విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో కరోనా కలకలం ..విజయవాడలో ఒకరు,ఏలూరులో ఇద్దరికి కరోనా?

|
Google Oneindia TeluguNews

నిన్నా మొన్నటి దాకా చైనాను వణికించిన కరోనా వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ కరోనా వ్యాపిస్తుంది అని రూమర్స్ బాగా ప్రచారం అవుతున్నాయి. ఇక తెలంగాణా రాష్ట్రంలో కరోనా కేసులు నమోదు కావటంతో తెలంగాణా ప్రజలు భయపడుతున్నారు. ఇక వైద్య శాఖాధికారులు అన్ని చర్యలు చేపడుతున్నామని, భయపడకండి అని చెప్పినప్పటికీ భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఇదే సమయంలో పొరుగు రాష్ట్రానికి కూడా కరోనా భయం పట్టుకుంది. ఎక్కడ ఎవరికి ఏం జరిగినా కరోనా అని భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.

కోవిడ్ 19 ఎఫెక్ట్ ... కరోనా నుండి కాపాడమని చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలుకోవిడ్ 19 ఎఫెక్ట్ ... కరోనా నుండి కాపాడమని చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు

ఏపీలో కరోనా వైరస్ భయం ... కృష్ణా జిల్లాలో ఓ అనుమానిత కేసు

ఏపీలో కరోనా వైరస్ భయం ... కృష్ణా జిల్లాలో ఓ అనుమానిత కేసు

ఇటాలియన్‌ టూరిస్టుల ద్వారా దేశంలోకి అడుగుపెట్టిన కరోనా ఇటాలియన్లు పర్యటించిన ప్రాంతాల్లో పలువురికి వైరస్‌ సోకింది. ఇక తెలంగాణా రాష్ట్రంలో కరోనా కేసులు నమోదు కాగా ఇక తాజాగా ఏపీలో కరోనా వైరస్ భయం పట్టుకుంది. కృష్ణా జిల్లా విజయవాడలో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో ఓ వ్యక్తి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు ఏలూరులోనూ ఇద్దరు కరోనా అనుమానితులు ఆస్పత్రిలో ఉన్నారు.

విజయవాడ ప్రజలకు కరోనా భయం

విజయవాడ ప్రజలకు కరోనా భయం

జలుబుతో ఆసుపత్రిలో చేరిన అతని రక్త నమూనాలను పూణే ల్యాబ్ కు పంపించారు వైద్యులు .అయితే రిపోర్టు రావడానికి 72 గంటల సమయం పడుతుందని వైద్యులు వెల్లడించడంతో సదరు వ్యక్తిని ఐసోలేషన్ వార్డు లో ఉంచారు. దీంతో విజయవాడ ప్రజలకు కరోనా వైరస్ భయం పట్టుకుంది. ఉద్యోగరీత్యా హైదరాబాదులో స్థిరపడిన సదరు వ్యక్తి ఇటీవల జర్మనీలో 17 రోజులపాటు బస చేసి వచ్చారు. జర్మనీ ,బెంగళూర్ ,హైదరాబాద్ కు విమాన ప్రయాణం చేసినట్లు గుర్తించారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇతనికి కరోనా వైరస్ సోకిందేమో అన్న అనుమానాన్ని వైద్యులు వ్యక్తం చేస్తున్నారు.

Recommended Video

Coronavirus (COVID-19) : Sales of Masks, Sanitizers Increased Across India | Oneindia Telugu
ఏలూరులో ఇద్దరు అనుమానితులు .. టెన్షన్లో వైద్య ఆరోగ్య శాఖ

ఏలూరులో ఇద్దరు అనుమానితులు .. టెన్షన్లో వైద్య ఆరోగ్య శాఖ

ఇక విజయవాడలోనే కాకుండా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కూడా ఇద్దరు కరోనా అనుమానితులు జాయిన్ అయ్యారు. చికిత్స పొందుతున్న ఈ ఇద్దరు కరోనా అనుమానితుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిన్న ఇద్దరి రక్తనమూనాలను పరీక్షలకు పూణే పంపించారు. రక్త పరీక్షల ప్రాథమిక ఫలితాలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నారు . మరోవైపు విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను జిల్లా వ్యాప్తంగా సేకరించే పనులో అధికారులు నిమగ్నమయ్యారు. మొత్తానికి ఏపీ సైతం కరోనా భయంతో వణికిపోతుంది.

English summary
The Corona was entered the country through Italian tourists, have been infected by a number of people. Corona cases have been recorded in Telangana state. One person is admitted to a government hospital on suspicion of coronavirus symptoms in Vijayawada in Krishna district. Also, there are two corona suspects in the hospital of AP .with this people of AP in corona tension .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X