విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసిపి లోకి మ‌రో టిడిపి నేత‌: జ‌గ‌న్ తో భేటీ : విజ‌య‌వాడ లోక్‌స‌భ అభ్య‌ర్దిగా..!

|
Google Oneindia TeluguNews

వైసిపి లో కి వ‌ల‌స‌ల క్యూ కొన‌సాగుతోంది. ఆమంచి కృష్ణ‌మోహ‌న్..అవంతి శ్రీనివాస రావు టిడిపిని వీడి వైసిపిలో చేరారు. ఇక‌, తాజాగా టిడిపి ఆవిర్భావం నుండి పార్టీలో ఉంటూ..కొంత కాలంగా దూరంగా ఉన్న ఓ కీల‌క నేత నేడు జ‌గ‌న్ తో భేటీ కానున్నారు. ఆయ‌న వైసిపి లో చేర‌టం..విజ‌య‌వాడ ఎంపీగా పోటీ చేయ‌టం దాదాపు ఖ‌రారైంది.

వైసిపి లోకి మ‌రో టిడిపి నేత‌..
వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఎలక్ట్రికల్స్ చైర్మన్ అయిన జై రమేష్... ఎన్టీరామారావు కుటుంబానికి సన్ని హితుడు అయిన టీడీపీ నేత దాసరి జై రమేశ్ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం 4 గంటల కు లోటస్‌‌పాండ్‌లో వైసీపీ అధినేత జగన్‌తో జై రమేష్ భేటీ అయ్యే అవకాశం ఉంది. రమేష్ కొంతకాలంగా టీడీపీ దూ రంగా ఉంటూ వస్తున్నారు. ద‌గ్గుబాటి తో సన్నిహితంగా ఉండేవారు. కొంత కాలంగా విజ‌య‌వాడ లో స్థానికంగా ప్ర‌భావం చూపే ఓ సామాజిక వ‌ర్గానికి అక్క‌డి నుండి పోటీ కి దింపాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు.

Dasari jai Ramesh Joining in YCP : Contest form Vijayawada Loksabha constituency

గ‌తంలో ఘ‌ట్ట‌మ‌నేని ఆది శేష‌గిరి రావు విజ‌య‌వాడ నుండి పోటీ చేయాల‌ని భావించినా..జ‌గ‌న్ అందుకు అంగీక‌రించ‌లేదు. దీంతో.. కొత్త అభ్య‌ర్దిని అదే విధంగా స్థానికంగా ప్ర‌భావం చేపే వారిని అక్క‌డి నుండి బ‌రిలోకి దింపాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. దీంతో.. ద‌గ్గుబాటి సూచ‌న‌ల‌తో గ‌తంలో విజ‌యవాడ నుండి పోటీ చేసిన దాస‌రి జై ర‌మేష్ వైసిపి లో చేరుతున్నారు.

గ‌తంలో పోటీ..ఇప్పుడు వైసిపి నుండి..
దాస‌రి జై ర‌మేష్ టిడిపి నుండి 1998 లో విజ‌య‌వాడ లోక్‌స‌భ అభ్య‌ర్దిగా పోటీ చేసారు. ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్ది ప‌ర్వ‌త‌నేని ఉపేంద్ర..జై ర‌మేష్ పై 30067 ఓట్ల ఆధిక్య‌త తో గెలుపొందారు. ఆ త‌రువాత ఆయ‌న కొంత కాలం టిడిపి లో కొన‌సాగినా..తాజాగా టిడిపికి దూరంగా ఉన్నారు. విజ‌య‌వాడ లో టిడిపి నుండి గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన కేశినేని నాని తిరిగి పోటీ చేయ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది.

అదే స‌మ‌యంలో గ‌త ఎన్నిక‌ల్లో వైసిపి నుండి విజ‌య‌వాడ ఎంపీగా పోటీ చేసిన కోనేరు రాజేంద్ర‌ ప్ర‌సాద్ రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. దీంతో..అదే సామాజిక వ‌ర్గం..ఆర్దికంగా బ‌ల మైన స్థానిక నేత అయిన జై రాం ర‌మేష్ వైపు జ‌గ‌న్ మొగ్గు చూపారు. ఇప్ప‌టికే పార్టీ కీల‌క నేత‌ల‌తో జై రాం ర‌మేష్ మంత‌నాలు పూర్త‌య్యాయి. ఇక‌, జ‌గ‌న్ ను క‌లిసిన త‌రువాత జై రాం ర‌మేష్ ను విజ‌య‌వాడ నుండి లోక్‌స‌భ అభ్య‌ర్దిగా వైసిపి అధినేత ప్ర‌క‌టించ‌నున్నారు.

English summary
TDP senior leader Ji Ramesh joining in YCP . Today meet with jagan and join in party. In up coming elections he caontest as MP candidate from Vijayawada constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X