విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు అంటూ ..పార్టీ మార్పుపై దేవినేని అవినాష్ క్లారిటీ ..

|
Google Oneindia TeluguNews

దేవినేని అవినాష్ టీడీపీని వీడి వైసీపీ తీర్ధం పుచ్చుకున్తారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా వస్తున్న వార్తలకు దేవినేని అవినాష్ క్లారిటీ ఇచ్చారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటాను అని ఆయన తేల్చి చెప్పారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఒక్క మాటతో పార్టీ మార్పు ప్రచారానికి చెక్ పెట్టారు. గత కొన్ని రోజలుగా అవినాష్ టీడీపీకి గుడ్‌ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రచారం జోరందుకున్న నేపధ్యంలో దీనికి ఫుల్ స్టాప్ పెట్టటానికి సోమవారం గుంటూరులో ప్రెస్‌మీట్ నిర్వహించిన అవినాష్ వైసీపీ సర్కార్‌పై విమర్శల వర్షం కురిపించారు .

టీడీపీకి దేవినేని అవినాశ్ గుడ్ బై..!అనుచ‌రుల‌తో క‌లిసి వైసీపీలోకి..!కృష్ణా జిల్లాలో టీడీపీకి షాక్‌..టీడీపీకి దేవినేని అవినాశ్ గుడ్ బై..!అనుచ‌రుల‌తో క‌లిసి వైసీపీలోకి..!కృష్ణా జిల్లాలో టీడీపీకి షాక్‌..

తాను వైసీపీలోకి వెళ్తానని వస్తున్న పుకార్లను ఆయన ఖండించారు.వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని పేర్కొన్న అవినాష్ ఇసుక కొరత వల్ల లక్షలాది కార్మిక కుటుంబాల బాధలు వర్ణణాతీతంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 24న టీడీపీ ఆధ్వర్యంలో మరోమారు ఇసుక కొరత విషయంలో దీక్షలు చేపడుతున్నామని ఆయన ప్రకటించారు. నాలుగు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని అవినాష్ ఆరోపించారు. లక్షలాది శ్రామిక కుటుంబాలు రోడ్డున పడినా పట్టని పాలన వైసీపీ సర్కార్ సాగిస్తుందని అవినాష్ మండిపడ్డారు.

 Devineni Avinash Responds To Rumours On Party Switching

ఇక తాను పార్టీ మారడం గురించి సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్ తన చివరి శ్వాస వరకు టిడిపిలోనే ఉంటానని ఒక్క మాటలో తేల్చేశారు. చంద్రబాబు, నారా లోకేష్ అడుగుజాడల్లో నడుస్తున్నానని బదులిచ్చిన దేవినేని అవినాష్ తాను గత కొన్ని నెలలుగా విదేశీ పర్యటనలో ఉన్నానని చెప్పారు. అందుకే పార్టీ కార్యాకలాపాలకు దూరంగా ఉన్నానని, అంత మాత్రాన ఇలా తప్పుడు ప్రచారాలు చెయ్యటం కరెక్ట్ కాదని పేర్కొన్నారు.టీడీపీలో యాక్టివ్ నేతలపై అధికార పార్టీ తప్పుడు కేసులు పెడుతోందనిఆయన మండిపడ్డారు. ఇక తనకు పార్టీ మారే ఆలోచన లేదని, ఇలాంటి పుకార్లను నమ్మవద్దని ఆయన టిడిపి కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.

English summary
Former Minister Devineni Nehru's son Devineni Avinash responded to the rumours rounding in social media about the party-switching. However, the young politician responded to the rumours by condemning them. He said he would remain in TDP till his last breath.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X