విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రజావేదిక కూల్చివేత మంచిదే ...అక్రమ కట్టడాలన్నీ కూల్చాలి .. సీపీఎం నేత బీవీ రాఘవులు

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్ పై సీపీఎం అగ్ర నేత బీవీ రాఘవులు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజా వేదిక కూల్చివేతపై మంచి నిర్ణయం అని చెప్తూనే జగన్ కు చురకలంటించారు. ఉండవల్లిలో గత ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదిక కట్టడాన్ని జగన్ సర్కారు కూల్చివేస్తుండడం పట్ల మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ విమర్శిస్తుండగా, మరికొందరు అక్రమకట్టడాలు ఎక్కడున్నా కూల్చేయాలంటూ ప్రభుత్వ వైఖరిని ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనే బీవీ రాఘవులు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రజావేదిక విషయంలో జగన్ చెప్పిందొకటి .. అధికారులు చేసిందొకటి.. వ్యూహమా .. టెన్షనాప్రజావేదిక విషయంలో జగన్ చెప్పిందొకటి .. అధికారులు చేసిందొకటి.. వ్యూహమా .. టెన్షనా

సీపీఎం అగ్రనేత బీవీ రాఘవులు కూడా ప్రజావేదిక కూల్చివేతపైమాట్లాడుతూ గత ప్రభుత్వం అక్రమ కట్టడాలపై నోటీసులు ఇచ్చి సరిపెట్టుకుందని అన్నారు. అయితే, ఇప్పటి ప్రభుత్వం అక్రమ కట్టడాలు లేకుండా చేస్తాం అంటుందని ఆయన పేర్కొన్నారు. కేవలం ప్రజావేదికను కూల్చి అంతటితో సరిపెట్టుకుంటే మాత్రం జగన్ చిత్తశుద్ధిని శంకించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు . కేవలం ప్రజావేదికను కూల్చి అంతటితో చేతులు దులుపుకోకుండా , కృష్ణా నది కరకట్ట పరిధిలో ఎక్కడ ఏ అక్రమకట్టడం ఉన్నా కూల్చివేయాల్సిందేనని రాఘవులు అన్నారు.

demolition of praja vedika is good ... all illegal structures should be demolished .. CPM leader B.V Raghavulu

సీపీఎం సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజావేదిక కూల్చివేత మంచిదేనని జగన్ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూనే అయితే అది ప్రజావేదికతోనే నిలిచిపోకూడదని మిగిలిన వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజావేదికను కూల్చి మిగిలిన భవనాలను వదిలేస్తే అది కక్ష పూరిత చర్యే అవుతుందని ఆయన పేర్కొన్నారు .
ఇక టీడీపీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడంతో వీటి నిర్మాణం బాగా పెరిగిందంటూ ఆయన మండిపడ్డారు . అక్రమ కట్టడాలు కూల్చివేతపై కూడా ఏపీలో రాజకీయం చేస్తున్నారని ఇది దురదృష్టకరమని బీవీ రాఘవులు పేర్కొన్నారు .

English summary
The demolition of the praja vedika is good but all illegal structures should be demolished demanded CPM leader B.V Raghavulu. He said the previous government had issued notices on illegal structures. However, the present government will do so without any illegal structures, he added. He believes that if the all illegal structures are to be demolished, jagan will have to be respected. Raghavulu said that any irregularity in the Krishna river basin should be dismantled.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X