విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెజవాడలో పోలీస్ జులుం .. ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్ పై చెయ్యి చేసుకున్న డీసీపీ

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా డాక్టర్లు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ఇక విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎదుట ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న ఓ జూనియర్ డాక్టర్‌పై డీసీపీ చేయి చేసుకోవడం విజయవాడలో కలకలం రేపింది. ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లపై పోలీస్ జులుం పై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

<strong>మెంటల్ కండీషన్ బాగోలేదా ? సొంతపార్టీ పై కోపమా ? జమ్ముకాశ్మీర్ పై కేశినేని వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ </strong>మెంటల్ కండీషన్ బాగోలేదా ? సొంతపార్టీ పై కోపమా ? జమ్ముకాశ్మీర్ పై కేశినేని వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

ఎంసీఐ స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ ను ఏర్పాటు చేస్తూ పార్లమెంటు ఓ బిల్లును పార్లమెంటు సమావేశాల్లో ఇటీవల ఆమోదించింది. దీంతో ఈ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన బాట పట్టారు వైద్యులు. ఇందులో భాగంగా విజయవాడలోని ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం వద్ద జూనియర్ డాక్టర్లు పాస్ అయిన నాటి నుండి వరుస ఆందోళనలకు దిగారు. ఇక ఈ రోజు ఆందోళన నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్లను అక్కడ్నుంచి పంపించాలని ఉద్దేశంతో ఆందోళన చేస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

DCP thrashes a junior doctor who agitated against the NMC bill

ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన డీసీపీ హర్షవర్థన్ ఆందోళనకారులను చూడగానే సహనం కోల్పోయారు. జూనియర్ డాక్టర్ల దగ్గరకు వెళ్లి ఆందోళనను విరమించాలని ఆదేశించారు. కానీ అందుకు ఒప్పుకోని జూనియర్ డాక్టర్లు వాగ్వాదానికి దిగారు. తాము శాంతియుతంగా ఆందోళన చేస్తున్నామని డిసిపికి చెప్పారు. దీంతో ఒక్కసారిగా సహనం కోల్పోయిన హర్షవర్థన్ ఓ జూనియర్ డాక్టర్ కాలర్ పట్టుకుని చెంప పగిలేలా కొట్టారు . దీంతో జూనియర్ డాక్టర్లు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

DCP thrashes a junior doctor who agitated against the NMC bill

డీసీపీ దాడిపై ఆగ్రహానికి లోనైన జూనియర్ డాక్టర్ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పోలీస్ ఉన్నతాధికారులు ఈ విషయమై ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాగా, ఈ వ్యవహారంపై డీసీపీ హర్షవర్థన్ నుంచి ఇంతవరకూ ఎలాంటి వివరణ రాలేదు. కాని డిసిపి తీరుపై డాక్టర్లు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఆయనపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ మేరకు జూనియర్ డాక్టర్లు వీడియో పుటేజీని కూడ డీజీపీకి అందించారు.

English summary
junior doctors who is agitating against the NMC bill in front of the Vijayawada NTR Health University is in trouble by police. dcp is outraged over the junior doctors who are agitating and he thrashed a junior doctor. The Junior doctors are demanding action against the DCP, who is holding the collar of the junior doctor and thrashed .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X