విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం రమేష్ రాజకీయం .. కుమారుడి పెళ్ళికి సీఎం జగన్ కు ఇన్విటేషన్.. షాక్ ఇచ్చిన జగన్ ?

|
Google Oneindia TeluguNews

సీఎం రమేష్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి దగ్గర కావాలని ప్రయత్నం చేస్తున్నారా ? ఏపీలో వైసీపీ అధికారంలోకి రావటంతో టీడీపీ నుండి ప్లేటు ఫిరాయించి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇటీవల సీఎం జగన్ విషయంలో విమర్శలకు దూరంగా ఉంటున్న కారణం ఏంటి ? తన కుమారుడి పెళ్ళికి పిలిచి సీఎం జగన్ తో సఖ్యత పెంచుకోవాలనే ప్రయత్నం వెనుక కూడా మతలబు ఉందా ? ఇవి సీఎం రమేష్ పై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో మెదులుతున్న ప్రశ్నలు .

కుమారుడి వివాహానికి సీఎం జగన్ ను ఆహ్వానించిన సీఎం రమేష్

కుమారుడి వివాహానికి సీఎం జగన్ ను ఆహ్వానించిన సీఎం రమేష్

సీఎం రమేష్ తన కుమారుడి ఎంగేజ్మెంట్ దుబాయ్ లో ఎంత అట్టహాసంగా జరిగిందో తెలిసిందే . ఇక ఇప్పుడు ఆయన కుమారుడి పెళ్లి కూడా అంతకంటే ఘనంగా జరపాలని పెళ్ళికి రాష్ట్రపతితో సహా రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇదే క్రమంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని సైతం వివాహానికి ఆహ్వానించారు సీఎం రమేష్ . టీడీపీ ప్రభుత్వంలో ఉండగా అప్పటి ప్రతిపక్ష నేత సొంత జిల్లావాడు అయిన వైఎస్ జగన్ పై దారుణ విమర్శలు చేసిన సీఎం రమేష్ ఇప్పుడు సీఎం జగన్ ను తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా సతీసమేతంగా వెళ్లి మరీ ఆహ్వానించారు.అయితే సీఎం జగన్ చెప్పిన సమాధానం విని ఎంపీ రమేష్ షాక్ అయ్యారని సమాచారం . ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే

మొదటి నుండీ బద్ధ శత్రువులుగా సీఎం రమేష్ , జగన్ లు

మొదటి నుండీ బద్ధ శత్రువులుగా సీఎం రమేష్ , జగన్ లు


ఒకప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ గత ఎన్నికల్లో విజయం సాధించి సీఎం అయ్యారు. ఇక టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడుగా ఉన్న సీఎం రమేష్ బీజేపీలోకి జంప్ అయ్యారు. కడప జిల్లాకు చెందిన సీఎం జగన్, సీఎం రమేష్ లు వైఎస్ హయాం నుంచే బద్ధ శత్రువులు. చంద్రబాబు కు రైట్ హ్యాండ్ గా వ్యవహరించిన సీఎం రమేష్ సందర్భం వచ్చిన ప్రతీసారి జగన్ పై విమర్శలు గుప్పించేవారు. కానీ సీఎంగా జగన్ అయ్యాక రాజకీయ పరిస్థితులను బట్టి బీజేపీలో చేరిన సీఎం రమేష్ ఇప్పుడు కాస్త దూకుడు తగ్గించటమే కాదు ఎలాగైనా సీఎం జగన్ తో కాస్త సఖ్యంగా ఉండాలని భావిస్తున్నారు.

పెళ్ళికి రాలేనని కారణం చెప్పిన సీఎం జగన్

పెళ్ళికి రాలేనని కారణం చెప్పిన సీఎం జగన్

తాజాగా సీఎం రమేష్ తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించేందుకు సతీసమేతంగా సీఎం జగన్ ను కలిశారు . వివాహానికి ఖచ్చితంగా రావాలని వారు కోరారు కానీ జగన్ మాత్రం సీఎం రమేష్ కు నో చెప్పారని సమాచారం . తాను పెళ్లికి రాలేనని చెప్పిన జగన్ మీ కుమారుడి పెళ్లికి తన రాజకీయ ప్రత్యర్థులు టీడీపీ అధినేత చంద్రబాబు, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వస్తారని అందుకే తాను రాలేనని అన్నారని సమాచారం .తాను తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం సహా ఇంగ్లీష్ మీడియం చదువులను వ్యతిరేకించిన వారి మధ్య కూర్చోవడం తనకు, వారికి కూడా ఇబ్బందేనని అందుకే రానని సీఎం రమేష్ కు చెప్పి పెళ్ళికి రాలేనని తిరస్కరించారట జగన్ .

జగన్ కు సీఎం రమేష్ దగ్గర కావాలనుకున్న కారణం ఇదే

జగన్ కు సీఎం రమేష్ దగ్గర కావాలనుకున్న కారణం ఇదే


సొంత జిల్లా వాడే అయినా మొదట నుండీ బద్ధ శత్రువు గా వ్యవహరించిన సీఎం రమేష్ ఇప్పుడు జగన్ ను తన కుమారుడి పెళ్ళికి పిలవటం, దగ్గర కావాలని ప్రయత్నం చెయ్యటం , జగన్ మీద ఇటీవల కాలంలో విమర్శలు చెయ్యకుండా ఉండటం అన్నీ రాజకీయ అవసరాలకే అని జోరుగా చర్చ జరుగుతుంది. . చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీ వ్యాప్తంగా వందల కాంట్రాక్టులు పట్టిన సీఎం రమేష్ కు ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాక ఆ బిల్స్ అన్నీ ఆగిపోయాయని సమాచారం. అందుకే ఎక్కడ చిన్న అవకాశం దొరికినా ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు సీఎం రమేష్ .

English summary
Recently, MP CM Ramesh met CM Jagan to invite of his son's wedding. They were asked to come to the wedding for sure but Jagan informed CM Ramesh. said that he would not come to son's wedding because of his political rivals TDP chief Chandrababu and Vice President Venkaiah Naidu will come to the wedding.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X