విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌గ‌న్‌తో ట‌చ్‌లోకి కాంగ్రెస్ హైక‌మాండ్ దూత: ఢిల్లీ వేదిక‌గా కొత్త స‌మీక‌ర‌ణాలు: జ‌గ‌న్ తేల్చేసారు..

|
Google Oneindia TeluguNews

జాతీయ స్థాయిలో వైసిపి మ‌ద్ద‌తు ఎవ‌రికి. చంద్ర‌బాబు మ‌ద్ద‌తిస్తున్న కాంగ్రెస్ కూట‌మికి జ‌గ‌న్ సైతం అండ‌గా నిలిచే అవ‌కాశం ఉందా. ఎన్డీఏ వైపు జ‌గ‌న్ నిలుస్తారా. అస‌లు ఫెడ‌రల్ ప్రంట్ రూపు ఇంకా సిద్దం కాలేదు. ఇటువంటి చ‌ర్చ నడుమ ఏపీలోనే కాదు..జాతీయ స్థాయిలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారుతున్నాయి. కేంద్రంలో సంకీర్ణ ప్ర‌భుత్వం త‌ప్ప‌ద‌ని అంచనాల‌తో ఉన్న రెండు ముఖ్య‌మైన పార్టీలు ఇప్ప‌టికే అధిక సీట్లు సాధించే పార్టీల‌తో సంప్ర‌దింపులు అప్పుడే ప్రారంభించారు. ఏపీలో టీడీపీ..వైసీపీ సాధించే లోక్‌స‌భ సీట్లు కేంద్రంలో ఎవ‌రికి మద్దతుగా ఉంటాయ‌నేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

నాడు హ‌రికృష్ణ‌..నేడు శ్రావ‌ణ్ కుమార్ : చంద్ర‌బాబు నిర్ణ‌యాల‌తో : సెంటిమెంట్ పండించ‌టానికేనా..! నాడు హ‌రికృష్ణ‌..నేడు శ్రావ‌ణ్ కుమార్ : చంద్ర‌బాబు నిర్ణ‌యాల‌తో : సెంటిమెంట్ పండించ‌టానికేనా..!

జ‌గ‌న్‌తో ట‌చ్‌లో కాంగ్రెస్ దూత‌లు..

జ‌గ‌న్‌తో ట‌చ్‌లో కాంగ్రెస్ దూత‌లు..

ఏపిలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏపీలో అధికారంలోకి రావ‌టంతో పాటుగా లోక్‌స‌భ సీట్ల‌ను సైతం వైసీపీ అధికంగా గెలుచుకుంటుంది ఇప్ప‌టికే ప‌లు స‌ర్వే సంస్థ‌లు స్పష్టం చేసాయి. కేంద్రంలో ఏ పార్టీకి స్ప‌ష్ట‌మైన మెజార్టీ వ‌చ్చే అవ‌కాశం లేద‌నే వాద‌న వినిపిస్తోంది. దీంతో...ప్రాంతీయ పార్టీలు ఈసారి కీల‌క భూమిక పోషించ‌నున్నాయి. ఏపీ నుండి టీడీపీ..వైసీపీ రెండు పార్టీలు సాధించే లోక్‌స‌భ సీట్ల ఆధారంగా వారికి కేంద్రంలో ప్రాధాన్య‌త లభించ‌నుంది. ఇప్ప‌టికే జ‌గ‌న్ బీజేపీ నేత‌ల‌తో ట‌చ్‌లో ఉన్నార‌నే ప్ర‌చారం సాగుతోంది. ఇక‌, కొద్ది రోజుల క్రితం జ‌గ‌న్ తో కేసీఆర్ ప్ర‌తినిధిగా టీఆర్‌య‌స్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వ‌యంగా జ‌గ‌న్ నివాసానికి వ‌చ్చి ఫెడ‌రల్ ఫ్రంట్ కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు. జ‌గ‌న్ సైతం ఏపీకీ ప్ర‌త్యేక హోదాకు టిఆర్‌య‌స్ మ‌ద్ద‌తుగా నిలిస్తే..క‌లిసి ప‌ని చేయ‌టానికి ఇబ్బంది లేద‌నే సంకేతాలు ఇచ్చారు. ఇక‌, ఇప్పుడు కాంగ్రెస్ దూత‌లు సైతం జ‌గ‌న్‌తో ట‌చ్‌లోకి వ‌చ్చారు. అయితే, కేసుల‌తో వేధించిన కాంగ్రెస్‌కు జ‌గ‌న్ మ‌ద్ద‌తిస్తారా అంటే సందేహ‌మే.

కాంగ్రెస్‌..జ‌గ‌న్ ఎవ‌రికి ఎవ‌రు అవ‌స‌రం..

కాంగ్రెస్‌..జ‌గ‌న్ ఎవ‌రికి ఎవ‌రు అవ‌స‌రం..

జాతీయ స్థాయిలో ఇప్ప‌టి వ‌ర‌కు అయిదు ద‌శ‌ల్లో పోలింగ్ ప్ర‌క్రియ పూర్త‌యింది. అటు ఎన్డీఏ..ఇటు యూపీఏ ఏ కూట‌మికి స్ప‌ష్ట‌మైన మెజార్టీ వ‌చ్చే అవ‌కాశం లేద‌ని చెబుతున్నారు. దీంతో..కాంగ్రెస్ హైక‌మాండ్ విధేయుడుగా ఉన్న ఓ ప్ర‌ముఖుడు గ‌తంతో వైయస్‌తో స‌న్నిహితంగా మెలిగే ఓ ప్ర‌ముఖుడు వైసీపీ అధినేతతో ట‌చ్‌లోకి వ‌చ్చిన‌ట్లు విశ్వ‌స నీయ స‌మాచారం. కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తివ్వాల‌ని..మీరు కోరుకుంటున్న ప్ర‌త్యేక హోదా పైన ఇప్ప‌టికే రాహుల్ హామీ ఇచ్చార‌ని కోరిన‌ట్లు తెలుస్తోంది. అయితే, జ‌గ‌న్ అవున‌ని..కాద‌ని స‌మాధానం చెప్ప‌కుండా ఆయ‌న చెప్పింది విని ఊరుకున్నారు. గ‌తంలో..ఒక ఇంట‌ర్వ్యూలో జ‌గ‌న్ కాంగ్రెస్‌తో సంబంధాల గురించి చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న ప్ర‌స్తావించిన‌ట్లు స‌మాచారం. కాంగ్రెస్ పైన త‌న‌కు ఎటువంటి క‌క్ష్య లేద‌ని..వారికి మ‌ద్ద‌తిచ్చే అంశం గురించి మాత్రం ఏదీ చెప్ప‌లేన‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. దీంతో..కాంగ్రెస్ నేత‌ల్లో జ‌గ‌న్ మ‌ద్ద‌తు ల‌భిస్తుంద‌నే న‌మ్మ‌కం ఏర్ప‌డింది. జ‌గ‌న్ మాత్రం ఎవ‌రైతే ప్ర‌త్యేక హోదాకు మ‌ద్ద‌తిస్తారో వారికే త‌న మ‌ద్ద‌తు ఉంటుంద‌ని తేల్చి చెప్పారు.

చంద్ర‌బాబు ఉన్న చోట జ‌గ‌న్ ఉంటారా..

చంద్ర‌బాబు ఉన్న చోట జ‌గ‌న్ ఉంటారా..

ఎన్డీఏతో తెగ తెంపులు చేసుకున్న త‌రువాత చంద్ర‌బాబు కాంగ్రెస్ అధినేత రాహుల్‌కు ద‌గ్గ‌ర‌య్యారు. యుపిఏకు మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మోదీని ప్ర‌ధాని కాకుండా అడ్డుకోవ‌ట‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని చెబుతున్నారు. ఇదే స‌మ‌యం లో జ‌గ‌న్ కు ప‌రోక్షంగా మోదీ..కేసీఆర్ స‌హ‌క‌రిస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. జ‌గ‌న్ మాత్రం కేంద్రంలో ఏ పార్టీకి స్ప‌ష్ట‌మైన మెజార్టీ రాకూడ‌న‌ది..త‌మ మ‌ద్ద‌తుతో ఏర్ప‌డే ప్ర‌భుత్వం అధికారంలోకి రావాల‌ని కోరుకుంటున్నారు. అయితే, కాంగ్రెస్ ఒక వైపు చంద్ర‌బాబుతో స్నేహం చేస్తూ..ఇటు జ‌గ‌న్‌తో మంత‌నాలు ప్రారంభించింది. ఏపీలో జ‌గ‌న్‌కే ఎక్కువ లోక్‌స‌భ సీట్లు వ‌స్తాయ‌నే స‌ర్వేల లెక్క‌ల ఆధారంగా మంత‌నాలు ప్రారంభించిన‌ట్లు చెబుతున్నారు. అయితే, చంద్ర‌బాబు ఉన్న కూట‌మిలో జ‌గ‌న్ చేరే అవ‌కాశం ఉండ‌ద‌ని పార్టీ నేత‌లు స్ప‌ష్టం చేస్తున్నారు. మ‌రి..చంద్ర‌బాబు- జ‌గ‌న్ ఎవ‌రు ఎవ‌రికి మ‌ద్ద‌తిస్తారు..ఎవ‌రికి ప్రాధాన్య‌త ల‌భిస్తుందో తెలియాలంటే 23న ఏపీ ఫలితాల‌తో పాటుగా జాతీయ స్థాయిలో వ‌చ్చే ఫ‌లితాల ఆధారంగా నిర్ణ‌యాలు జ‌ర‌గ‌నున్నాయి.

English summary
New political development in AP Politics. Senior congress leader touch with Jagan for support in Central. But jagan did not given any assurance to that leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X