విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా లక్షణాలతో విజయవాడలో దంపతుల మృతి .. ఐసోలేషన్ కు వారి పిల్లలు, బంధువులు

|
Google Oneindia TeluguNews

ఏపీలో క‌రోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంది. ఇప్పటి వరకు ఏపీలో 40 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర‌వ్యాప్తంగా కరోనా ఇప్పుడు కలకలంగా మారింది. ఒక్కసారిగా పెరిగిన కేసులతో రాష్ట్రం ఉలిక్కిపడింది. ఇక ఇదే సమయంలో విజ‌య‌వాడ‌లోని పాత‌బ‌స్తీకి చెందిన భార్య‌భ‌ర్త‌లు ఒక్క‌రోజు వ్య‌వ‌ధిలోనే మ‌ర‌ణించటం వీరికి కరోనా లక్షణాలు ఉండటంతో ఒక్కసారిగా షాక్ తగిలినట్టయ్యింది.ఇక వీరి పిల్లలు, బంధువులను క్వారంటైన్ కు తరలించారు.

ఇటీవల ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మతపరమైన ప్రార్థ‌న‌ల కోసం తాజాగా చనిపోయిన ఈ దంపతులు వెళ్లివ‌చ్చిన‌ట్లుగా స్థానికులు చెబుతున్నారు. దీంతో మ‌రింత ఆందోళ‌న మొద‌లైంది. ఇక జమాత్ ప్రార్ధనలకు వెళ్ళిన వారికి చాలా మందికి కరోనా సోకినట్టుగా తాజాగా గుర్తించారు అధికారులు . ఇక ఈ నేపధ్యంలోనే విజ‌య‌వాడ పాతబస్తీలో నివ‌సిస్తున్న‌ సదరు దంపతులు కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ఓ మత పరమైన కార్యక్రమానికి వెళ్లొచ్చారు. విజ‌య‌వాడ‌లోని అదే ప్రాంతానికి చెందిన మ‌రో 26 మంది కూడా ఢిల్లీలో జ‌రిగిన మ‌త కార్య‌క్ర‌మానికి వెళ్లిన్న‌ట్లుగా గుర్తించిన అధికారులు వారంద‌రినీ క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అంద‌జేస్తున్నారు. ఇక ఆ కార్యక్రమానికి వెళ్లి వచ్చిన త‌ర్వాత దంపతులిద్దరూ ఒకే లక్షణాలతో 24గంటల వ్యవధిలో చనిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

couple Death in Vijayawada with corona symptoms .. Isolation to their children and relatives

ఆదివారం సాయంత్రం భార్య న్యుమోనియాతో చనిపోగా సోమవారం ఉదయం ఆమె భర్త కూడా అవే లక్షణాలతో కొత్త ప్రభుత్వాసుపత్రిలో చనిపోయాడు. దగ్గు, ఆయాసం లక్షణాలతో వీరిద్దరు మృతిచెందడంతో కరోనా సోకిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిని ప‌రీక్షించిన డాక్టర్లు వారికి కరోనా సోకిందా లేదా అన్నది మాత్రం ధ్రువీకరించడంలేదు.
అయినా కరోనా లక్షణాలు ఉన్న నేపధ్యంలో వారి ఇద్దరు కుమార్తెలతో పాటు ఇతర బంధువులను అధికారులు క్వారంటైన్‌కు తరలించారు.వారి శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపిన అధికారులు దంప‌తుల మృతిపై నివేదికలు వస్తేనే గానీ తాము అధికారంగా చెప్పలేమని చెబుతున్నారు.

English summary
The number of corona cases in AP increases day by day. So far, there have been 40 cases of AP. Statewide corona has now become a tension. The state has been hit with a number of cases. At the same time, a couple in Vijayawada died in shock at the same time as they had corona symptoms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X