విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం జగన్ ధైర్యం ఏంటి..! ప్రధాని.. కేసీఆర్‌ను చూసైనా మార్పు రాదా..: ఉండవల్లిలో ఏం జరుగుతోంది..!

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. ముఖ్యమంత్రి జగన్ ప్రతీ రోజు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రిని మంత్రులు..అధికారులు యధావిధిగా కలుస్తున్నారు. ఈ విపత్తు సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరివిగా విరాళాలు ఇవ్వాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ పిలుపుకు పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తోంది. పలువురు ప్రముఖులు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చి చెక్కులు స్వయంగా సీఎం జగన్‌కు అందిస్తున్నారు. ఆ సమయంలో వారి జిల్లాలకు చెందిన మంత్రులు..ప్రజా ప్రతినిధులు సైతం హాజరవుతున్నారు.

ఇక, మంత్రులు..కొందరు అధికార పార్టీ నేతలు లాక్ డౌన్ ను పక్కన పెట్టి వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. వారు సైతం వచ్చి సీఎం సమావేశాల్లో పాల్గొంటున్నారు. అయితే, ఇక్కడ ఒక సమస్య వెలుగు లోకి వచ్చింది. ముఖ్యమంత్రిని నేరుగా కలవకున్నా.. టీవీల ద్వారా ..పత్రికల్లో సీఎం సమావేశాలను..చెక్ లు అందిస్తున్న ఫొటోలు చూస్తున్న వారు మాత్రం విస్తుపోతున్నారు. జగన్ ధైర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పార్టీ నేతలు సైతం ఈ విషయం పైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ వారి ఆందోళనకు అసలు కారణం ఏంటి.. ఏం జరగుతోంది..

మాస్క్ లేకుండానే సీఎం వద్దకు నేతలు...ప్రముఖులు

మాస్క్ లేకుండానే సీఎం వద్దకు నేతలు...ప్రముఖులు

ఏపీలో కరోనా వ్యాప్తి చెందుతోంది. ఈ సమయంలో ముఖ్యమంత్రి నిరంతర సమీక్షలతో మంత్రులు..అధికారులకు సూచనలు చేస్తున్నారు. ప్రతీ ఒక్కరూ ఈ సమయంలో మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు ఆదేశిస్తున్నాయి. కానీ, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న సమీక్షల్లో మాత్రం సీఎం జగన్ అంతమందితో సమావేశమైనా..మాస్క్ ధరించటం లేదు. అధికారులు తమ కార్యాలయాల్లో అధికారిక విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో కార్యాలయంలో ఉద్యోగులతో పాటుగా అనేక మందితో సమావేశాలు కొనసాగిస్తున్నారు. ఇక, ముఖ్యమంత్రి వద్ద జరుగుతున్న సమీక్షల్లో కొందరు మంత్రులు..కొందరు అధికారులు మాత్రమే మాస్క్‌లు ధరించి కనిపిస్తున్నారు. ముఖ్యమంత్రికి దూరంగా కూర్చుంటున్నా.. మాస్క్‌లు ధరించకుండా పోవటం చర్చకు కారణమైంది.

విజయసాయిరెడ్డి సీఎం జగన్‌కు బలమా..బలహీనతా : ఎక్కడ తేడా వచ్చింది: మారుతున్న లెక్కలు...!విజయసాయిరెడ్డి సీఎం జగన్‌కు బలమా..బలహీనతా : ఎక్కడ తేడా వచ్చింది: మారుతున్న లెక్కలు...!

మాస్కులు లేకుండానే సీఎంకు చాలా దగ్గరగా...

మాస్కులు లేకుండానే సీఎంకు చాలా దగ్గరగా...

ఇదే సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి పెద్ద మొత్తంలో నిధులు అందిస్తున్నారు. అందుకోసం రాష్ట్రంలోని జిల్లాల నుండే కాకుండా...పొరుగు రాష్ట్రాల నుండీ తరలి వస్తున్నారు. అందులో పారిశ్రామిక ప్రముఖులు..వివిధ సంఘాల ప్రతినిధులు ఉన్నారు. వారిలో అనేక మంది అంత దూరం ప్రయాణించి వచ్చినా.. ముఖ్యమంత్రిని కలిసే సమయంలో మాత్రం ఎంత వరకు జాగ్రత్తలు పాటిస్తున్నారో...సీఎం క్యాంపు కార్యాలయ అధికారులు వైరస్ సమీపంలోకి కూడా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనేదే ఇప్పుడు అనేక మందికి ఆసక్తి కరంగా మారుతోంది. మీడియాకు విడుదల చేస్తున్న వీడియోలు..ఫొటోల్లో మాత్రం వారెవరూ సీఎం వద్దకు వచ్చిన సమయంలో మాస్కులు పెట్టుకోకుండానే...ముఖ్యమంత్రికి అతి దగ్గరగా ఉండటం కనిపిస్తోంది.

 ప్రధాని..కేసీఆర్ సైతం రక్షణ చర్యలు..

ప్రధాని..కేసీఆర్ సైతం రక్షణ చర్యలు..

ప్రధాని మోదీ...కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం సమీక్షలు..వీడియో కాన్ఫిరెన్స్ లు నిర్వహించే సమయంలో సైతం మాస్కులతో కనిపిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం మాస్కులు ధరించటంతో పాటుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ, ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఎంత మందితో సమీక్షలు..సమావేశాలు నిర్వహిస్తున్నా..జాగ్రత్తలు తీసుకోవటం లేదనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రజలకు వైరస్ దగ్గరకు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన సూచనలు చేస్తున్న ముఖ్యమంత్రి తన వద్దకు పెద్ద సంఖ్యలో జనాలు వస్తున్న సమయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Recommended Video

Lockdown Lifting In AP || కరోనా వైరస్ వ్యాప్తిని ఎప్పటికీ కంట్రోల్ చెయ్యలేం : సీఎం జగన్
 సీఎం క్యాంపు కార్యాలయం ఉండే చోటే కరోనా పాజిటివ్ కేసు

సీఎం క్యాంపు కార్యాలయం ఉండే చోటే కరోనా పాజిటివ్ కేసు

ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న ఉండవల్లి సమీపంలోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే విధంగా పొరుగునే ఉన్న బెజవాడ..గుంటూరుల్లోనే కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. సీఎం క్యాంపు కార్యాలయంలోకి వచ్చే సమయంలో ప్రతీ ఒక్కరినీ చెక్ చేసి..సాండైజర్ ఇచ్చిన తరువాతనే లోపలకు అనుమతిస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయినా.. ఆ వీడియోలు..ఫొటోలు చూస్తున్న వారిలో మాత్రం ముఖ్యమంత్రి ధైర్యం ఏంటి... తన వద్దకు వచ్చే వారిని అంత దగ్గరకు రానీయకండా..అధికారులైన నియంత్రించాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. రాజభవన్‌లో వెలుగులోకి వచ్చిన కరోనావ్యవహారం తరవాతైనా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అధికారులు మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.

English summary
As the Coronavirus is taking a fast pace in AP, CM Jagan is seen without a face mask when he meets industrialists and other officials. People coming to CM Camp office to donate are seen without a mask which might put CM Jagan at risk says observers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X