విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ పాయింట్ దగ్గరే గొడవ షురూ... బెజవాడ గ్యాంగ్ వార్‌ వెనుక అసలు కథ ఇదే...

|
Google Oneindia TeluguNews

విజయవాడలో ఇటీవల సంచలనం రేకెత్తించిన గ్యాంగ్ వార్‌కు సంబంధించి పోలీసులు 13 మంది నిందితులను అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి 5 మందిని,గురువారం ఉదయం 8 మందిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. నిందితుల గాలింపు కోసం పటమట,మాచవరం,పెనమలూరు పోలీసుల నేత్రుత్వంలో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇంకా కొంతమంది నిందితులను పట్టుకోవాల్సి ఉందని.. త్వరలోనే వారిని పట్టుకుంటామని చెప్పారు. శుక్రవారం(జూన్ 5) నిందితులను మీడియా ముందుకు తీసుకొచ్చిన సీపీ తిరుమలరావు.. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించారు.

గ్యాంగ్ వార్ వెనుక అసలు కథ..

గ్యాంగ్ వార్ వెనుక అసలు కథ..

యనమలకుదురులో 7 సెంట్ల స్థలంలో ఒక వెంచర్‌ను డెవలప్‌ చేసేందుకు ప్రదీప్ రెడ్డి,దనేకుల శ్రీధర్ అనే ఇద్దరు 2018లో చేతులు కలిపారు. ఇందుకోసం మొదట చెరో రూ.40లక్షలు పెట్టుబడి పెట్టారు. కానీ వెంచర్‌ పూర్తి కావడానికి మొత్తం రూ.1కోటి 50లక్షలు పైనే ఖర్చయింది. అంత డబ్బు తన వద్ద లేదని చెప్పడంతో ప్రదీప్ రెడ్డి మరికొందరితో కలిసి 2019లో వెంచర్ పూర్తి చేశాడు. వెంచర్ పూర్తయ్యాక లావాదేవీల విషయంలో ప్రదీప్,శ్రీధర్ మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రదీప్ రెడ్డి.. బట్టు నాగబాబు అలియాస్ చిన్న నాగబాబును సంప్రదించాడు.

అలా గొడవ షురూ..

అలా గొడవ షురూ..

నాగబాబు ఈ సెటిల్‌మెంట్ మొదట తోట సందీప్‌కు అప్పగించాడు. అదే సమయంలో సందీప్‌కు తెలియకుండా పండును కూడా ఇన్వాల్వ్ చేశాడు. మే 29న ప్రదీప్ రెడ్డి,శ్రీధర్,నాగబాబు,తోట సందీప్ దీనిపై చర్చిస్తుండగా.. పండు అక్కడికి వచ్చాడు. పండును చూసి సందీప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'నేను ఇన్వాల్వ్ అయిన సెటిల్‌మెంట్‌లోకి నువ్వెలా వస్తావు..' అని ప్రశ్నించాడు. నాగబాబు పిలిస్తేనే వచ్చానని పండు బదులివ్వడంతో.. పిలిచినా సరే,నన్ను చూసైనా ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సింది అన్నాడు. అలా ఇద్దరి మధ్య గొడవకు బీజం పడింది. నిజానికి ఈ ఇద్దరి మధ్య గతం నుంచి స్నేహం ఉంది. పండు సందీప్‌ను అన్నా అని పిలుస్తుంటాడు. అయితే సీనియర్ అయిన తనను పండు లెక్క చేయట్లేదని సందీప్ భావించాడు.

పండు ఇంటికి సందీప్.. సందీప్ షాపుకు పండు..

పండు ఇంటికి సందీప్.. సందీప్ షాపుకు పండు..


అదే రోజు సాయంత్రం సందీప్ తన సోదరుడు జగదీష్,కొంతమంది అనుచరులను వెంటేసుకుని పండు ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో పండు తల్లి మాత్రమే ఇంట్లో ఉంది. దీంతో ఆమెతో గొడవపడి ఇంటికెళ్లిపోయాడు. కాసేపటికి ఇంటికొచ్చిన పండుకు అసలు విషయం తెలిసింది. మే 30వ తేదీన అనుచరులతో కలిసి సందీప్‌కు చెందిన శివ బాలాజీ స్టీల్ షాప్‌కి వెళ్లిన పండు.. షాపులో పనిచేసే రాజేష్,సాగర్ అనే ఇద్దరిపై దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసి సందీప్ తీవ్ర కోపోద్రిక్తుడై పండుకు ఫోన్ చేశాడు. ఫోన్‌లో ఇద్దరూ నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేదాకా వెళ్లారు.. రారా చూసుకుందాం.. అంటూ ఇద్దరూ సవాల్ విసురుకున్నారు.

గ్యాంగ్ వార్‌లో సందీప్ మృతి..

గ్యాంగ్ వార్‌లో సందీప్ మృతి..

మే 30వ తేదీ సాయంత్రం తోట వారి వీధిలోని ఓ ఖాళీ స్థలంలో సందీప్,పండు గ్యాంగ్‌లు కలిశాయి. మొదట మామూలుగానే ఇద్దరు మాట్లాడుకున్నారు. కానీ మధ్యలో ఓ వ్యక్తి కారం చల్లడం,కర్రతో దాడి చేయడంతో ఘర్షణ మొదలైంది. ఇరు వర్గాలు రాళ్లు,కత్తులతో దాడులు చేసుకున్నారు. దాడిలో తోట సందీప్ తీవ్రంగా గాయపడటంతో లిబర్టీ ఆసుపత్రికి తరలించారు. పండును గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పండు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పండు బ్యాచ్‌కి చెందిన రేపల్లె ప్రశాంత్,ఆకుల రవితేజ,ప్రేమ్ కుమార్,ప్రభు కుమార్,శ్రీను నాయక్ లంకలపల్లి వెంకటేష్,భాషా,ప్రతాప్ సాయి,గాలి సాయి,సంతోష్,తిరుపతిరావు,ఓరుగంటి దుర్గా ప్రసాద్,ఓరుగంటి అజయ్‌లను అరెస్ట్ చేసినట్టు సీపీ తిరుమల రావు తెలిపారు. నిందితుల నుంచి కత్తులు,బ్లేడ్లు,రాడ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు.

రౌడీయిజం మానేయాలని సీపీ వార్నింగ్..

రౌడీయిజం మానేయాలని సీపీ వార్నింగ్..


బెజవాడలో ఉన్న రౌడీ షీటర్లు,లేదా రౌడీయిజం పట్ల ఆకర్షితులవుతున్నవారు ఇకనైనా తమ కార్యకలాపాలకు స్వస్తి పలికితే మంచిదని.. లేనిపక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సీపీ హెచ్చరించారు. విజయవాడలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే సహించేది లేదన్నారు. అసాంఘీక శక్తులను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు.

English summary
Vijayawada CP Tirumala Rao held a press meet on Friday afternoon to explain completed details of Vijayawada gang war which is happened few days back. He said its all about a property settlement,difference between Sandeep and Pandu led to gang war.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X