల్ ఖైమా లో వేదిక ఖరారు చేసారు. ఇందు కోసం సీఎం రమేష్ పార్లమెంట్ లోని ఎంపీలతో పాటుగా అతిరధ మహారధులను ఆహ్వానించారు.కొంత మంది ప్రముఖులు ముందుగానే దుబాయ్ చేరుకొని సీఎం రమేష్ అతిథ్యంలో మునిగిపోయారు. ఇప్పుడు సీఎం రమేష్ కు వియ్యంకుడు అవుతున్న రాజా తాళ్లూరి సైతం ప్రముఖ పారిశ్రామిక వేత్త. అమెరికా కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.

15ప్రత్యేక విమానాలు..అధిక సంఖ్యలో ఎంపీలు

15ప్రత్యేక విమానాలు..అధిక సంఖ్యలో ఎంపీలు

సీఎం రమేష్ తన కుమారుడి నిశ్చితార్ధానికి పెద్ద సంఖ్యలో ప్రముఖులను ఆహ్వానించారు. ఏపీలోని అన్ని పార్టీలకు చెందిన నేతలతో పాటుగా ప్రధానంగా ఢిల్లీలో బీజేపీ నేతలను పేరు పేరునా ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. ఇందు కోసం వారు దుబాయ్ చేరుకోవటానికి ప్రత్యేకంగా 15 విమానాలను ఏర్పాటు చేసారు. తాను ఆహ్వానించిన వారిలో హాజరవుతుంది ఎవరు..రాలేకపోతుంది ఎవరనే అంశాన్ని స్వయంగా సీఎం రమేష్ పర్యవేక్షిస్తున్నారు. అయితే, టీడీపీలో అధినేత కోటరీలో కీలకంగా పని చేసిన సీఎం రమేష్ ఇప్పుడు బీజేపీలో చేరినా..టీడీపీ నేతలతో పాటుగా వైసీపీ ఎంపీలకు ఆహ్వానాలు అందాయి. దీంతో..వారిలో ఎవరు హాజరవుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

అతిధుల కోసం ఏర్పాట్లు అదుర్స్..

అతిధుల కోసం ఏర్పాట్లు అదుర్స్..

ఇక, అతిధుల ఆధిత్యం కోసం సీఎం రమేష్ అదిరిపోయే ఏర్పాట్లు చేసారు.అతిధులకు స్వాగలం పలికేందుకు దుబాయ్ ఏయిర్ పోర్టు నుండి వారికి కేటాయించిన బస వరకు వారిని తోడ్కొని వెళ్లటానికి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసారు. నిశ్చితార్ధం నిర్వహణ బాధ్యతలను ప్రముఖ అంతర్జాతీయ సంస్థకు అప్పగించారు. అదే విధంగా..సెలబ్రేషన్స్ నిర్వహణ..అతిధుల మేనేజ్ మెంట్ బాధ్యతలు..ఇలా ఒక్కో సంస్థకు ఒక్కో పని అప్పగించారు. దుబాయ్ లో మకాం వేసిన సీఎం రమేష్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తున్నారు. అయితే, ఇదే సమయంలో ఇంత భారీగా కుమారుడి నిశ్చతార్ధం చేస్తున్న సీఎం రమేష్ పైన గతంలో జరిగిన ఐటీ దాడుల గురించి కొందరు రాజకీయ నేతలు ప్రస్తావిస్తున్నారు.

English summary
Rajyasabha Member CM Ramesh grand arragements for his son marriage yougangement in Dubai. He arranged nearly 15 special flights for invitees from India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X