విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్‌- కమెడియన్‌ అలీ పొగడ్తలు-బెజవాడలో వైసీపీకి ప్రచారం

|
Google Oneindia TeluguNews

విజయవాడలో వైసీపీ అభ్యర్ధులకు మద్దతుగా టాలీవుడ్‌ కమెడియన్‌ అలీ ఇవాళ ప్రచారం నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, స్ధానిక మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఇతర అభ్యర్ధులతో కలిసి ఆయన ఇవాళ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలీ మంత్రి వెల్లంపల్లి, కార్పోరేటర్‌ అభ్యర్ధులతోకలిసి స్ధానిక భవానీపురం దర్గాను కూడా సందర్శించారు.

comedian ali campaign for ysrcp in vijayawada corporation polls, offer chaddar at dargah

విజ‌య‌వాడ‌లో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్ధుల గెలుపుకు మద్ధతుగా దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావుతో క‌లిసి ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు ప్రాంతాల్లో తెలుగు సినిమా హాస్యనటుడు అలీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్న ఏకైక నేత వైఎస్ జగన్ అన్నారు. జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాల‌ని కోరారు.. అప్ప‌డు వై.ఎస్. పాలన చూశాం..ఇప్పుడు జగన్ పాలనను చూస్తున్నాం అని అనందం వ్య‌క్తం చేశారు. అన్ని కులాల వారికి న్యాయం చేయాలన్నదే జగనన్న తపన అన్నారు..

comedian ali campaign for ysrcp in vijayawada corporation polls, offer chaddar at dargah

విజయవాడ న‌గ‌ర అభివృద్ధికి వంద‌ల కోట్లు రూపాయ‌ల‌ను కెటాయించిన ఘ‌న‌త జ‌గ‌నన్న‌ది అని అలీ అన్నారు. జగన్ ద్వారానే అభివృద్ధి సాధ్యం అన్నారు.. పశ్చిమ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించిన అనంత‌రం అలీ భ‌వానీపురం ద‌‌ర్గాకు వెళ్లారు. గాలిబ్‌ షహీద్‌ దర్గాలో ఆయన పూలు, ఛాద‌ర్ స‌మ‌ర్పించారు. అనంతరం కాసేపు అభ్యర్ధులతో ముచ్చటించాక వెనుదిరిగారు. గత అసెంబ్లీ ఎన్నకిలకు ముందే వైసీపీలో చేరిన అలీ.. ఆ పార్టీ చరఫున నామినేటెడ్‌ పదవిని ఆశిస్తున్నారు. గతంలో జగన్ ఈ మేరకు హామీ కూడా ఇవ్వడంతో ఆయన సూచన మేరకు ప్రచారంలో కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.

English summary
tollywood comedian ali on saturday hold campaign for ysrcp in upcoming vijayawada municipal corporation elections. he visits local galib shaheed dargah and offered chaddar also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X