విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ సచివాలయంలో కరోనా టెన్షన్ .. ఉద్యోగికి కరోనా .. ౩, 4 బ్లాకులు మూసివేత

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ఇప్పుడు భారతదేశాన్ని మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాలను సైతం వణికిస్తోంది. ముఖ్యంగా ఏపీలో కరోనా ఉద్యోగులకు దడ పుట్టిస్తుంది .ఇక తాజాగా కరోనా వైరస్ ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం పై పడింది.ఏపీ సచివాలయంలో విధులు నిర్వర్తించే ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఒక్కసారిగా సెక్రటేరియట్ ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు.

 ఏపీ మంత్రి శంకర్ నారాయణ ఇంట్లో కరోనా కలకలం ... అసలేం జరిగిందంటే ఏపీ మంత్రి శంకర్ నారాయణ ఇంట్లో కరోనా కలకలం ... అసలేం జరిగిందంటే

సెక్రటేరియట్ ఉద్యోగికి కరోనా పాజిటివ్

సెక్రటేరియట్ ఉద్యోగికి కరోనా పాజిటివ్

ఇక సెక్రటేరియట్ లో పనిచేసే సదరు ఉద్యోగి 3,4 బ్లాకుల్లో విధులు నిర్వర్తించేవారు.సెక్రటేరియట్ ఉద్యోగికి కరోనా పాజిటివ్ రావడంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు సచివాలయం మొత్తం రసాయనిక ద్రావణాలు శానిటైజ్ చేస్తున్నారు.అంతేకాదు మూడు, నాలుగు బ్లాక్ లలోకి నిషేధించారు. దీంతో ఈ రెండు బ్లాక్ లలో పనిచేసే ఉద్యోగ సిబ్బంది విధులకు హాజరు కాలేదు. ఇక కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సెక్రటేరియట్ ఉద్యోగితో సన్నిహితంగా మెలిగిన మిగితా ఉద్యోగులందరూ ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు.

సెక్రటేరియట్ ౩, 4 బ్లాకులు మూసివేత

సెక్రటేరియట్ ౩, 4 బ్లాకులు మూసివేత


ప్రస్తుతం ప్రభుత్వం ౩, 4 రెండు బ్లాక్ లలో పనిచేసే సిబ్బందిని వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని కోరారు. ఇక సెక్రటేరియట్ లోని మొత్తం ఐదు బ్లాకులను శుభ్రం చేసిన అధికారులు కరోనా పాజిటివ్ గా తేలిన ఉద్యోగి మే 27వ తేదీన హైదరాబాద్ నుండి ఏపీకి వచ్చిన వ్యక్తిగా వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో హైదరాబాద్ లో చిక్కుకుపోయిన సదరు ఉద్యోగి ఇటీవల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో అమరావతికి తిరిగి వచ్చారు. ప్రస్తుతం ఆయన కరోనా బారిన పడ్డారు.

హైదరాబాద్ నుండి ఇటీవల అమరావతి వచ్చిన ఉద్యోగి .. ఉద్యోగుల్లో కరోనా టెన్షన్

హైదరాబాద్ నుండి ఇటీవల అమరావతి వచ్చిన ఉద్యోగి .. ఉద్యోగుల్లో కరోనా టెన్షన్


ఇక తాజాగా ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ కుటుంబ సభ్యులలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో, ఆయన కుటుంబ సభ్యులంతా హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఇక మంత్రి శంకర్ నారాయణ కు కరోనా నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగికి కరోనా పాజిటివ్ రావడంతో ఉద్యోగ వర్గాల లో టెన్షన్ మొదలైంది. గడచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 104 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఇందులో ఏపీకి చెందినవి 76 , ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన 28 మందికి కరోనా పాజిటివ్ అని పేర్కొన్నారు వైద్యాధికారులు. ఇక తాజాగా ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 3676 కు చేరింది.

English summary
Two blocks of the Andhra Pradesh Secretariat were shut after an employee has tested positive for the novel coronavirus. The employees in two blocks have been asked to work from home and all five blocks at Secretariat are being sanitised.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X