• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చంద్రబాబు గెలుపు దేశానికి దిక్సూచి: కేజ్రీవాల్: హైదరాబాద్ ను నేనే కట్టా: సీఎం

|

విజయవాడ: ఊహించినట్టుగానే.. తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి జాతీయ స్థాయి నాయకులను రప్పిస్తున్నారు. జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలోకి పాల్గొన్న మూడురోజుల వ్యవధిలో..ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను బరిలో దింపారు చంద్రబాబు.

విజయవాడ, గుంటూరు జిల్లాల్లో స్థిరపడి, వ్యాపారాలు చేసుకుంటున్న ఉత్తరాది ప్రజలతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి కేజ్రీవాల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం- కృష్ణాజిల్లా మైలవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. కేజ్రీవాల్ హిందీ ప్రసంగాన్ని కేశినేని నాని తెలుగులో అనువదించారు.

టీడీపీకి ఓటేయండి..బీజేపీని ఓడించండి: కేజ్రీవాల్

టీడీపీకి ఓటేయండి..బీజేపీని ఓడించండి: కేజ్రీవాల్

గురువారం మధ్యాహ్నం విజయవాడలోని ఎన్ఏసీ కల్యాణ వేదికలో ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమావేశంలో కేజ్రీవాల్ ప్రసంగించారు. క్లుప్తంగా మాట్లాడి, తన ప్రసంగాన్ని ముగించడం విశేషం. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతీసారి, రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీసిందని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానానికి చంద్రబాబు ఆద్యుడని అన్నారు. ఆధునికాంధ్రప్రదేశ్ నిర్మాత చంద్రబాబేనని ప్రశంసించారు.

కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో తెలుగు వారి పాత్ర కీలకం

కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో తెలుగు వారి పాత్ర కీలకం

చంద్రబాబు చేసిన రాష్ట్రాభివృద్ధిని యావత్ దేశమే కాకుండా.. ప్రపంచం మొత్తానికీ తెలుసని కేజ్రీవాల్ కితాబిచ్చారు. పేదలు, రైతాంగం కోసం పనిచేసే ఏకైక నాయకుడు చంద్రబాబు మాత్రమేనని అన్నారు. చంద్రబాబు గెలుపు దేశానికి దిక్సూచి అవుతుందని చెప్పారు. 25కు 25 లోక్ సభ సీట్లు టీడీపీకే ఇవ్వాలని కోరుతున్నానని చెప్పారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో తెలుగు ప్రజల పాత్ర కీలకం అవుతుందని కేజ్రీవాల్ చెప్పారు.

జగన్ కు ఓటు వేస్తే.. బీజేపీకి వేసినట్టే

జగన్ కు ఓటు వేస్తే.. బీజేపీకి వేసినట్టే

కేంద్రంలో బీజేపీని ఓడించాలని పిలుపిచ్చారు కేజ్రీవాల్. జీఎస్టీ అమలు చేయడం, నోట్ల రద్దు వంటి అమానవీయ చర్యల వల్ల చిరు వ్యాపారులు చితికిపోయారని కేజ్రీవాల్ చెప్పారు. నరేంద్రమోడీ తీసుకున్నవన్నీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలనేనని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు.. ఢిల్లీకి సంపూర్ణ అధికారాల కోసం తాము పోరాటం చేస్తున్నామని, ఇద్దరిదీ ఒకే లక్ష్యమని కేజ్రీవాల్ అన్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వం నియంతృత్వ పోకడలను పోతోందని విమర్శించారు.

హిందూ, ముస్లింల మధ్య మోడీ చిచ్చు

హిందూ, ముస్లింల మధ్య మోడీ చిచ్చు

ఎన్నికల సమయంలో ఏవేవో పార్టీలు వచ్చి, సాధ్యం కాని హామీలను ఇస్తారని అన్నారు. అలాంటి రాజకీయ నాయకులు, పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టీడీపీకి అత్యధిక సీట్లను కట్టబెట్టాలని అన్నారు. తామందరం కలిసి, కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తామని చెప్పారు. దీనిద్వారా రాష్ట్ర ప్రయోజనాలను రాబ్టటుకుంటామని అన్నారు. అయిదేళ్ల మోడీ పాలనలో అన్ని వర్గాలు కూడా అన్యాయానికి గురయ్యారని చెప్పారు. హిందువులు, ముస్లింల మధ్య చిచ్చు పెట్టారు. జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తే.. బీజేపీకి వేసినట్టేనని కేజ్రీవాల్ అన్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నేను కట్టిందే..ఔటర్ రింగ్ రోడ్ నేను వేసిందే: చంద్రబాబు

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నేను కట్టిందే..ఔటర్ రింగ్ రోడ్ నేను వేసిందే: చంద్రబాబు

అంతకుముందు- చంద్రబాబు సుదీర్ఘంగా ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ను తానే కట్టానని చెప్పారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, హైటెక్ సిటీ, సైబరాబాద్ వంటి ప్రాంతాలను తానే అభివృద్ధి చేశానని అన్నారు. దేశంలోనే హైదరాబాద్ వంటి నగరం మరొకటి లేదని, దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దానని చెప్పారు. అలాంటి నగరాన్ని తాము మరోసారి నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని చంద్రబాబు విమర్శించారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే.. సీబీఐ, ఐటీ, ఈడీ వంటి ప్రభుత్వ సంస్థలను ప్రయోగించి, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులను ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేయాలో, అంతా చేస్తారని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయలేదని విమర్శించారు.

English summary
Aam Aadmi Party President and Chief Minister of Delhi Aravind Kejriwal is participated in Telugu Desam Party Election Campaign at Vijayawada in Andhra Pradesh. A meeting with North Indians who settled in Vijayawada organized by TDP leaders. Kejriwal participated as Chief Guest in this gathering. He urged the people to cast their Vote Chandrababu for development of the State. Kejriwal critics on target to Prime Minister Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X